DailyDose

ఈనెల 15, 16 తేదీల్లో రెండు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన – TNI తాజా వార్తలు

ఈనెల 15, 16 తేదీల్లో రెండు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన – TNI తాజా వార్తలు

*ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 15, 16 తేదీల్లో వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే కళ్యాణోత్సవానికి హాజరవుతారు. 16న కడప, కర్నూలు జిల్లాల్లో పలు వివాహ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

*ఆళ్ళగడ్డ మండలం జమ్ములదిన్నెలో అతిసార ప్రబలింది. దీంతో ముగ్గురు మృతి చెందగా.. 35 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని బిజేంద్రరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

* కనకదుర్గ వారధి వద్ద టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరసనకు దిగారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అంటేనే బాదుడే బాదుడు అని అన్నారు. నమ్మి ఓట్లేసినందుకు పిడిగుద్దులు గుద్దుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టే ప్రతీ కార్యక్రమం వల్ల తొలుత బాధపడేది పేదలే అని తెలిపారు. ధరల స్థిరీకరణ ఎక్కడ అమలు చేశారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని గద్దె రామ్మోహన్ డిమాండ్ చేశారు.

* తెలంగాణలో మరో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. అబ్కారీ, అటవీ, అగ్నిమాపక శాఖల్లోని ఉద్యోగ నియామకాలకు అనుమతినిస్తూ జీవోలు జారీ చేసింది. తొలి విడతలో 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులిచ్చిన ఆర్థిక శాఖ.. తాజాగా 3,334 పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో మొత్తం రెండు విడతల్లో అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య 33,787కి చేరింది.తెలంగాణలో మరో 3,334 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 80,039 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించిన ప్రభుత్వం.. తొలి విడతగా 30,453 నియామకాలకు ఆమోదం తెలిపింది. తాజాగా 3,334 పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో మొత్తం రెండు విడతల్లో అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య 33,787కి చేరింది. ఈసారి కొలువులు యూనిఫామ్‌ సర్వీసు పోస్టులైన ఆబ్కారీ, అగ్నిమాపకం, అటవీ శాఖలవి. మంగళవారం రాష్ట్ర మంత్రిమండలి వీటికి ఆమోదం తెలపడంతో తాజాగా వీటిపైనా ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది.

* ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భావం
ఏపీలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ‘జై భీం భారత్ పార్టీ’ని స్థాపిస్తున్నట్లు హైకోర్టు లాయర్‌ జడ శ్రవణ్ కుమార్ ప్రకటించారు. దళిత బిడ్డల కోసమే జై భీం భారత్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ఇతర పార్టీలు దళితుల పక్షపాతి అని మోసం చేస్తున్నాయని తప్పుబట్టారు. దళిత హోంమంత్రి ఉన్నా న్యాయం జరగడం లేదని శ్రవణ్ కుమార్ విమర్శించారు.రాష్ట్రంలో న్యాయవాదిగా శ్రవణ్ కుమార్‌ గుర్తింపు పొందారు. రాజధాని రైతుల కేసులు, విశాఖలో వైద్యుడు సుధాకర్ కేసుల్లో బాధితులకు అండగా నిలిచారు. రాష్ట్రంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగినా.. ఆయన బాధితులకు అండగా నిలిచేవారు. ప్రజలు తమ హక్కులను స్వేచ్ఛగా పొందేందుకు, అవినీతి లేని పాలన కోసం కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆయన తెలిపారు.

* టీడీపీలోకి త్వరలో భారీ చేరికలు ఉంటాయని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కేబినెట్ విస్తరణ తర్వాత జగన్ ఎంత బలహీనుడో తేలిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కేబినెట్ కూర్పుపై అసమ్మతితో సీఎం దిష్టిబొమ్మలు తగలబెట్టడం మొదటిసారి చూస్తున్నామని గంటా అన్నారు. మంత్రివర్గ విస్తరణలో కొన్ని జిల్లాలకు మంత్రి పదవులు లేకపోవడం దారుణమని గంటా విమర్శించారు.

