DailyDose

ముంబైలో రూ.24 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత – TNI నేర వార్తలు

ముంబైలో రూ.24 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత – TNI  నేర వార్తలు

* ముంబై విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విమానాశ్రయంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రయాణికుడి వద్ద 3.980 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. అతని వద్ద ఉన్న సుట్‌కేస్‌లో నాలుగు ప్యాకెట్లలో మత్తుమందును తీసుకొస్తున్నాడని అధికారులు తెలిపారు. దాని విలువ రూ.24 కోట్లు ఉంటుందని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేశామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

* ఇంటి పేరట్లో నల్లమందు మొక్క పెంపకం.. భారత ప్రవాసుడి అరెస్ట్కు
వైత్‌లో తన ఇంటి పేరట్లో నల్లమందు మొక్కను(ఓపియం పోపీ శాస్త్రీయ నామము) పెంచినందుకు భారతీయుడిని అక్కడి సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కువైత్‌లోని ఫహాహీల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే ఓ భారత ప్రవాసుడు తన ఇంటి పేరట్లో ఏకంగా నార్కోటిక్ మొక్కను పెంచుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న అహ్మది సెక్యూరిటీ అధికారులు సదరు వ్యక్తి ఇంటికి చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు. పేరటిని సీజ్ చేసిన అధికారులు.. అందులోని మొక్కలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌కు పంపించారు. అనంతరం ఈ విషయమై జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కోటిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అయితే, అధికారులు అదుపులోకి తీసుకున్న భారతీయుడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం సదరు వ్యక్తిని అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు హాజరుపరిచే పనిలో ఉన్నారు.

*దుబాయ్ వెళ్ళడానికి రూ.10 లక్షల కోసం భార్యను వేధించిన భర్త
ఉద్యోగం చూసుకోవడానికి దుబాయ్ వెళ్తానంటూ తన భర్త తనను వేధిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌ నివాసి అని, తాము 2008లో జరిగిన సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ తన భర్త, అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు.గుజరాత్‌లోని వాట్వా గ్రామానికి చెందిన 32 ఏళ్ల మహిళ ఈ ఫిర్యాదు చేశారు. తమ పెళ్లి తర్వాత నాలుగు రోజులపాటు దుంగార్‌పూర్‌లో తాను ఉన్నానని, అనంతరం తాను అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి, కలుపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జీవిస్తున్నానని తెలిపారు. తన భర్త కుటుంబం ఆ తర్వాత ఈ నగరానికి వచ్చిందన్నారు. తమకు వివాహం జరిగి 7 నెలలైనా పూర్తి కాకుండానే తన అత్తింటివారు తనను వేధించడం ప్రారంభించారని చెప్పారు. తన భర్త దుబాయ్ వెళ్ళడం కోసం రూ.10 లక్షలు ఇవ్వాలని తనను వేధిస్తున్నారన్నారు. ఈ డిమాండ్ మేరకు డబ్బును తన తల్లిదండ్రుల నుంచి తీసుకురావడానికి తాను నిరాకరించడంతో తనపై దాడి చేసి, తీవ్రంగా కొట్టారని ఆరోపించారు.కొంత కాలం తర్వాత తనను దుంగార్‌పూర్ తీసుకెళ్ళారని, అక్కడ తన భర్త, ఆయన తరపు బంధువులు తనను తీవ్రంగా బెదిరించారని, తనను చంపుతామని హెచ్చరించారని ఈ ఫిర్యాదులో ఆరోపించారు. మరికొంత కాలం తర్వాత తన భర్త కువైట్ వెళ్లారని, అప్పటి నుంచి తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని చెప్పారు. తన భర్త తరపు బంధువులు తనను ఇంటి నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఓ రోజు తనను వారు కొడుతుండగా, పొరుగింటి వ్యక్తి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని, ఆయనను కూడా వారు కొట్టారని తెలిపారు. దీంతో తాను మళ్లీ అహ్మదాబాద్ వచ్చి, ఫిర్యాదు చేశానని చెప్పారు.

*నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం గడ్డమీది తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుగులోత్ సక్కు(30) అనే వివాహిత పంట పొలాల వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులు వల్లనే చనిపోయిందని పుట్టింటివారు అత్తవారి ఇంటిపై దాడి చేశారు. మృతురాలి బంధువులు అత్తవారింటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో వంట సామాగ్రితో పాటు బైక్‌, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. తీవ్ర ఉద్రిక్తత నెలకొడంతో తండాలోకి భారీగా పోలీసులు మోహరించారు.

*పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు నిందితులను పోలీసు కస్టడీకి తరలించనున్నారు. 4 రోజుల పాటు అభిషేక్, అనిల్‌ను ప్రశ్నించనున్నారు. నిందితుల కాల్‌ లిస్ట్, సీడీఆర్ ఆధారంగా విచారించనున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు అర్జున్ వీరమాచినేని, కిరణ్‌రాజుల కోసం పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. అయితే కిరణ్‌రాజు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు.

* కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మునెప్పనగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు భారీ చోరీకి పాల్పడ్డారు. రూ.15 లక్షలు, 10తులాల బంగారంను దొంగలు అపహరించారు. జరిగిన ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

* ఉత్తర ప్రదేశ్‌లోని భేలుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చీరల వర్క్‌షాప్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు బిహార్ రాష్ట్రానికి చెందినవారు. విద్యుదాఘాతం వల్ల ఈ ప్రమాదం జరిగిందనిఒకే ద్వారం ఉండటం వల్ల బాధితులు ప్రమాద సమయంలో బయటకు రాలేకపోయారని వారణాసి జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ చెప్పారు.

* అంబర్ పేట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సిద్ధార్ద సింగ్ ఈ దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. గత ఆరు నెలలుగా వీహెచ్ ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడు. మద్యం మత్తులో ఇంటిపై రాళ్లు విసిరి కారు అద్దాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* గుర్తు తెలియని ఓ యువతి మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సదరు యువతి గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు.గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఉరివేసుకుని కనిపించిన మహాలక్ష్మిని చూసి కుటుంబ సభ్యులు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీ ఎంట్రన్స్‌కి ఆమె ప్రిపేర్ అవుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.ఈ ఆత్మహత్యకు సంబంధించి బూర్గంపహాడ్‌ పోలీసులు కేసు నమోదుచేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

*మనవరాలి పుట్టినరోజు వేడుక కోసం షాపింగ్‌కు వెళ్లిన అమ్మమ్మ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఈ ఘటన చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ కథనం ప్రకారం.. ఘాజిమిల్లత్‌కాలనీకి చెందిన ఫాతిమా(48) భర్త చనిపోవడంతో కొడుకులు, కూతుళ్లతో కలిసి అక్కడే నివసిస్తోంది. చనిపోయిన ఓ కూతురుకు పుట్టిన బిడ్డ సిద్రాఫాతిమా(6)ను ఫాతిమా అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. మూడు రోజుల్లో సిద్రా పుట్టిన రోజు ఉండడంతో డబీర్‌పురాకు చెందిన చిన్న అల్లుడు నవాజ్‌(28)తో కలిసి ఫాతిమా తన మనవరాలిని తీసుకుని మంగళవారం అర్ధరాత్రి స్కూటరుపై చాంద్రాయణగుట్టకు రాగా వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఫాతిమా లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నవాజ్‌, సిద్రా ప్రమాదం నుంచి బయటపడ్డారు. లారీ డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. జనం మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

*మసునూరు మండలంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన అక్కిరెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరో 13 మందికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో విధుల్లో 17 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్‌ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*మసునూరు మండలంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన అక్కిరెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరో 13 మందికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో విధుల్లో 17 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్‌ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*తెన్‌కాశి జిల్లా ఆళ్వార్‌కురిచ్చి సమీపం వాగైకుళంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు కూలి తండ్రి, కుమార్తె దుర్మరణం చెందగా మరో మహిళ గాయపడింది. వాగైకుళం ఉత్తరవీధిలో కల్యాణసుందరం (60), వేలమ్మాళ్‌ (55) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి నలుగురు కుమార్తెలున్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. నాలుగో కుమార్తె రేవతి (25) తిరునల్వేలి జిల్లాలోని ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఈ ముగ్గురూ పాతకాలపు నాటి ఇంటిలో నివసిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు కొయ్యదూలాల పైకప్పు బాగా దెబ్బతింది. దీంతో కల్యాణసుందరం రెండు రోజుల తర్వాత ఓ అద్దె ఇంటికి మారాలని సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తొమ్మిదిగంటలకు కురిసిన భారీ వర్షానికి ఉన్నట్టు పైకప్పు కూలి నిద్రపోతున్న వారిపై పడింది. ఈ దుర్ఘటనలో కల్యాణసుందరం, ఆయన కుమార్తె రేవతి తీవ్రంగా గాయపడి మరణించగా, వేలమ్మాళ్‌ తీవ్రగాయాలతో బయటపడ్డారు. పైకప్పు కూలిపడిన శబ్దానికి చుట్టుపక్కల నివసిస్తున్నవారు పరుగెత్తుకెళ్లి మట్టి శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ప్రయత్నించారు. ఆలోగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని శిథిలాలను పూర్తిగా తొలగించి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వేలమ్మాళ్‌ను చికిత్స నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

