Devotional

ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం – TNI ఆధ్యాత్మికం

ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం  – TNI ఆధ్యాత్మికం

1. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతిరోజూ సుమారు 2 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట వద్ద పుష్కరాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు. తుమ్మిడిహెట్టి వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ కోవా లక్ష్మి ప్రారంభించారు. అర్జునగుట్ట ఘాట్ వద్ద పుణ్య స్నానాలకు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి 24 వరకు తెలంగాణ, మహారాష్ట్రలలో ప్రాణహిత నది పుష్కరాలను నిర్వహించనున్నారు. కిందటిసారి 2010 డిసెంబరులో నిర్వహించగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ పుష్కర కళ వచ్చింది. రెండు రాష్ట్రాల్లో రోజూ 2 లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని అంచనా.కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండల కేంద్రం, కోటపల్లి మండలంలో అర్జునగుట్ట వద్ద, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద, మహారాష్ట్రలోని సిరోంచ, నగరం వద్ద పుష్కరఘాట్లను సిద్ధం చేశారు. భక్తులు మాత్రం పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లు సరిగ్గాలేవని వాపోతున్నారు.

2. మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో పూజలు బంద్‌
మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఏకాదశి సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పూజలు జరగలేదు. పీఠాధిపతి సుబుధీంద్రతీర్థుల ఆధ్వర్యంలో సుప్రభాతం, నిర్మల విసర్జనం చేసి నిజ బృందావనానికి మహామంగళహారతులిచ్చారు. ప్రతిరోజు జరగాల్సిన నిత్య పూజలు, అలంకరణ, టెంకాయలు కొట్టడం, పరిమళ ప్రసాదం, రథోత్సవాల ఊరేగింపు, నిత్యాన్నదానం వంటివి బంద్‌ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రాఘవేంద్రస్వామి అలంకరణలేని నిజ బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పీఠాధిపతులతో పాటు పండితులు, అర్చకులు ఉపవాసాలు పాటించారు.

3. సింహవాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు
ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సింహవాహనంపై కోదండరాముడు భ క్తులకు దర్శనమిచ్చారు. ఉదయం వటపత్రసాయి అలంకారంలో మాడవీధుల్లో స్వామి ఊరేగారు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం కన్నులవిందుగా ఊంజల సేవా కార్యక్రమం జరిగింది.

4. టీటీడీ నిర్ణయం భక్తులకు శరాఘాతం: సోమువీర్రాజు
తిరుమలలో ఉచిత దర్శనం కోసం వెళ్లే భక్తులను అలిపిరి దగ్గర నిలిపివేయడం అన్యాయమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. టీటీడీ నిర్ణయం భక్తులకు శరాఘాతమని సోమువీర్రాజు తెలిపారు. పాలకమండలి వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే భక్తులతో కలిసి తిరుమల యాత్ర చేపడతామని సోము వీర్రాజు వెల్లడించారు.

5. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో సమతామూర్తి విగ్రహం
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన ‘సమతామూర్తి’ విగ్రహానికి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌-లండన్‌లో చోటుదక్కింది. ఈ మేరకు ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటన చేశారు. చినజీయర్‌ స్వామికి సర్టిఫికెట్‌ అందజేశారు. రామానుజాచార్యుల విగ్రహానికి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కడం పట్ల చినజీయర్‌ స్వామి హర్షం వ్యక్తం చేశారు. సమతకు చిహ్నమైన రామానుజాచార్య విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రారంభించి, జాతికి అంకితం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే, ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

6. మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో పూజలు బంద్‌
మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఏకాదశి సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పూజలు జరగలేదు. పీఠాధిపతి సుబుధీంద్రతీర్థుల ఆధ్వర్యంలో సుప్రభాతంనిర్మల విసర్జనం చేసి నిజ బృందావనానికి మహామంగళహారతులిచ్చారు. ప్రతిరోజు జరగాల్సిన నిత్య పూజలుఅలంకరణటెంకాయలు కొట్టడంపరిమళ ప్రసాదంరథోత్సవాల ఊరేగింపునిత్యాన్నదానం వంటివి బంద్‌ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రాఘవేంద్రస్వామి అలంకరణలేని నిజ బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పీఠాధిపతులతోపాటు పండితులుఅర్చకులు ఉపవాసాలు పాటించారు.

7. ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం స్లాట్‌ విధానం రద్దు: టీటీడీ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తడంతో సర్వదర్శనం స్లాట్‌ విధానాన్ని రద్దు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. కరోనాకు ముందున్న విధాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వైకుంఠంలో వేచివున్న భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రద్దీవల్ల 20 నుంచి 30 గంటల పాటు వేచిఉండాల్సి వస్తున్నదని చెప్పారు. వైకుంఠం-2, క్యూలైన్లను ఆయన పరిశీలించారు.కాగా, టికెట్లు లేకుండా వచ్చేవారితో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం-2 వెలుపల క్యూలైన్లలో భక్తులు బారులు తీరుతున్నారు. టికెట్లు లేకుండా నేరుగా వచ్చిన భక్తులకు నేటినుంచి దర్శనం కల్పించనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో మూడు రోజులపాటు ఆర్జిత సేవలను టీటీడీ నిలిపివేసింది. అదేవిధంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కూడా రద్దుచేసింది.

8. టీటీడీలో పలువురు డిప్యూటీవోలు బదిలీలు
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం డిప్యూటీవోగా లోకనాథం డిప్యూటీవో ఆర్-1 హరీంద్రనాథ్ అన్నదానం డిప్యూటీవోగా పద్మావతి బోర్డు సెల్ డిప్యూటీవోగా కస్తూరి తిరుపతి క్యాంటీన్ డిప్యూటీవోగా జా సుబ్రమణ్యం కపిల్ తీర్థం ఆలయ డిప్యూటీవోగా దేవేంద్ర బాబు, ట్రెజరీ డిప్యూటీవోగా లక్ష్మా నాయక్, గోవిందరాజస్వామి ఆలయ డిప్యూటీవోగా శాంతి, శ్రీనివాస మంగాపురం డిప్యూటీవోగా వరలక్ష్మి, తిరుపతి శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ డిప్యూటీవోగా స్నేహలత, శ్రీనివాసం డిప్యూటీవోగా పార్వతి, శ్రీ కోందడరామస్వామి ఆలయ డిప్యూటీవోగా నాగరత్న, చెన్నై ఆలయం డిప్యూటీవోగా విజయ్ కుమార్ కొనసాగింపు.

9. శ్రీవారి కల్యాణోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు
చెన్నై నగరంలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక ఐల్యాండ్‌ మైదానంలో ఈ నెల 16వ తేదీ శ్రీవారి కల్యాణోత్సవం జరుగనున్న విషయం తెలిసిందే. మైదానంలో ఇప్పటికే భారీ పందిరి, స్వామివారికి కల్యాణానికి అవసరమైన వేదిక, భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ చెన్నై సమాచారకేంద్ర సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ పనులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పరిశీలించారు. టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఏజే శేఖర్‌, సలహామండలి ఉపాధ్యక్షులు కదిర్‌ ఆనంద్‌, వెంకటసుబ్రహ్మణ్యం, సభ్యులు మోహన్‌రావు, కార్తికేయన్‌, పరశురామన్‌, మాజీ ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులతో కలిసి మైదానంలో ఏర్పాట్లను సుబ్బారెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎంతో భేటీ : ముందుగా మంగళవారం ఉదయాన్నే టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు ఏపీ నందకుమార్‌, తిరుమల ప్రధాన అర్చకులు, చెన్నై సమాచార కేంద్ర సలహామండలి ఉపాధ్యక్షులు కదిర్‌ ఆనంద్‌, వెంకట సుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి సీఎం కార్యాలయానికి వెళ్లిన సుబ్బారెడ్డి.. ఆయనకు ఆహ్వాన పత్రిక అందించారు. కల్యాణోత్సవానికి అన్ని విధాలుగా సహకరించాలని, ఎక్కడా ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ సహా దేవాదాయశాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు అధికారులను ఆదేశించారు.