* గుంటూరు: జిల్లాలోని ఫిరంగీపురం మండలం నుదురుపాడులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కమ్యూనిటీ హాల్ స్థలంలో అంబేడ్కర్బాబూ జగజీవనరామ్ విగ్రహాలు పెట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే మరో వర్గం అభ్యంతరం తెలిపింది. దాంతో ఇరు వర్గాలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలను అక్కడ నుంచి పోలీసులు పంపించారు. అనుమతి తీసుకున్న తర్వాతే విగ్రహాలు ఏర్పాటు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. రెండు వర్గాలతో పోలీసులు మాట్లాడి నచ్చ చెప్పారు.

* ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ముప్పేట దాడి చేయాలని నిర్ణయించింది. విజయవాడ పార్టీ కార్యాలయంలో సోము వీర్రాజుజీవీఎల్ భేటీ అయ్యారు. ఈ నెలలో కేంద్ర మంత్రులు పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయవాడకు రానున్నారు. ఈ నెల 25న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కడపకు రానున్నారు. విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ఈ నెల చివరి వారంలో విశాఖలో పర్యటించనున్నారు. సమావేశం అనంతరం సమావేశ నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉందని సోము వీర్రాజుజీవీఎల్ తెలిపారు.

*ఖైరతాబాద్ చౌరస్తాలోలోని మహావీర్ మఠ్ హనుమాన్ ఆలయాన్ని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలోని శ్రీసీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నుంచి బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభంకానుంది. రెండో విడత పాదయాత్రను బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ ప్రారంభించనున్నారు. ఉదయం జోగులంబ ఆలయంలో బీజేపీ అధ్యక్షుడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రెండో విడత పాదయాత్ర మే 14న మహేశ్వరంలో ముగియనుంది.

*మంత్రి పినిపే విశ్వరూప్ అనుచరులు రెచ్చిపోయారు. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కోనసీమ జిల్లాకు తొలిసారిగా వచ్చిన ఆయనకు స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. రోడ్లపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. బైక్‌లతో విన్యాసాలు చేశారు. సైలెన్సర్లు విప్పి జీరో కట్‌లతో హల్ చల్ చేశారు. నగరం ఏఎంసీ (అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ) ఛైర్మన్ కొండలరావు కరెన్సీ నోట్లు వెదజల్లారు. దాంతో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ కనిపించిన కరెన్సీ నోట్లను జనాలు ఏరుకున్నారు.

*కాంగ్రెస్ కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జేడీఎస్‌ తీర్థం పుచ్చుకున్న కేంద్రమాజీ మంత్రి ఇబ్రహీంకు జేడీఎస్‌ పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని దళపతులు నిర్ణయించారు. రామనగరలో మంగళవారం జరిగిన ర్యాలీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ సూచనప్రాయంగా ఈ విషయం ప్రకటించగా మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి బుధవారం ధ్రువీకరించారు. ప్రస్తుతం జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న హెచ్‌కే కుమారస్వామికి పార్లమెంటరీ పార్టీ బోర్డు చైర్మన్‌ పదవిని అప్పగించనున్నారు. ఈ నెల 17న బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం ఇబ్రహీంను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే సందర్భంగా కాంగ్రె్‌సకు చెందిన పలువురు మైనార్టీ నేతలు జేడిఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పలువురు సీనియర్‌ మైనార్టీ నేతలపై జేడీఎస్‌ దృష్టిసారించింది. ఇందులో భాగంగానే బెంగళూరు నగరానికి చెందిన మాజీ మంత్రి ఆర్‌ రోషన్‌బేగ్‌ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోవచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. బేగ్‌కు ఎమ్మెల్సీ పదవి, ఆయన కుమారుడు రుమేన్‌ బేగ్‌కు వచ్చే శాసనసభ ఎన్నికల్లో శివాజీనగర్‌ టికెట్‌ ఇచ్చేందుకు జేడీఎస్‌ అగ్రనేతలు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

*డిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,007 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 11,058 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.03 శాతం కాగా, రికవరీ రేటు ప్రస్తుతం 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 818 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం 83.08 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 4,34,877 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిగాయి. అలాగే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 186.22 కోట్ల వ్యాక్సిన్ డోస్‌ల పంపిణీ జరిగింది.

