DailyDose

పాయకరావుపేట వైసీపీలో పేచీ – TNI తాజా వార్తలు

పాయకరావుపేట వైసీపీలో పేచీ – TNI తాజా వార్తలు

* విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ వైసీపీలో ఉన్న పేచీ అమరావతికి చేరింది. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు మద్దతుగా 200 మంది నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఉండవల్లిలోని గొల్ల బాబూరావు నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీకి సమన్వయకర్తలుగా ఉన్న చిక్కాల రామారావు, బొలిశెట్టి గోవిందరావు, వీసం రామకృష్ణ, సూర్యనారాయణరాజుపై నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ఆ నలుగురిపై సజ్జలకు ఫిర్యాదు చేశారు. వివిధ సామాజికవర్గాలకు చెందిన వారు దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే బాబూరావును రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పినట్టు సమాచారం. సజ్జలతో గంటసేపు సమావేశం నిర్వహించిన అనంతరం, తిరిగి బాబూరావు నివాసంలో మరో సమావేశం నిర్వహించుకున్నారు. నియోజకవర్గంలో వర్గపోరును సృష్టిస్తున్న వారిని పార్టీలో కొంతమంది పెద్దలు ప్రోత్సహిస్తున్నారని కార్యకర్తలు మండిపడ్డారు.

* మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో స్థానం దక్కకపోవడంతో అలిగిన మాజీమంత్రి సుచరిత ఎట్టకేలకూ అలక వీడారు. ఆమెతో తొలుత మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ చర్చలు జరిపినా సుచరిత పట్టువీడలేదు. ఈ నేపథ్యంలోనే సుచరితకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. గురువారం ఆమె జగన్‌తో భేటీ అయ్యారు. జగన్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత అలక వీడారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. జడ్పీటీసీ నుంచి హోం మంత్రిగా వైసీపీ అవకాశం ఇచ్చిందన్నారు. సర్జరీ కారణంగా ఈ మధ్యకాలంలో బయటకు రాలేదని తెలిపారు. 2009లో ప్రతిపాడు నుంచి గెలిచానని చెప్పారు. పార్టీ కోసం పనిచేయాలని జగన్‌ చెప్పారని పేర్కొన్నారు. పదవి ఆశించి రాకపోవడంతోనే ఎమోషన్‌కు గురయ్యానని, జగన్‌ కుటుంబంలో మనిషిగా తనను ఆదరిస్తారని చెప్పారు. కొంతమందిని మారుస్తానని సీఎం ముందే చెప్పారని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. థ్యాంక్స్‌ చెబుతూ లేఖ రాస్తే రాజీనామా అంటూ ప్రచారం చేశారని సుచరిత విమర్శించారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో సుచరిత స్థానం దక్కకపోవడంతో ఆమె అనుచరులు ఆందోళనలు చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదన్నారు. నేతలంతా సంయమనం పాటించాలని, తాను పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని సుచరిత తెలిపారు. సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, తమకు కూడా పదవులు అవసరం లేదంటూ గుంటూరు, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను, పెదనందిపాడు మండలాల పరిధిలోని వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు గుంటూరు నగర పాలక సంస్థకు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు రాజీనామా చేస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. పాత కేబినెట్‌లో ఐదుగురు ఎస్సీ మంత్రుల్లో నలుగురిని కొనసాగించి సుచరితను తొలగించడం ఏం న్యాయమంటూ వారు ప్రశ్నించారు.

*దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి, పుష్కర పుష్కర స్నానం చేశారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, జడ్పీ చైర్మన్‌ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం తుమ్మిడిహేట్టి పుష్కర స్నానాల ఘాట్ల వద్ద కార్తీక మహారాజ్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఘాట్ల వద్ద పుష్కర పుణ్య స్నానాలు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ప్రారంభించారు.

*మీరు సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకు శాఖ‌కు వెళ్లాల్సి రావ‌చ్చు. అయితే, వారం ముందే బ్యాంకుల‌కు ఇచ్చే సెల‌వులు, త‌దిత‌ర అంశాల గురించి జాగ్ర‌త్త ప‌డితే మంచిద‌న్న అభిప్రాయం వినిపిస్తున్న‌ది. కొన్ని రాష్ట్రాల్లో 14,15 తేదీల్లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సెల‌వు. 16న అసోంలో, 17న ఆదివారం అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు ప‌ని చేయ‌వు. అంటే గురువారం నుంచి నాలుగు రోజులు బ్యాంకులు ప‌ని చేయ‌బోవ‌ని తెలుస్తున్న‌ది.

*ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచారు. డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇక నుంచి పల్లెవెలుగు బస్సు కనీస ఛార్జీ రూ. 10 ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ చార్జీలపై డీజిల్‌ సెస్‌ విధించారు. పల్లెవెలుగు బస్సుల్లో రూ. 2, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ. 5 పెంచినట్లు ఆర్టీసీ ఎండీ చెప్పారు. డీజిల్‌ బల్క్‌ రేటు విపరీతంగా పెరిగిందని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. రేపట్నుంచి పల్లె వెలుగు బస్సులో కనీస చార్జి రూ.10 ఉంటుందని ఆయన వెల్లడించారు. సెస్‌ పెంపు వల్ల ఆర్టీసీకి రూ.720 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.

*మంత్రివర్గ విస్తరణ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మొవ్వ కృష్ణబాబుకు.. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు.

*రాష్ట్ర మంతటా పచ్చదనం పెంపు కార్యక్రమాలను నిరంతర ప్రక్రియలా కొనసాగించాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కోరారు. హరిత వనాల్లో పచ్చదనం పెంపు కార్యక్రమాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో అరణ్య భవన్ లో సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో చిక్కటి పచ్చదనం పెంపుపై ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారనిఆమేరకు అన్ని శాఖల సమన్యయంతో పనులు చేయాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీలుకాలనీల్లో విభిన్న రకాల చెట్లు పెంచేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. నీడను ఇచ్చే చెట్లతో పాటుఅహ్లాదాన్నిపంచే పూల మొక్కలను కూడా నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు.

* ప్రస్తుతం జైల్లో ఉన్న ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్, ఆయన కుటుంబానికి చెందిన పలు ఆస్తులను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అటాచ్ చేసింది. ఈ మనీలాండరింగ్ కేసులో జైలు నుంచి తక్షణమే విడుదల చేయాలని కోరుతూ మాలిక్ చేసిన అప్పీల్‌పై విచారణకు, లిస్టింగ్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జైలు శిక్ష అనుభవిస్తున్న మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌కు చెందిన పలు ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ బుధవారం వెల్లడించింది.

* వేసవి ఉష్ణమండల అల్పపీడనం కారణంగా మధ్య, దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన వరదల్లో 58 మంది మరణించారు.వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య కనీసం 58కి పెరిగిందని, మరో 28 మంది గల్లంతయ్యారని ఫిలిప్పీన్స్ అధికారులు చెప్పారు. సెంట్రల్ లేటె ప్రావిన్సులోని బేబే నగరంలో కొండచరియలు విరిగిపడటంతో 100 మంది గ్రామస్థులు గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం ఫిలిప్పీన్స్ సైనికులు, పోలీసులు, సహాయ సిబ్బంది గాలిస్తున్నారు.వరద విపత్తు వల్ల ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం సంభవించిందని ఆర్మీ బ్రిగేడ్ కమాండర్ కల్నల్ నోయెల్ చెప్పారు.బేబే గ్రామాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి మృతదేహాలను వెలికితీశారు.భారీవర్షాలు, వరదల వల్ల సహాయ పునరావాస పనులకు ఆటంకం కలుగుతుంది.ఫిలిప్పీన్స్ దేశంలో ప్రతి ఏటా 20 తుపాన్ లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంటాయి.

* విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం జయతి పరిసర గ్రామాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచరిస్తున్న ఆనవాళ్లను అటవీశాఖాధికారులు సేకరించారు. ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దు నుండి పులి ప్రవేశించినట్టు గుర్తించారు. బీటు సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశామని, మెంటాడ, పాచిపెంట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

* బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్‌ పేర్కొన్నారు. 56% బీసీలుంటే 24 శాతానికి రిజర్వేషన్లను జగన్ సర్కార్‌ కుదించిందన్నారు. బీసీల మీద జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని కేఈ ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై త్వరలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు.

* దేశంలో పేటెంట్‌ దరఖాస్తుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 66,440 నమోదైంది. 2014–15లో ఈ సంఖ్య 42,763. మేధో సంపత్తి హక్కుల వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఈ వృద్ధికి కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ‘2020–21లో భారత్‌లో మంజూరైన పేటెంట్ల సంఖ్య 30,074 ఉంది. 2014–15లో ఇది కేవలం 5,978 మాత్రమే. పేటెంట్‌ దరఖాస్తుల పరిశీలనకు అయ్యే సమయం ఆరేళ్ల క్రితం 72 నెలలు ఉంటే.. ఇప్పుడు 5–23 నెలలకు వచ్చింది.

* కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ కలకలం రేపింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌ను అధికారులు నిలిపివేశారు. స్థానిక పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఫేక్‌ కాల్‌గా రైల్వే పోలీసులు తేల్చారు. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ భువనేశ్వర్‌ నుంచి ముంబైకు వెళ్తోంది. బాంబు బెదిరింపు కాల్‌తో ట్రైన్ లో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

* దేశంలో పేటెంట్‌ దరఖాస్తుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 66,440 నమోదైంది. 2014–15లో ఈ సంఖ్య 42,763. మేధో సంపత్తి హక్కుల వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఈ వృద్ధికి కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ‘2020–21లో భారత్‌లో మంజూరైన పేటెంట్ల సంఖ్య 30,074 ఉంది. 2014–15లో ఇది కేవలం 5,978 మాత్రమే. పేటెంట్‌ దరఖాస్తుల పరిశీలనకు అయ్యే సమయం ఆరేళ్ల క్రితం 72 నెలలు ఉంటే.. ఇప్పుడు 5–23 నెలలకు వచ్చింది

*జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏకంగా జిల్లా కలెక్టర్ పేరుతో జిల్లా స్థాయి అధికారులకు కుచ్చుటోపి పెట్టారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా ఫొటో డీపీతో ఫేక్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు. మొదట ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ నుంచి రూ.50 వేలతో అమెజాన్ లో ఈ- పే కార్డులను కొనుగోలు చేశారు. యాబై వేల రూపాయలు మాయం అయిన తరువాత అధికారి తేరుకున్నాడు. ఇదే తరహాలో మరికొందరు అధికారులు మోసపోయిన వైనం వెలుగులోకి వచ్చింది. బయటకు పొక్కితే పరువు పోతుందని బాధితులు లోలోపల మధనపడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం…ఇదంతా ఇంటి దొంగల పనే అని ఆరా తీస్తున్నారు. లొకేషన్ సెర్చ్ ఆధారంగా బీహార్ నుంచి ఈ మోసం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

*మామిడికాయల సీజన్ వచ్చేసింది. లక్ష్మీపురం పండ్ల మార్కెట్‌లో మామిడి రికార్డు ధర పలికింది. టన్ను మామిడికి 80,000 రూపాయలు ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పంట దిగుబడి తగ్గడంతో మామిడి ధరలు విపరీతంగా పెరిగాయి.

*ఎ.పి సేవ, స్పందన పోర్టల్ లో నిర్ణీత సమయం మేరకు మ్యుటేషన్ లు పరిష్కారం చూపని జిల్లాలోని 9 మంది తహసిల్దార్ లకు షోకాజ్ నోటీసులను జే.సి బాలాజీ ఐ.ఏ.ఎస్ వారు జారీ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట, పాకాల, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, దొరవారి సత్రం, తిరుపతి రూరల్, చిల్లకూరు, మండలాల తహసిల్దార్లు షోకాజ్ నోటిసులు అందినట్టు సమాచారం

*ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా చిన్న పురాతన లోహపు పెట్టె వెలుగుచూసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాత చర్లలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆంజనేయస్వామి ఆలయం పక్కన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో చిన్న పురాతన లోహపు పెట్టె బయటపడింది. అందులో పాతకాలపు వెండి నగలు, చిన్న చిన్న పూసలు ఉన్నాయి. గుప్తనిధి పేరుతో తవ్వకాలు జరుపుతున్నారనే ప్రచారం జరగడంతో పోలీసులు ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. లోహపు పెట్టెను తాసిల్దార్‌కు స్వాధీనపరుస్తామని పోలీసులు తెలిపారు.

*ఇరు దేశాల మధ్య వ్యాపారాలను పెంచుకోవడం, పరస్పర సహకారం కోసం థాయ్‌లాండ్‌ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. సోమవారం రాత్రి నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, థాయ్‌లాండ్‌ ఉప ప్రధాని జూరిన్‌ లక్సనావిసిట్‌ ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం రాష్ట్రానికి చెందిన టీ-హబ్‌ ద్వారా ఇక్కడి స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్‌ కృషి చేస్తుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, కలప పరిశ్రమలతో కూడిన కీలకమైన రంగాలలో వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలపై రెండు ప్రభుత్వాలూ పనిచేస్తాయి