*అక్రమంగా మత్తు మాత్రలు విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం మేరకు వివరాలిలా… న్యూ వాషర్‌మెన్‌పేట సీఐకి అందిన సమాచారం మేరకు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అన్నై ఇందిరానగర్‌ రైల్వే గేటు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తచ్చాడుతుండడం గమనించి వారిని విచారించారు.. అయితే పొంతనలేని సమాధానాలివ్వడంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి బ్యాగులో వెయ్యికి పైగా వివిధ కంపెనీలకు చెందిన మత్తు మాత్రలు బయల్పడ్డాయి. విక్రయించేందుకే వాటిని తీసుకొచ్చినట్లు నిందితులు పేర్కొన్నారు. దాంతో పోలీసులు వారి నుంచి 1,035 మాత్రలు, 6 స్టెర్‌లైట్‌ వాటర్‌ బాటిళ్లు, 86, 274 డిస్పోజబుల్‌ సిరంజిలు, 6 సెల్‌ఫోన్లు, ఒక మోటారు సైకిల్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఇదే ప్రాంతానికి చెందిన పాండురంగన్‌, గోపీనాథ్‌సింగ్‌, కొడుంగయూర్‌కు చెందిన బాలసుబ్రమణ్యన్‌, తిరుపతి జిల్లా సూళ్లూరు పేటకు చెందిన సంతోష్ కుమార్‌గా గుర్తించారు. వీరిని కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించారు

*తిరునల్వేలి జిల్లా వీరవనల్లూరులో నగల దుకాణం యజమానిపై గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి ఐదు కేజీల నగలను దోచుకెళ్ళిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వీరవనల్లూరు మెయిన్‌బజారులో మైదీన్‌పిచ్రై (55) నగల దుకాణాన్ని నడుపుతున్నాడు. సోమవారం రాత్రి పదిగంటలకు దుకాణాన్ని మూసివేసి ఇంటిలో భద్రపరిచేందుకు ఐదు కేజీల బంగారు నగల సంచితో ఇంటికి బయలుదేరాడు. మోటారు సైకిలుపై మైదీన్‌పిచ్చై ఇంటి సమీపంలోకి రాగానే అక్కడే మాటువేసిన ముగ్గురు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి నగల సంచిని లాక్కుని పారిపోయారు. ఈ సంఘటనలో మైదీన్‌పిచ్రై తీవ్రగాయాలతో రోడ్డుపై పడ్డారు. స్థానికులు గమనించి అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని చికిత్స నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎస్పీ శరవణన్‌, చేరన్‌మాదేవి డీఎస్పీ రామకృష్ణన్‌ ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వెళ్ళి విచారణ జరిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దోపిడీ దొంగల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.దీని కోసం ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టారు.

*దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మానసిక దివ్యాంగురాలు అత్యాచారానికి గురైన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఓ గ్రామానికి చెందిన 27ఏళ్ల దివ్యాంగ యువతికి మతిస్థిమితం సరిగా లేదు. ఆదివారం రాత్రి 8.30గంటల సమయంలో తన ఇంటి సమీపంలోని రహదారిపైకి వెళ్లింది. అయితే, ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకున్న సమయంలో.. గ్రామ శివారులో రోడ్డు వెంట బాధితురాలు నడుచుకుంటూ వస్తుండడాన్ని గమనించారు.

*మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించి ఓ బాలిక స్పృహ కోల్పోయేలా చేసిన ముగ్గురు బాలురు ఆమెపై లైంగిక దాడికి పాల్పడారు. నల్లగొండ జిల్లా పెద్దపూర మండలంలో ఈ నెల 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. పెద్దవూర మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక(12) కస్తూర్భా పాఠశాలలో చదువుకుంటోంది.

*రైలులో బాంబ్ ఉందని కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. గండిమైసమ్మ, బహదూర్ పల్లికి చెందిన తోర్రి కార్తిక్ (19) ఫేక్ కాల్ చేసినట్లుగా గుర్తించారు. బాంబ్ ఉందని కాల్ చేస్తే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దామని తాను కాల్ చేసినట్లు ఆకతాయి తెలిపారు. రైల్వే, లోకల్ పోలిసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

*మేడ్చల్ మండలం రాజా బొల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భర్త బ్రాహ్మణపల్లి భిక్షపతి వేధింపులు తట్టుకోలేక భార్య మమత(28) తన ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో మమత (28), పాప (3) బాబు (1)లు మృతి చెందగా…పెద్ద బాబు క్షేమంగా బయటపడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యల కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 2012 డిసెంబర్‌లో హిందువులను ఉద్దేశించి నిజామాబాద్, నిర్మల్‌లో అక్బర్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్‌పై నమోదయిన రెండు కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. కేసులు కొట్టివేసినంత మాత్రాన సంబరాలు వద్దని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో దాదాపు 30 మంది సాక్షులను కోర్టు విచారించింది. సుదీర్ఘ వాదనల తర్వాత బుధవారం నాంపల్లి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.

*ర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో జింకలపై పంజా విసిరిన వేటగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి గన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వేటగాడిని అటవీశాఖ అధికారులు ఆలూరు కోర్టులో హాజరుపరిచారు. జింకలను పట్టుకోబోయిన వేటగాడికి 15 రోజుల పాటు రిమాండ్‌కు పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.