Business

పెట్రోల్, డీజిల్ కు భారీ డిమాండ్ ..!- TNI వాణిజ్య వార్తలు

పెట్రోల్, డీజిల్ కు  భారీ డిమాండ్ ..!- TNI వాణిజ్య వార్తలు

* ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ వినియోగం తిరిగి గణనీయంగా పెరుగుతోంది. కరోనా పూర్వ స్థాయికి మించి నమోదవుతోంది. మార్చి నెలలో ఇంధనాలకు డిమాండ్‌ మూడేళ్ల గరిష్టానికి చేరింది. 4.2 శాతం పెరిగి 19.41 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. 2019 మార్చితో పోలిస్తే ఇది గరిష్ట స్థాయి. చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలిసిస్‌ సెల్‌ (పీపీఏసీ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్‌–19 మహమ్మారి థర్డ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావాల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో మార్చిలో ఇంధనాలకు డిమాండ్‌ కూడా మెరుగుపడింది.పెట్రోలియం ఉత్పత్తులు అన్నింటిలోకెల్లా అత్యధికంగా వినియోగించే (దాదాపు 40 శాతం) డీజిల్‌కు డిమాండ్‌ 6.7 శాతం పెరిగి 7.7 మిలియన్‌ టన్నులకు చేరింది. పెట్రోల్‌ అమ్మకాలు కొద్ది నెలల క్రితమే కోవిడ్‌ పూర్వ స్థాయిని దాటాయి. వీటి విక్రయాలు మార్చిలో 6.1 శాతం పెరిగి 2.91 మిలియన్‌ టన్నులకు చేరాయి.

*కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నెల 23న ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) అధిపతులతో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో పీఎస్‌బీల పనితీరు, వివిధ ప్రభుత్వ పథకాల అమలులో వాటి పురోగతి, కొవిడ్‌ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకున్న చర్యల అమలుపై సమీక్షిస్తారు. కేంద్ర బడ్జెట్‌ తర్వాత పీఎస్‌బీల పనితీరు సమీక్ష కోసం జరుగుతున్న తొలి సమావేశ మిదే. కొన్ని ఉత్పాదక రంగాలకు పీఎస్‌బీలు త్వరగా రు ణాలు మంజూరు చేయడంపై ఇందులో చర్చించనున్నారు.

* 5జీ స్పెక్ట్రమ్‌ ధరపై టెలికాం కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిళ్లకు దిగాయి. గతంలో ట్రాయ్‌ సిఫారసు చేసిన ధరను 80-90 శాతం తగ్గిస్తే తప్ప కంపెనీలు వేలంలో పాల్గొనే పరిస్థితి లేదని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) స్పష్టం చేసింది. 5జీ సేవలకు బాగా ఉపయోగపడే 3300-3600 మెగాహెర్జ్‌ (ఎంహెచ్‌జెడ్‌) బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను ఒక్కో ఎంహెచ్‌జెడ్‌ రూ.492 కోట్ల కనీస ధర చొప్పున వేలం వేయాలని గతంలో ట్రాయ్‌ సిఫారసు చేసింది. ఇంత ధర పెట్టి 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసి.. దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందించేందుకు ఒక్కో ఆపరేటర్‌ ఎంత లేదన్నా రూ.49,200 కోట్లు ఖర్చు చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో ఏ కంపెనీ కూడా అంత భరించే స్థితిలో లేనందున ఈ ధరను 80 నుంచి 90 శాతం వరకు తగ్గించాలని సీఓఏఐ కోరింది. 5జీ స్పెక్ట్రమ్‌ ధరపై ట్రాయ్‌ కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ లోపే కంపెనీలు 5జీ స్పెక్ట్రమ్‌ ధరపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి

*ఈ వారం మార్కెట్ల గమనాన్ని కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు స్థూల ఆర్థిక గణాంకాలు నిర్ధేశించే వీలుంది. ఈ వారంలో ఐటీ దిగ్గజ సంస్థలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. మహావీర్‌ జయంతి, అంబేడ్కర్‌ జయంతి, గుడ్‌ ఫ్రైడే కారణంగా గురు, శుక్రవారాల్లో మార్కెట్లు పనిచేయవు. స్థూలంగా ఈ వారం స్టాక్‌ మార్కెట్లు మూడు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. గత వారం ఆర్‌బీఐ పరపతి విఽధానం సానుకూలంగా ఉండటంతో స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో పాజిటివ్‌గానే క్లోజయ్యాయి. ఈ వారం కూడా సానుకూల ధోరణిలోనే సాగే అవకాశాలున్నాయి.

* కొన్ని మినహాయింపులు తప్ప… ప్రయాణీకులు రెండవ చెక్-ఇన్ బ్యాగ్‌కు ముందుగా $ 100 కు బదులు… $ 200 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు… పెద్ద పరిమాణం, లేదా… అదనపు బ్యాగ్‌కు $ 200-$ 300 వరకు చెల్లించాల్సిందే. “తూర్పు యూరప్, రష్యాలో గగనతలం మూసివేత నేపథ్యంలో… యునైటెడ్ ఇప్పుడు… అమెరికా, ఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమానాల కోసం సుదీర్ఘ మార్గాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. ఫలితంగా… తాము తాత్కాలిక బ్యాగ్ రుసుమును పెంచుతున్నామని, ఇది బరువు పరిమితుల కారణంగా ఈ నెల(ఏప్రిల్) 5 వ తేదీ, లేదా… తర్వాత జారీ చేయబడిన అన్ని కొత్త టిక్కెట్‌లకు వర్తిస్తుందని యునైటెడ్ తన వ్యాపార భాగస్వాములకు తెలిపింది. కాగా… ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-నెవార్క్ మధ్య విమానాలకు పెంచిన ఛార్జీలు వర్తించనున్నాయి. చికాగో-ఢిల్లీ, నెవార్క్-ఢిల్లీ విమానాలకు (ఒమాహా-నెవార్క్-ఢిల్లీ వంటివి) నేరుగా/వాటికి కనెక్ట్ అయ్యే విమానాలకు కూడా ఫీజులు వర్తిస్తాయ. ప్రీమియర్, ప్రీమియం క్యాబిన్, స్టార్ అలయన్స్ గోల్డ్ కస్టమర్‌లకు ఈ విమానాల్లో వారి ప్రస్తుత ఉచిత చెక్డ్ బ్యాగేజీ అలవెన్స్‌ను కొనసాగిస్తారు.

*బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) కస్టమర్లకు ఎంసీఎల్‌ఆర్‌ అనుసంధానిత రుణాలు ప్రియం కానున్నాయి. వివిధ కాలపరిమితి రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను బీఓబీ 0.05 శాతం మేరకు పెంచింది. ఈ కొత్త రేట్లు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ ఆర్‌ 7.35 శాతం, ఒక నెలకు 6.50 శాతం, మూడు నెలలకు 6.50 శాతం, ఆరు నెలలకు 7.10 శాతం అవుతాయి.

*బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) కస్టమర్లకు ఎంసీఎల్‌ఆర్‌ అనుసంధానిత రుణాలు ప్రియం కానున్నాయి. వివిధ కాలపరిమితి రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను బీఓబీ 0.05 శాతం మేరకు పెంచింది. ఈ కొత్త రేట్లు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ ఆర్‌ 7.35 శాతం, ఒక నెలకు 6.50 శాతం, మూడు నెలలకు 6.50 శాతం, ఆరు నెలలకు 7.10 శాతం అవుతాయి.
*ప్రపంచ కుబేరుల జాబితాలో తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకున్నారు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ. ఏకంగా 118 బిలియన్ డాలర్ల సంపదతో గూగుల్ వ్యవస్థాపకులు లార్రీ పేజ్, సెర్గీ బ్రిన్ లను అధిగమించి ప్రపంచ సంపన్నుల్లో 6వ స్థానాన్ని ఆక్రమించారు. గౌతమ్ అదానీ సంపద విలువ భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.8.98 లక్షల కోట్లు అని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ స్పష్టం చేసింది. మరో భారతీయ సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ 97.4 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. అంబానీ కంటే అదానీ సంపద 20 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది

*ఆన్‌లైన్ రైల్వే ట్రావెల్ బుకింగ్ సౌకర్యాన్ని మరింతఆన్‌లైన్ రైల్వే ట్రావెల్ బుకింగ్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరచాలన్న లక్ష్యంతోఆన్‌లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ రెడ్‌బస్ మంగళవారం రెడ్‌రైల్అనే స్వతంత్ర లైట్ యాప్‌ను ప్రారంభించింది. గతేడాది చివరలో రెడ్‌బస్‌ యాప్‌లో ఫీచర్‌గా ప్రారంభమైన రెడ్‌రైల్… ఇప్పుడు ఎంట్రీ-లెవల్ ఆండ్రాయిడ్ ఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లు సహా అన్ని మొబైల్ పరికరాల్లో అందుబాటులో ఉంటుంది. రెడ్‌రైల్ అనేది రెడ్‌బస్ ప్రారంభించిన రైలు టిక్కెట్ బుకింగ్ సేవఐఆర్‌సీడీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్టూరిజం కార్పొరేషన్) సహకారంతో అధీకృత భాగస్వామిగా ఉంది. దాదాపు తొమ్మిది మిలియన్ల రోజువారీ సీట్లనున్న ఐఆర్‌సీటీసీ అన్ని షెడ్యూల్డ్ రైలు సేవలుబుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. రెడ్‌రైల్ యాప్అని రెడ్‌బస్ సీఈఓ ప్రకాశ్ సంగం పేర్కొన్నారు