*నీటిపారుదలశాఖలో 59మంది అసిస్టెంట్‌ ఇంజనీర్ల(ఏఈ)కు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(డీఈఈ)గా పదోన్నతి లభించింది. జోన్‌-5లో పనిచేస్తున్న 24 మందికి, జోన్‌-6లోని 29 మందికి ఈ పదోన్నతులు లభించాయి

*ఇప్పటివరకు హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగించిన ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త కర్నూలుకు తరలివెళ్లనుంది. ఏపీ లోకాయుక్త ఈ నెల 18 నుంచి కర్నూలులో కార్యకలాపాలు చేపట్టనున్నట్లు లోకాయుక్త రిజిస్ర్టార్‌ విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. లోకాయుక్త కార్యాలయాన్ని శాశ్వతంగా కర్నూలుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

*‘నాయకుడికి నేనెప్పుడూ సమస్యను కాను. ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆయన ఏ పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనెప్పుడూ ఎలాంటి పదవులూ ఆశించలేదు’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం విజయవాడలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం ఏ పని అప్పగించినా చేస్తానని, రేపు జనాల్లోకి వెళ్లి పార్టీ కోసం పనిచేయమన్నా.. వెళ్తానని చెప్పారు. తనకు మంత్రి పదవి వస్తుందని పత్రికలే రాశాయని, తాను ఆశించలేదన్నారు. స్పీకర్‌గా ఉండాలని తనకు చెప్పడానికి కూడా అప్పుడు సీఎం ఇబ్బందిపడ్డారని.. తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పి బాధ్యత తీసుకున్నానన్నారు. మంత్రి పదవులు రాని వాళ్లకు కొంత బాధ ఉంటుందని, జగన్‌ అందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తారన్నారు. ‘తాజా కేబినెట్‌ కూర్పు అద్భుతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కలగలిపి రాజ్యాధికారం దామాషా పద్ధతిలో ఇచ్చారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రులను నియమించి అణగారిన వర్గాలకు సువర్ణావకాశమిచ్చారు. 133 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. జగన్మోహన్‌రెడ్డే ఒక పెద్ద బీసీ, ఒక పెద్ద ఎస్సీ, ఒక పెద్ద ఎస్టీ, ఒక పెద్ద మైనారిటీ. కొంత మంది ఏదేదో మాట్లాడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఈ స్థాయిలో అన్ని వర్గాలకూ ఎవరైనా న్యాయం చేశారా? సామాజిక న్యాయ విప్లవంలో ఎవరైనా కొట్టుకుపోవాల్సిందే. ఎవరెన్ని ప్రకటనలిచ్చినా జగన్‌ సంక్షేమ సముద్రంలో కొట్టుకుపోవాల్సిందే. శ్రీశ్రీ సూక్తులు గుర్తుకొస్తున్నాయి. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాఽథ రథచక్రాలు.. జగన్మోహన రథచక్రాల కింద నలిగి నశించిపోవాల్సిందే. అగ్రవర్ణ సీఎం అన్ని వర్గాలకూ అండగా నిలవడం ఒక పెద్ద విప్లవం’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌గా ఉన్న వాళ్లు రెండో సారి గెలిచిన చరిత్ర లేదన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ఆముదాలవలసలో రెండోసారి గెలిచి చరిత్ర సృష్టిస్తా.. రాసుకోండని తమ్మినేని సవాల్‌ విసిరారు. తాను గెలిచిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు.

*జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అవార్డులను ప్రకటించింది. చైల్డ్‌ ఫ్రెండ్లీ అవార్డును నెల్లూరు జిల్లా యేకొల్లు పంచాయతీ దక్కించుకుంది. జీపీడీపీలో శ్రీకాకుళం జిల్లా మబగంనానాజీ దేశ్‌ముఖ్‌ గౌరవ గ్రామసభ పురస్కార్‌ను తూర్పుగోదావరి జిల్లా కొత్తమూలపేట పంచాయతీ దక్కించుకున్నాయి. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ పురస్కార్‌ను తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌చిత్తూరు జిల్లా పెద్దమండ్యంవిశాఖపట్నం జిల్లా సబ్బవరంకర్నూలు జిల్లా మదికెర తూర్పుశ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలాలకు దక్కాయి. చిత్తూరు జిల్లా మంగళంపేటవిశాఖపట్నం జిల్లా మినుములూరునెల్లూరు జిల్లా కలిగిరినెల్లూరు జిల్లా అనుసముద్రంకుతూర్పుగోదావరి జిల్లా ఏడిదగుంటూరు జిల్లా చేబ్రోలుఅనంతపుపురం జిల్లా అనంతపురం రూరల్‌గుంటూరు జిల్లా దమ్మనవారిపాలెం గ్రామ పంచాయతీలకూ ఈ అవార్డులు దక్కాయి. ఏప్రిల్‌ ఢిల్లీలో ఈ అవార్డులు అందజేస్తారు.