*వరంగల్: జిల్లాలోని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్ పూలమాల వేసిన తర్వాతే బీజేపీ వాళ్ళు పూలమాలలు వేయాలని టీఆర్ఎస్ నేతలు హుకుం జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆరూరి రాకకోసం బీజేపీ నాయకులు గంటపాటు ఎదురుచూశారు. ఎంతకూ ఎమ్మెల్యే రాకపోవడంతో పూలమాలలు వేసేందుకు బీజేపీ సిద్ధమవగా… వద్దని టీఆర్ఎస్‌ నాయకులు వారించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.

*బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయాల సందర్శనకు ప్రధాని మోదీ
హిమాయాల్లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయాలను ప్రధాన నరేంద్ర మోదీ మేలో సందర్శించనున్నారు. గంగోత్రి, యమునోత్రిలతో కూడిన చార్‌ ధామ్‌ యాత్రలో భాగమైన ఈ ఆలయాలు ఏటా శీతాకాలంలో ఆర్నెల్లు మూతబడి ఉంటాయన్నది తెలిసిందే. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు మే 3న, కేదార్‌నాథ్‌ మే 6, బద్రీనాథ్‌ మే 8న తెరుచుకోనున్నాయి

*విజయవాడలో ఢిల్లీలో గురువారం తనిఖీలు నిర్వహించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇచ్చి.. యూఎస్‌ ఎంబసీ అధికారులను మోసం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వీటి మూలాలు ఏపీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు విజయవాడలోని కన్సల్టెన్సీల్లో తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా మాచవరానికి చెందిన ఒకరు ఈ నెల 7న దిల్లీలోని యూఎస్‌ ఎంబసీలో స్టూడెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నానంటూ అపాయింట్‌మెంట్‌ లెటర్‌తో పాటు గుంటూరులోని ఓ బ్యాంకు నుంచి రూ.20లక్షల ఎడ్యుకేషన్‌ లోన్‌ మంజూరైందంటూ ఎంబసీకి దరఖాస్తు సమర్పించాడు.అయితే, సదరు వ్యక్తి సమర్పించినవన్నీ తప్పుడు పత్రాలని ఎంబసీ అధికారులు గుర్తించారు. దీనిపై ఎంబసీ అధికారులు మరింత లోతుగా ప్రశ్నించడంతో నకిలీ పత్రాల గుట్టు బయటపడింది. వాటిని విజయవాడలోని స్ప్రింగ్‌ ఫీల్డ్‌ ఓవర్సీస్‌ కన్సల్టెంట్స్‌కు చెందిన ఏజెంట్‌ కేశవ సమకూర్చినట్లు అతడు తెలిపాడు. ఈ పత్రాల కోసం రూ.26,500 చెల్లించినట్లు చెప్పాడు. దీనిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం మూడు రోజుల క్రితం విజయవాడకు వచ్చినట్లు తెలిసింది. ఇక్కడి కన్సల్టెంట్స్‌లో తనిఖీలు చేసినట్లు సమాచారం. కొన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

* ఫోర‌స్ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీ అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డి, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ హోంమంత్రి తానేటి వ‌నిత ప‌రామ‌ర్శించారు. అయితే ఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి స‌రైన కార‌ణం ఇంకా తెలియ‌డం లేద‌ని, మూడు గంట‌ల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు. అయితే బాధితులు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని, విప‌రీత‌మైన గాయాల‌య్యాయ‌ని తెలిపారు.

* చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఇవాళ అమృత్‌స‌ర్‌లోని అత్తారి బోర్డ‌ర్‌ను విజిట్ చేశారు. పాకిస్థాన్ బోర్డ‌ర్ పాయింట్‌ను విజిట్ చేసిన తొలి సీజేఐగా ఆయ‌న నిలిచారు. త‌న కుటుంబంతో క‌లిసి ఆయ‌న రిట్రీటింగ్ సెర్మ‌నీని వీక్షించారు. పంజాబ్‌లో ఉన్న జ‌లియ‌న్‌వాలా భాగ్‌ను కూడా ఆయ‌న సంద‌ర్శించి ఫ్రీడం ఫైట‌ర్ల‌కు నివాళి అర్పించారు. త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి గోల్డెన్ టెంపుల్‌ను కూడా విజిట్ చేశారు.

