Movies

నాగ చైతన్యకు బిగ్ షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్

నాగ చైతన్యకు బిగ్ షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్

నిబంధనలు పాటించని వారిని ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. కార్లపై స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలకు ఫైన్స్ విధిస్తున్నారు. గ్లాసెస్ కు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను అక్కడిక్కడే తొలగిస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలకు కూడా జరిమానాలు విధించారు. అయితే టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లో తనిఖీల సందర్భంగా నాగ చైతన్య కారును ఆపిన పోలీసులు.. కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు.నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్‌తో తిరుగుతున్నందుకు రూ.700 చలానా విధించారు. ఆ సమయంలో నాగ చైతన్య కారులోనే ఉన్నారు. ఇటీవలి కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలకు వరుసపెట్టి జరిమానాలు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఒక్కటేనని చెప్పకనే చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్‌‌లకు కూడా ‘బ్లాక్ ఫిల్మ్’ కారణంగా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.గత వారం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కారుకు బ్లాక్‌ ఫిల్మ్‌తో వెళ్తుండగా… వాహనాన్ని ఆపి జరిమానా విధించారు. కేవలం ‘వై’ కేటగిరీ భద్రత ఉన్నవారికి మాత్రమే బ్లాక్ ఫిల్మ్ నుంచి మినహాయింపు ఉంది. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫిల్మ్‌తో కనిపించే కార్లకు జరిమానా తప్పట్లేదు. ఇకనైనా సెలబ్రిటీలు రోడ్ల పైకి వచ్చే ముందు తమ వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.