*నాయకుడికి నేనెప్పుడూ సమస్యను కాను. ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆయన ఏ పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనెప్పుడూ ఎలాంటి పదవులూ ఆశించలేదుఅని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం విజయవాడలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం ఏ పని అప్పగించినా చేస్తాననిరేపు జనాల్లోకి వెళ్లి పార్టీ కోసం పనిచేయమన్నా.. వెళ్తానని చెప్పారు. తనకు మంత్రి పదవి వస్తుందని పత్రికలే రాశాయనితాను ఆశించలేదన్నారు.]

*సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదని జై భీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌వ్యవస్థాపక అధ్యక్షుడుహైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం 70శాతం పదవులు బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఆయన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారానికి ఒక పార్టీ కావాలని, దీనిలో భాగంగా ఈ నెల 14న ‘జై భీమ్‌ భారత్‌’ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు తమ హక్కులను స్వేచ్ఛగా పొందేందుకు, అవినీతి లేని పాలన సాగించేందుకు, వారసత్వ కుటుంబపాలనకు చరమగీతం పాడేందుకు కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

*కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జూలై 22న ఏపీఈసెట్‌-2022 నిర్వహించనున్నట్లు కన్వీనర్‌, జేఎన్టీయూకే అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు పాలిటెక్నిక్‌, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. ఈసెట్‌కు చైర్మన్‌గా జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు వ్యవహరించనున్నారని తెలిపారు. మే 3 నుంచి జూన్‌ 3 వరకు ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓసీ విద్యార్థులు రూ.600, బీసీలు రూ.550, ఎస్సీ, ఎస్టీలు రూ.500 పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. రూ.500 అపరాధ రుసుముతో జూన్‌ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూలై 22న ఈసెట్‌ నిర్వహించి.. 25న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, ఆగస్టు 6న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.

*అరుదైన ఖగోళ ఘట్టాలను వీక్షించడం ఎల్లప్పుడూ ఆసక్తికరమే. అలాంటి ఓ అద్భుతాన్ని స్వయంగా చూడాలనుకునేవారికి ఈ నెలలోనే అవకాశం రాబోతోంది. సౌరవ్యవస్థలోని నాలుగు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. శని, అంగారక, శుక్ర, బృహస్పతి గ్రహాలను ఉత్తరార్ధగోళం నుంచి చూడవచ్చు. ఏప్రిల్ 17 నుంచి పైన పేర్కొన్న గ్రహాలు దాదాపు ఒకే రేఖపైకి వచ్చినట్టు కనిపిస్తాయి. అయితే ఏప్రిల్ 20న ఉదయం సూర్యోదయానికి ముందు మరింత స్పష్టంగా కనుల విందు చేస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గ్రహాలను చూసేందుకు అనువైన పరిస్థితులు ఉండాలంటున్నారు. శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరి నుంచే మొదలైంది. అయితే ఏప్రిల్ తర్వాత బృహస్పతి కూడా ఈ రేఖపైకి వస్తుంది. ఖగోళ అద్భుతాలు అరుదుగా సంభవిస్తుంటాయి. మరీ ముఖ్యంగా 4 గ్రహాలు ఒకే రేఖపైకి రావడం చాలా చాలా అరుదని పేర్కొంటున్నారు. మరోవైపు ఏప్రిల్ 23న ఈ నాలుగు గ్రహాల సరసన చంద్రుడు కూడా చేరబోతున్నాడు. సరళ రేఖ కుడిపక్కన చందమామ కనిపిస్తుంది. అయితే అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ప్రత్యేకంగా కనిపిస్తాయి.

*ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 16 దక్కించుకుని సత్తా చాటింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక’ పాలన ఆధారంగా కేంద్రం 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 11 గ్రామ పంచాయతీలు, నాలుగు మండల పరిషత్‌లు, ఒక జిల్లా పరిషత్‌కు అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్‌.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు లేఖ రాశారు.

* మామిడికాయల సీజన్ వచ్చేసింది. లక్ష్మీపురం పండ్ల మార్కెట్‌లో బంగినపల్లి మామిడి రికార్డు ధర పలికింది. టన్ను మామిడికి 80,000 రూపాయలు ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పంట దిగుబడి తగ్గడంతో మామిడి ధరలు విపరీతంగా పెరిగాయి.