*ఏలూరు జిల్లా అక్కిరెడ్డి గూడెం ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో ప్రాణనష్టం విచారకరమన్నారు. ఇప్పటికే 6 గురు చనిపోవడంతో పాటు 12 మంది తీవ్రంగా గాయపడడంపై ఆవేదన చెందారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలన్నారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ విషయంలో యాజమాన్యాలు రాజీ పడకూడదని తెలిపారు. ప్రభుత్వం కూడా నిత్యం తనిఖీల ద్వారా ప్రమాదాల నివారణకు పని చెయ్యాలన్నారు. ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకోవాలని… బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

*ఏలూరు జిల్లా అక్కిరెడ్డి గూడెం ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో ప్రాణనష్టం విచారకరమన్నారు. ఇప్పటికే 6 గురు చనిపోవడంతో పాటు 12 మంది తీవ్రంగా గాయపడడంపై ఆవేదన చెందారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలన్నారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ విషయంలో యాజమాన్యాలు రాజీ పడకూడదని తెలిపారు. ప్రభుత్వం కూడా నిత్యం తనిఖీల ద్వారా ప్రమాదాల నివారణకు పని చెయ్యాలన్నారు. ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకోవాలని… బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

*మంత్రి పినిపే విశ్వరూప్ అనుచరులు రెచ్చిపోయారు. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కోనసీమ జిల్లాకు తొలిసారిగా వచ్చిన ఆయనకు స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. రోడ్లపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. బైక్‌లతో విన్యాసాలు చేశారు. సైలెన్సర్లు విప్పి జీరో కట్‌లతో హల్ చల్ చేశారు. నగరం ఏఎంసీ (అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ) ఛైర్మన్ కొండలరావు కరెన్సీ నోట్లు వెదజల్లారు. దాంతో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ కనిపించిన కరెన్సీ నోట్లను జనాలు ఏరుకున్నారు.

*గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సమావేశం ఈ నెల 22న హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బోర్డు బడ్జెట్‌కు ఈ సమావేశంలో ఆమోదముద్ర తెలుపనున్నారు. కేంద్ర గెజిట్‌ను అనుసరించి.. గోదావరి పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంతో పాటు.. మూలధనం కింద రెండు తెలుగు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లు జమచేయాలని, అనుమతిలేని ప్రాజెక్టుల వివరణాత్మక నివేదికలను (డీపీఆర్‌లు) సమర్పించాలని ఇరు రాష్ట్రాలను బోర్డు కోరనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల అనుమతి కోసం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో తెలంగాణ సమర్పించిన మూడు డీపీఆర్‌లకు క్లియరెన్స్‌ రావడంతో.. వాటిపైనా బోర్డు చర్చించి, తన అభిప్రాయాలను తెలుపనుంది. అనంతరం డీపీఆర్‌లను తదుపరి అనుమతి కోసం సాంకేతిక సలహాదారుల సంఘానికి(టీఏసీ) పంపించనున్నారు.

*అసమర్థ పాలనతో వైకాపా ప్రభుత్వం పేదలపై పన్నుల భారం వేస్తూ, ఛార్జీలు పెంచుతూ ప్రజలను పీక్కుతింటోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వారానికో శాఖలో ఛార్జీలు, పన్నులు పెంచడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు, చెత్తపై పన్ను, ప్రాపర్టీ టాక్స్‌లతో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కు వగా వినియోగించే ప్రజా రవాణా అయిన ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం మోపినట్లు అవుతుందని ఆక్షేపించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాన్ని, ప్రజలను ఎటు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. పల్లెవెలుగు సహా అన్ని రకాల బస్సు సర్వీసులపై ఛార్జీల పెంపును ఖండించిన చంద్రబాబు.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

*రియాల్టీ షో లాక్‌పను ఓటీటీయూట్యూబ్‌ఇతర సోషల్‌ మీడియాల ద్వారా ప్రసారం కాకుండా నిలిపేయాలంటూ ప్రైడ్‌ మీడియా పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ షోకు మూలకథగా భావిస్తున్నపై కాపీరైట్స్‌కు సంబంధించి ప్రైడ్‌ మీడియాఆల్ట్‌ బాలాజీ సంస్థల మధ్య వివాదం నెలకొంది. ఈ సీరియల్‌ ప్రసారాన్ని నిలిపివేయాలన్న ప్రైడ్‌ మీడియా పిటిషన్‌పై ట్రయిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో లాకప్‌ షోను నిర్మించిన ఆల్ట్‌ బాలాజీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఏడాది ఫిబ్రవరి 26న తెలంగాణ హైకోర్టు ట్రయిల్‌కోర్టు ఉత్తర్వులను కోట్టేయడంతో ప్రైడ్‌ మీడియా ఈమేరకు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇప్పటికే లాకప్‌ షో టెలికాస్ట్‌ అవుతున్నందువల్ల దీనిపై మళ్లీ ట్రయిల్‌ కోర్టునే ఆశ్రయించాలని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది. ‘ది జైల్‌’’ కథతో ఇప్పటికే 22 ఎపిసోడ్లను సిద్ధం చేశామని, కథను కూడా ‘ స్ర్కీన్‌ రైటర్స్‌ అసోసియేషన్‌’లో రిజస్టర్‌ ప్రైడ్‌ మీడియా తెలిపింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ప్రొడక్షన్‌ను మొదలుపెట్టలేకపోయాని చెప్పింది. అయితే అప్పటికే ఆల్ట్‌ బాలాజీ ఆధ్వర్యంలో లాకప్‌ షో ప్రారంభమైన విషయాన్ని గుర్తించినట్టు పేర్కొం ది. కాగా.. ‘ది జైల్‌’ పేరుతో కథ 2018లోనే రిజిస్టర్‌ అయిందని, ఆల్ట్‌ బాలాజీ సంస్థ మార్కెటింగ్‌ కోసం పెద్ద మొత్తా న్ని ఖర్చుపెట్టిందని, ఈఏడాది ఫిబ్రవరి నుంచి లైవ్‌లో ప్రసా రమవుతోందని హైకోర్టు విచారణ సందర్భంగా పేర్కొంది.

*తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు ఐపీఎల్‌లో ఆడుతున్న తమ దేశ క్రికెటర్లు మద్దతివ్వాలని ఆ దేశ మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ కోరాడు. అంతేకాదు.. లంక ఆటగాళ్లు ఓ వారంపాటు ఐపీఎల్‌ను వదిలేసి స్వదేశంలో నిరసన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ‘ప్రపంచంలోనే అత్యంత ఽఖరీదైన లీగ్‌ ఐపీఎల్‌లో ఆడుతున్న కొందరు లంక క్రికెటర్లు ఇక్కడ జరుగుతున్న సంక్షోభంపై ఇప్పటిదాకా స్పందించలేదు. వాళ్లు వెంటనే స్వదేశానికి చేరుకొని పౌరులకు మద్దతు తెలపాలి. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతున్నారు. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే క్రికెట్‌ బోర్డులోని కొందరు వారి పదవులు కాపాడుకోవాలని చూస్తున్నారు. అందుకే వారు ప్రజలకు మద్దతుగా ప్రకటనలు చేయడం లేదు. దేశంలో ఇలాంటి సంక్షోభం ఎదురైనప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడగల ధైర్యం ఆటగాళ్లకు ఉండాలి. మీ బిజినె్‌సలు మాత్రమే చూసుకుంటే సరిపోదు’ అని రణతుంగ అన్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో లంక క్రికెటర్లు వనిందు హసరంగ (బెంగళూరు), భనుక రాజపక్స (పంజాబ్‌), మహీష్‌ తీక్షణ (చెన్నై), దుష్మంత చమీర (లఖ్‌నవూ), చమిక కరుణరత్నె (కోల్‌కతా) వివిధ జట్ల తరఫున ఆడుతున్నారు.

*వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంటీ కృష్ణబాబును ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ ము ఖ్య కార్యదర్శిగా ఉన్న కృష్ణబాబును ఆరోగ్యశాఖకు బదిలీ చేశారు. అలాగేఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎం.హరిజవహర్‌లాల్‌ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కృష్ణబాబుకు వైద్య, ఆరోగ్యశాఖతోపాటు ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌పోర్టు విభాగం ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు

*ఏపీపీఎస్సీ గతంలో ప్రకటించిన అసిస్టెంట్‌ ఇంజనీర్ల పోస్టుల భర్తీకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువిచ్చారు. గతం లో దరఖాస్తు సమయంలో పలువురు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోలేదు. అదేవిధంగా కొందరు మళ్లీ పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకుంటామని కోరారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల ఎంపిక కోసం మళ్లీ గడువు ఇస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి అహ్మద్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

*విద్యుత్‌ రంగంలోని సంస్థల అసోసియేషన్లు, సంఘాలు తమ పీఆర్సీ వినతి పత్రాలను సమర్పించేందుకు గడువు పెంచుతూ విద్యుత్‌ సంస్థల పీఆర్సీ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. గతం లో ఈనెల 13 వరకు ఉన్న గడువును తాజాగా ఈనెల 30 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది.

*ఏపీ రెవెన్యూశాఖకు స్కోచ్‌ అవార్డు లు దక్కాయి. పట్టా, ప్రభుత్వ భూముల వివరాలు తెలియజేసే ‘మీ భూమి’ పోర్టల్‌ను ఏపీ రెవెన్యూశాఖ నిర్వహిస్తోంది. ఈ-గవర్నెన్స్‌ విభాగం కింద దీనికి సిల్వర్‌ మెడల్‌ లభించింది. కౌలుదారు గుర్తింపు కార్డులు(సీసీఆర్‌), పేద కుటుంబాలకు ఇంటిస్థలాలు, భూశోధక్‌ డిజిటల్‌ ప్రాజెక్టులను ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులు వరించాయి. స్కోచ్‌ సంస్థ నిర్వహించిన వెబినార్‌లో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌.. స్కోచ్‌ అవార్డులను స్వీకరించారు. ఈ వె బినార్‌లో రెవెన్యూశాఖ మొత్తం 9 ప్రాజెక్టులపై ప్రజంటేషన్లు ఇచ్చింది. భూ శోధక్‌ ప్రాజెక్టును జనవరిలో ప్రారంభించారు. ఇది రైతుల వద్ద ఉన్న భూమి పత్రాల ఒరిజినాలిటీని బార్‌ కోడింగ్‌ ఆధారంగా నిర్ధారించనుంది.

*అత్యధిక ఆదాయం, ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగంపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీ హయాంలో తగ్గించిన ఆక్వా విద్యుత్‌ చార్జీలను జగన్‌ పాలనలో రెట్టింపు చేసి, ఆక్వా రైతులపై మరింత భారం మోపారని మండిపడ్డారు. ఆక్వా చెరువుల విస్తీర్ణం ప్రాతిపదికన విద్యుత్‌ సబ్సిడీ రద్దు చేస్తూ జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించా రు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన చేశారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్‌ ఇస్తానన్న హామీని విస్మరించి, ఐదెకరాల పైబడిన చేపలు, రొ య్యల చెరువులకు యూనిట్‌ విద్యుత్‌ రూ3.85కు పెంచి, ఆక్వా సాగుదారుల్ని సంక్షోభంలోకి నెట్టారన్నారు. ఇప్పటికే విద్యుత్‌ కోతలు, పవర్‌ హాలిడే నిర్ణయాలతో ప్రొసెసింగ్‌ కంపెనీలు రొయ్యల ధరలు తగ్గించాయని అన్నారు.

* ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ జీవోలను తక్షణమే విడుదల చేయాలని ప్రజారవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం అందజేశామని కమిటీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావుపలిశెట్టి దామోదరరావుకో కన్వీనర్లు సీహెచ్‌.సుందరయ్యవైఎస్‌ రావుఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డిఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు సంయుక్త ప్రకటనలో తెలిపారు. పీఆర్సీ మేరకు పెంచిన జీతభత్యాలను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని ప్రభుత్వం అంగీకరించిందన్నారు.ప్రత్యేక జీవోలు ఇస్తామని చెప్పి నాలుగు నెలలైనా ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం అంగీకరించిన విధంగానే వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం జరిగేలా సవరించిన వేతనాలతో జీవోలు ఇవ్వాలని కోరామన్నారు. ఇటీవల ఆర్టీసీ ఎండీకి సమర్పించినడిమాండ్లకు సంబంధించి మేనేజ్‌మెంట్‌ రాతపూర్వకంగా ఇచ్చిన కొన్ని సమాధానాల పట్ల ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నందునమరోసారి ఎండీనీ కలిసి మెమోరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు.

*సమాజంలో నేటికీ దురాచారాలు మాసిపోలేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. అంగన్‌వాడీ కేంద్రంలో ‘కులం’ బూచిని చూపుతూ చిన్నారుల తల్లిదండ్రులు ఇక్కడ వండే ఆహారాన్ని తమ పిల్లలకు పెట్టడం లేదు. దీంతో నిర్వాహకులు బియ్యం, గుడ్లు వంటివి చిన్నారుల ఇళ్లకే పంపిస్తుండడంతో, వారి తల్లులే వంట చేసి క్యారేజీలు పంపిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని గొల్లపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో 28 మంది చిన్నారులు ఉన్నా రు. 2015కు ముందు బీసీ మహిళ హెల్పర్‌గా ఉండేవారు. 2015లో ఆమె ఉద్యోగ విరమణ చేయడంతో.. రోస్టర్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఎస్సీ మహిళను నియమించారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్త హనుమక్క, సహాయకురాలు అరుణ ఎస్సీ మహిళలే. దీంతో ఇళ ్లలో తల్లిదండ్రులు వారు వండిన అన్నాన్ని పిల్లలకు తినిపించేందుకు అంగీకరిచండం లేదు. దీనిపై సీడీపీవోను సంప్రదించగా ఆమె స్పందించలేదు.

*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జీలను తెలంగాణ హైకోర్టుకు నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టులోని తెలంగాణ న్యాయమూర్తులను ఇతర రాష్ర్టాలకు బదిలీలు చేసి, ఇతర రాష్ర్టాలకు చెందిన న్యాయమూర్తులను ఇక్కడికి బదిలీచేయడాన్ని సహించబోమని న్యాయవాదులు తెలిపారు. ఈ మేరకు బుధవారం భోజన విరామ సమయంలో హైకోర్టులోని బార్‌ కౌన్సిల్‌ గేటుముందు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

*ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత దృష్ట్యా భారత్‌, అమెరికాలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత నౌకాశ్రయాల్లో అమెరికా నేవీకి చెందిన నౌకల మరమ్మతులు చేపట్టేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. సోమవారం వాషింగ్టన్‌లో ఇరుదేశాల విదేశీ, రక్షణ మంత్రుల మధ్య జరిగిన ఉమ్మడి భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. తాజా నిర్ణయం ఇండో పసిఫిక్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి మరింత భరోసానివ్వడమే కాక, భారత నౌకాశ్రయాలకు అదనపు వ్యాపారాన్ని తీసుకొస్తుందని రక్షణ రంగ పరిశీలకులు తెలిపారు

