DailyDose

దూళిపాళ్లపై కేసు నమోదు – TNI నేర వార్తలు

దూళిపాళ్లపై కేసు నమోదు – TNI  నేర వార్తలు

* టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, శ్రీ దూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు అయ్యింది. దూళిపాళ్లతో పాటు మరో 92 మందిపై పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు. పెదకాకాని శివాలయంలో మాంసాహారం వంటకాలపై టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈఓ కార్యాలయం వద్ద దూళిపాళ్ల బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనపై దేవదాయ శాఖ సిబ్బంది ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు.

*ర్యాలీలో కత్తి ఝళిపించిన రాజ్‌థాకరేపై కేసు
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. థానే సిటీలో జరిగిన ఒక బహిరంగ సభలో కత్తి ఝళిపించారనే అభియోగంపై ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయుధాల చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 25 కింద ఆయనతో పాటు, ఎంఎన్‌ఎస్ థానే, పాల్ఘర్ జిల్లా చీఫ్ అవినాష్ జాదవ్, థానే సిటీ చీఫ్ రవీంద్ర మోరేపై కేసులు నమోదు చేశామన్నారు. గడ్కరి చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానిక నేత ఒకరు కత్తి బహుకరించగా, దానిని రాజ్‌థాకరే ఝళిపించారు.

*లక్డీకపూల్‌ చౌరస్తాలో రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు చెలరేగాయి. రేంజ్‌ రోవర్‌ కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో కారు ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. కారులో మంటలు రావడంతో నడిరోడ్డులో కారు నిలిచిపోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ జాం అవడంతో కొద్దిసేపటిపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కారులో మంటలు చెలరేగడంతో కారు ముందు ఇంజిన్ పూర్తిగా కాలిపోయింది. కారు నెంబర్- TS04EE-8118.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మణుగూరులో (Manuguru) వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైకును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులను అశ్వాపురం మండలానికి చెందిన ఆసిఫ్‌ పాషా, భీష్మా రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం కృష్టసాగర్ ఎర్రమ్మతల్లి ఆలయం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ఉన్న అసిఫ్ పాషా(29), భీష్మ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆశ్వాపురం మండలం అమ్మగారి పల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. కొత్తగూడెం నుంచి అశ్వాపురం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* వేసవి ఉష్ణమండల అల్పపీడనం కారణంగా మధ్య, దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన వరదల్లో 58 మంది మరణించారు.వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య కనీసం 58కి పెరిగిందని, మరో 28 మంది గల్లంతయ్యారని ఫిలిప్పీన్స్ అధికారులు చెప్పారు.సెంట్రల్ లేటె ప్రావిన్సులోని బేబే నగరంలో కొండచరియలు విరిగిపడటంతో 100 మంది గ్రామస్థులు గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం ఫిలిప్పీన్స్ సైనికులు, పోలీసులు, సహాయ సిబ్బంది గాలిస్తున్నారు.వరద విపత్తు వల్ల ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం సంభవించిందని ఆర్మీ బ్రిగేడ్ కమాండర్ కల్నల్ నోయెల్ చెప్పారు.బేబే గ్రామాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి మృతదేహాలను వెలికితీశారు.భారీవర్షాలు, వరదల వల్ల సహాయ పునరావాస పనులకు ఆటంకం కలుగుతుంది.ఫిలిప్పీన్స్ దేశంలో ప్రతి ఏటా 20 తుపాన్ లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంటాయి.

* ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు రూరల్ లక్ష్మీపురం వద్ద బుధవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్రేన్, జేసీబీల సహాయంతో క్లీనర్‌ను రక్షించారు. చికిత్స నిమిత్తం క్లీనర్, డ్రైవర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* వేసవి ఉష్ణమండల అల్పపీడనం కారణంగా మధ్య, దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన వరదల్లో 58 మంది మరణించారు.వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య కనీసం 58కి పెరిగిందని, మరో 28 మంది గల్లంతయ్యారని ఫిలిప్పీన్స్ అధికారులు చెప్పారు. సెంట్రల్ లేటె ప్రావిన్సులోని బేబే నగరంలో కొండచరియలు విరిగిపడటంతో 100 మంది గ్రామస్థులు గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం ఫిలిప్పీన్స్ సైనికులు, పోలీసులు, సహాయ సిబ్బంది గాలిస్తున్నారు.వరద విపత్తు వల్ల ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం సంభవించిందని ఆర్మీ బ్రిగేడ్ కమాండర్ కల్నల్ నోయెల్ చెప్పారు.బేబే గ్రామాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి మృతదేహాలను వెలికితీశారు.

*పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో గత రాత్రి స్టేషన్‌లో వీరంగం సృష్టించారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో సెంట్రీ గార్డ్స్ ఫిర్యాదు చేశారు. వైసీపీ ముసుగులో రౌడీ షీటర్లు తిరుగుతున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*విశాఖలో డ్రగ్స్ పంజా విసిరింది. 54 గ్రాముల మాదకద్రవ్యాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వివరాలు చెప్పకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో నగరంలో డ్రగ్స్ పట్టుకోవడం ఇదే మొదటిసారి. డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు వైపల్యం చెందారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

*ఏలూరు: జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ బండల లోడుతో వెళ్తున్న వ్యాన్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది పొగలను అదుపు చేశారు. గ్యాస్ బండల వ్యాన్ని అక్కడి నుంచి తరలించడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు

*హైదరాబాద్ నగరంలోని సుల్తాన్‌బజార్ బడీచోడిలో గల ఓ కిరాణం దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. మంటలకు కిరాణా దుకాణంలోని సామాగ్రి అగ్నికి ఆహుతైంది. కాగా… సమయానికి ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

*వ్యభిచార ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ అన్నారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ కేసు వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మహబూబాబాద్‌ టాస్క్‌ ఫోర్సు పోలీసులు మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కొంత మంది ముఠాగా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తునట్టుగా గుర్తించారు.

*గంజాయిని రవాణా చేసిన కేసులో నదీమ్‌ అనే నిందితుడికి నాంపల్లి కోర్టు 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రాఫిక్‌ సబ్‌ స్టాన్సెన్స్‌ -1985 చట్టంలోని సెక్షన్‌ 20 ప్రకారం ఈ శిక్షను విధించినట్టు న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది.

*శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో చెలరేగిన హింసకు సంబంధించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ చేసిన ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. వేరే రాష్ట్రంలో జరిగిన ఘటనకు, ఖర్గోన్‌ హింసాకాండకు ముడిపెడుతూ ట్విటర్‌లో ఆయన ఫొటో పోస్టు చేయడంపై అక్కడి బీజేపీ ప్రభుత్వం మండిపడింది. పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. ఖర్గోన్‌ పట్టణంలో నవమి ఊరేగింపుపై ఆదివారం సాయంత్రం కొందరు దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఆందోళనలు చెలరేగి హింసాత్మకంగా మారింది. వాహనాలు, ఇళ్ల దహనాలు కూడా జరిగాయి. దీంతో పట్టణమంతా కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో ఓ మసీదుపై కొందరు యువకులు కాషాయ జెండాను ఎగురవేస్తు న్న ఫొటోను దిగ్విజయ్‌ సోమవారం ట్విటర్‌లో పోస్టు చేశారు. ఖర్గోన్‌ హిం సాకాండను ఆ ఫొటోకు ముడిపెట్టడంపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు. అది బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోదని కొందరు సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. దీనిపై దుమారం రేగడంతో డిగ్గీ ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు.

*పోరుమామిళ్లలోని బెస్తవీధిలో పీర్ల మాబుబాషా (అబ్బులు) ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు, వెండి నగలు అపహరించారని ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు… బెస్త వీధిలో నివాసం ఉంటున్న పీర్ల మాబుబాషా అలియాస్‌ అబ్బులు డ్రైవర్‌గా జీవనం సాగించే వాడు. రెండు వారాల క్రితం పని నిమిత్తం దూరప్రాంతానికి వెళ్లాడని, ఆ సమయంలో అతని భార్య షబానా మాబూనగర్‌ కాలనీలోని ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆదివారం ఇంటికి వచ్చి చూస్తే చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయయం తెలుసుకున్న ఎస్‌ఐ హరిప్రసాద్‌, క్లూస్‌ టీమ్‌లు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సుమారు 3 తులాల బంగారు నగలు, వెండి కాళ్లపట్టీలు, కడియాలు చోరీకి గురయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

* శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ రైల్వేస్టేషన్‌ వద్ద రైలు ప్రమాద ఘటనకు సంబంధించి నలుగురు మృతుల వివరాలు తెలిశాయి. రైల్వే పోలీసులు వారి కుటుంబాలకు సమాచారమందించారు. బాతువ పాత రైల్వే హాల్డ్‌ వద్ద సోమవారం రైలు ఢీకొని ఐదుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అసోంకు చెందిన ఉజుల్‌ బస్‌మంత్రి, బనిసర్‌ బస్‌మంత్రి, రసీదుల్లా ఇస్లామ్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన రింత్‌ సైక్‌లు మృతిచెందినట్టు రైల్వే పోలీసులు నిర్ధారించారు. మరో మృతుడి వివరాలు తెలియరాలేదు. మృతదేహాలను విజయనగరంలోని మహారాజ ఆస్పత్రి మార్చురీకి చేర్చారు. బుధవారం నాటికి కుటుంబసభ్యులు వచ్చే అవకాశముందని, వారు వచ్చిన తరువాత పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ఒడిసాలోని బరంపూర్‌కు చెందిన జుట్టు నాయక్‌ను శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలించారు. సోమవారం రాత్రి ఘటన జరిగిన నాటి నుంచి జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రమాదం ఎలా సంబంధించింది అనే దానిపై ఇంతవరకూ స్పష్టత రాలేదు. మృతులు ప్రయాణిస్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌ ఆగిందా.. లేదా ఎవరైనా చైన్‌లాగి రైల్‌ను ఆపివేశారా అన్నది స్పష్టతలేదు.

* కొప్పళ తాలూకా టనకనకల్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎంపీ కరడి సంగణ్ణ సోదరుడు బసవరాజ (బసణ్ణ) అమరప్ప కరడి (60) మృతి చెందారు. యలమగేరి నుంచి ద్విచక్ర వాహనంపై వెడుతుండగా వేగంగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను కేఎస్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక మృతిచెందారు. కొప్పళ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం చోటు చేసుకున్న ఘటనలో ఎంపీ సోదరుడు ఆకస్మికంగా మృతిచెందడంపై పలువురు బీజేపీ నాయకులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

*అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శిలో మంగళవారంజరిగింది. గ్రామానికి చెందిన మారెళ్ల చెన్నయ్య(52) నాలుగేళ్లుగా కర్ణాటకలో మిరప సాగు కౌలుకు చేసి నష్టాల పాలయ్యాడు. ఈ ఏడాది ఇసుకదర్శి, తిమిడ్తపాడులో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప సాగు చేయగా పంట దెబ్బతింది. వాటిని పీకేసి మొక్కజొన్న, శనగ పంట వేశాడు. ఈ నేపథ్యంలో రూ.7లక్షలకు పైగా అప్పులు కావడంతో వాటిని తీర్చే మార్గం కనిపించక, తీవ్ర మానసిక వేదనతో గ్రామ పరిఽధిలోని ఒక రైతు పొలంలో వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

*ప్రకాశం జిల్లాలోని బేస్తవారిపేట మండలం కలగొట్ల గ్రామ పొలాల్లో కుళ్ళిన మృతదేహం లభ్యమయింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు ముండ్లమూరుకు చెందిన నాగిరెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

* కాదేదీ దొంగలకు, దొంగతనానికి అనర్హం. చిల్లర దొంగలకు ప్రతి వస్తువూ విలువైనదే. అందులోనూ బాగా గిరాకీ ఉంటే వస్తువులు కంటబడితే ఇక చేతులు ఊరుకుంటాయా?. అవి పళ్లు అయినా, కాయగూరలైనా, చివరకు ఆకుకూరలైనా ‘హస్త’గతం చేసుకుంటే కానీ నిద్రపట్టదు. ఎండలు మండుతుండటంతో మార్కెట్‌లో కూరగాయలతో పాటు నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. దీంతో దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ఒక గోదాములో ‘ఖరీదైన’ దొంగతనమే జరిగింది. 60 కిలోల నిమ్మపండ్లను దొంగలు ఎత్తుకుపోయారు. బాగా రేటు పలుకుతున్న మరికొన్ని కాయగూరలను కూడా సంచుల్లో సద్దేసుకుని ఉడాయించారు. దీంతో ఆ గోదాములో సరుకు ఉంచిన విజిటబుల్ ట్రేడర్ మనోజ్ కశ్యప్ లబోదిబోమన్నాడు. 60 కిలోల నిమ్మకాయలు, 40 కిలోల ఉల్లిగడ్డ, 38 కిలోల వెల్లుల్లి తన గోదాము నుంచి దొంగలు ఎత్తుకెళ్లారంటూ వాపోయాడు.

*వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం రేపింది. ముంబయి వెళ్లే లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టామని 100కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. రైలు బోగీల్లో అడుగడుగునా సోదాలు చేపట్టారు.

* ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్ధంలో ఇప్ప‌టి వ‌ర‌కు 20 మంది జ‌ర్న‌లిస్టులు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. నేష‌న‌ల్ యూనియ‌న్ ఆఫ్ జ‌ర్న‌లిస్ట్స్ ఆఫ్ ఉక్రెయిన్ త‌న టెలిగ్రామ్ ఛాన‌ల్‌లో ఈ విష‌యాన్ని తెలిపింది. మృతిచెందిన జ‌ర్న‌లిస్టుల పేర్ల జాబితాను ఆ యూనియ‌న్ ప్ర‌క‌టించింది. ఆ మృతుల జాబితాను ప్రాసిక్యూట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫీసు ద్రువీక‌రించింది. మృతిచెందిన జ‌ర్న‌లిస్టుల్లో విదేశీయులు ఉన్న‌ట్లు తెలిపారు. మ‌రో వైపు ఉక్రెయిన్‌కు మ‌రోసారి భారీగా ఆయుధాల‌ను అమెరికా స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ది. సుమారు 750 మిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌రీదైన ఆయుధాల‌ను ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు వైట్‌హౌజ్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

* ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టిన ఓ వ్యక్తి.. అనంతరం తనతో గొడవకు దిగిన వృద్ధుడిని ఈడ్చుకెళ్లాడు. బిహార్ పట్నాలో ఈ ఘటన జరిగింది. నాగేశ్వర్ కాలనీలో ఓ ద్విచక్రవాహనంపై వస్తున్న వృద్ధుడిని నిందితుడు తన కారుతో ఢీకొట్టాడు. కారు బలంగా తాకడం వల్ల వృద్ధుడు పైకి లేవలేకపోయాడు. అయినా కష్టమీద పైకి లేచి.. కారు డ్రైవర్ దగ్గరికి వెళ్లాడు. వృద్ధుడికి సహాయం చేయాల్సింది పోయి.. కారు డ్రైవర్ మరింత కఠినంగా ప్రవర్తించాడు. అలాగే కారును ముందుకు పోనిచ్చాడు. కారును అలాగే గట్టిగా పట్టుకున్న వృద్ధుడిని పట్టించుకోకుండా ఈడ్చుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక బాధితుడు కిందపడిపోయాడు. స్థానికులు దీన్ని వీడియో తీశారు. వృద్ధుడు కింద పడి స్పృహ కోల్పోయినా.. కారులోని వ్యక్తి మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.

* మేడ్చల్ మండలం రాజా బొల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భర్త బ్రాహ్మణపల్లి భిక్షపతి వేధింపులు తట్టుకోలేక భార్య మమత(28) తన ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో మమత (28), పాప (3) బాబు (1)లు మృతి చెందగా…పెద్ద బాబు క్షేమంగా బయటపడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. ఓ చిన్నారిని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘ‌ట‌న మేడ్చల్ మండలం రాజా బొల్లారం గ్రామంలో చోటుచేసుకుంది. బ్రాహ్మణపల్లి భిక్షపతి, మమత(28) దంప‌తులు. వీరికి ముగ్గురు సంతానం.ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గ‌త కొద్ది రోజులుగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి

*ల్లూరు జిల్లా కావలిలో దొంగ నోట్లు సరఫరా చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేసిన కావలి పోలీసులు వారి నుంచి లక్షా 47 వేల రూపాయల విలువ చేసే దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు