Movies

అప్పుడే తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

అప్పుడే తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

నటీనటుల రిలేషన్‌షిప్స్ గురించి, పెళ్లి గురించి, ప్రెగ్నెన్సీ గురించి.. ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన అన్ని విషయాల గురించి నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఒకవైపు బాలీవుడ్ లవ్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లిపై తెగ ప్రచారం జరుగుతుండగానే.. తాజాగా మరో బాలీవుడ్ నటి ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఇటీవలే హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత ఈ జంట వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విక్కీ, కత్రినా తమ తమ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇకపోతే కత్రినా గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా కత్రీనా కైఫ్ ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఆమె ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

పింక్ కలర్ చుడిదార్ లో బొట్టు పెట్టుకొని సింపుల్ గా ఉన్న కత్రినా ఎంతో అందంగా కనిపించింది. ఇ ఈ వీడియో చుసిన పలువురు నెటిజన్లు.. కత్రినా ప్రెగ్నెంట్ అని పుకార్లు పుట్టించారు. ఆమె నడుస్తున్న తీరు, కొద్దిగా లూజ్ డ్రెస్ లో బొద్దుగా కనిపించడంతో కత్రినా త్వరలో తల్లికాబోతుందని ప్రచారం మొదలుపెట్టేశారు. కత్రినా.. ప్రెగ్నెంట్ అనుకుంటా.. ?.. ఓరి దేవుడా ఆమె అచ్చు గర్బవతిలానే బిహేవ్ చేస్తోంది.. కత్రినా త్వరలో తల్లి కాబోతున్నారా..? అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వీడియోపై ఈ స్టార్ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.