10. తిరుమలలో గదుల
తిరుమలలో గదుల కొరత నెలకొంది. ప్రస్తుతం టీటీడీ 2 వేలకు పైగా గదులకు మరమ్మత్తు చేయిస్తున్నారు. మరమ్మతు పనుల కారణంగా గదుల కొరత చోటు చేసుకుంది. టోకెన్ మినహాయింపుతో శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు వస్తున్నారు. గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కుల్లో భక్తులు సేదతీరుతున్నారు.

11. వైభవంగా ఒంటి మిట్ట కోదండరామస్వామి
ఒంటి మిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 15 వతేది రాత్రి పండు వెన్నెలలో సీతారాముల కల్యాణం జరగనుంది. సీఎం జగన్ సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరై పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. జిల్లాలో 15, 16 రెండు రోజుల పాటు జగన్ పర్యటించనున్నారు.

12. కల్యాణం నేపథ్యంలో.. 15న ట్రాఫిక్‌ మళ్లింపు
ఒంటిమిట్టలో ఈనెల 15న సీతారాముల కల్యాణం జరగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. భక్తుల వాహనాలు మినహా ఎలాంటి ఇతర వాహనాలను అనుమతించరని తెలిపారు. ఈ మేరకు ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాహనాల మళ్లింపు వివరాలు ఇలా.. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్‌పల్లి, ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాలి. పులివెందుల నుంచి కడప నగరానికి, కడప మీదుగా వెళ్లే వాహనాలను సాక్షి సర్కిల్‌ నుంచి ఊటుకూరు సర్కిల్‌ వైపు దారి మళ్లిస్తారు. తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుంచి రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి. రాజంపేట వైపు నుంచి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా మళ్లిస్తారు.► రాజంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు సాలాబాద్‌ నుంచి ఇబ్రహీంపేట, మాధవరం మీదుగా దారి మళ్లిస్తారు. రాజంపేట వైపు నుంచి వచ్చే వాహనాలను సాలాబాద్‌ సమీపంలో 15 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి. కల్యాణ వేదిక నుంచి కడప మార్గంలో 10 చోట్ల పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.

13. మేం ఊహించి సిద్ధమైతే.. మాపై ఆరోపణలు చేస్తారా?: ధర్మారెడ్డి
తిరుపతి టికెట్ కౌంటర్ల వద్ద నిన్న జరిగిన తోపులాటపై దుష్ప్రచారం చేస్తున్నారని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినా.. టికెట్లు దొరకవేమోనని భక్తులు ఆందోళన చెందడం వల్లే.. పరిస్థితి అదుపు తప్పిందన్నారు. అయినా వెంటనే తగిన చర్యలు చేపట్టి.. భక్తులను తిరుమలకు తీసుకొచ్చి దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. తిరుపతిలో నిన్న జరిగిన తోపులాటలో తితిదే నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు చేయడం సరికాదని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. టైమ్‌ స్లాట్‌ వల్ల భక్తులకు చాలా త్వరగా దర్శనాలు కల్పించామని తెలిపారు. 9, 10, 11 తేదీలకు సంబంధించిన టోకెన్లను ఒకేరోజు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వారాంతాల్లో దర్శనానికి వచ్చే వారి సంఖ్య పెరిగిందన్నారు. మొత్తం మూడు కౌంటర్లు కలిపి సుమారు 18 నుంచి 20 వేల మంది వచ్చినట్లు చెప్పారు. రోజుకు 35 వేల చొప్పున దర్శన టోకెన్లు ఇచ్చేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని తెలిసి కౌంటర్లు నిలిపివేశామని తెలిపారు. రెండు రోజుల విరామం అనంతరం కౌంటర్లు ఓపెన్‌ చేద్దామని భావించినట్లు వెల్లడించారు.