* రియాల్టీ షో ‘లాక్‌ప’ను ఓటీటీ, యూట్యూబ్‌, ఇతర సోషల్‌ మీడియాల ద్వారా ప్రసారం కాకుండా నిలిపేయాలంటూ ప్రైడ్‌ మీడియా పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ షోకు మూలకథగా భావిస్తున్న ‘‘ద జైల్‌’’ పై కాపీరైట్స్‌కు సంబంధించి ప్రైడ్‌ మీడియా, ఆల్ట్‌ బాలాజీ సంస్థల మధ్య వివాదం నెలకొంది. ఈ సీరియల్‌ ప్రసారాన్ని నిలిపివేయాలన్న ప్రైడ్‌ మీడియా పిటిషన్‌పై ట్రయిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో లాకప్‌ షోను నిర్మించిన ఆల్ట్‌ బాలాజీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఏడాది ఫిబ్రవరి 26న తెలంగాణ హైకోర్టు ట్రయిల్‌కోర్టు ఉత్తర్వులను కోట్టేయడంతో ప్రైడ్‌ మీడియా ఈమేరకు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇప్పటికే లాకప్‌ షో టెలికాస్ట్‌ అవుతున్నందువల్ల దీనిపై మళ్లీ ట్రయిల్‌ కోర్టునే ఆశ్రయించాలని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది. ‘ది జైల్‌’’ కథతో ఇప్పటికే 22 ఎపిసోడ్లను సిద్ధం చేశామని, కథను కూడా ‘ స్ర్కీన్‌ రైటర్స్‌ అసోసియేషన్‌’లో రిజస్టర్‌ ప్రైడ్‌ మీడియా తెలిపింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ప్రొడక్షన్‌ను మొదలుపెట్టలేకపోయాని చెప్పింది. అయితే అప్పటికే ఆల్ట్‌ బాలాజీ ఆధ్వర్యంలో లాకప్‌ షో ప్రారంభమైన విషయాన్ని గుర్తించినట్టు పేర్కొం ది. కాగా.. ‘ది జైల్‌’ పేరుతో కథ 2018లోనే రిజిస్టర్‌ అయిందని, ఆల్ట్‌ బాలాజీ సంస్థ మార్కెటింగ్‌ కోసం పెద్ద మొత్తా న్ని ఖర్చుపెట్టిందని, ఈఏడాది ఫిబ్రవరి నుంచి లైవ్‌లో ప్రసా రమవుతోందని హైకోర్టు విచారణ సందర్భంగా పేర్కొంది.

*హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ వద్ద పీవీ మార్గ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహ పనులను డిసెంబర్‌ చివరికి పూర్తి చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆయన విగ్రహ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మంత్రి కొప్పుల పర్యవేక్షణలో 8 నెలలుగా విగ్రహ ఏర్పా టు పనులు చురుగ్గా జరుతున్నాయన్నారు. 55 అడుగుల బేస్‌మెంట్‌ నిర్మాణం 95 శాతం మేర పూర్తి అయ్యిందని తెలిపారు. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ పనులను వచ్చే డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి చేసి విగ్రహావిష్కరణ చేపడతామని వెల్లడించారు.

*హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఈనెల 15న నగరానికి రానున్నారు. ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా రుషికొండలో గల పెమ వెల్‌నెస్‌ సెంటర్‌ (బేపార్కు)కు వెళతారు. అక్కడ ఐదురోజులు చికిత్స తీసుకుంటారు. తిరిగి ఈనెల 20న విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారని జిల్లా అధికారులు తెలిపారు. కాగా రుషికొండలో గల బేపార్కు (గత ఏడాది పెమ వెల్‌నెస్‌ సెంటర్‌గా పేరు మార్చారు)కు దేశంలో అనేక మంది ప్రముఖులు చికిత్స కోసం వచ్చి వెళుతుంటారు.

* సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌, టీడీపీ నాయకుడు సీనియర్‌ ఏవీ సుబ్బారెడ్డి, విజయవాడ సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు కలిశారు. బుధవారం హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. మే 12వ తేదీన గోల్కొండ రిసార్ట్‌లో తన కుమార్తె ఏవీ జస్వంతికి, బోండా కుమారుడు సిద్ధార్థతో జరిగే వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. నూతన వధువరూలతో సహా ఏవీ సుబ్బారెడ్డి, బోండా ఉమా చిరంజీవికి వివాహ శుభలేఖను అందించి ఆహ్వానించారు.

* కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎంఆర్‌ పేరుతో రైస్‌ మిల్లుల్లో అవకతవకలు జరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బియ్యం రీ సైక్లింగ్‌పై సీబీఐ విచారణ జరపాలని సూచించారు. ధాన్యం సేకరణ, కస్టమ్‌ మిల్లింగ్‌, ఎఫ్‌సీఐకి సరఫరాలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వంలోని ముఖ్యులు రైస్‌ మిల్లర్లతో కుమ్మక్కయ్యారని లేఖ ద్వారా ఆరోపించారు. ప్రతి ఏటా రూ.100 కోట్ల ధాన్యం స్కాంకి పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.