DailyDose

పాక్ కొత్త ప్రధానికి ఐదుగురు భార్యలు.. 60 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి.. !

పాక్ కొత్త ప్రధానికి ఐదుగురు భార్యలు.. 60 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి.. !

ఇమ్రాన్‌‌‌ఖాన్ తర్వాత పాకిస్తాన్ దేశానికి ప్రధాని అయ్యారు షెహబాజ్ షరీఫ్.. ఆ దేశ 23వ ప్రధానిగా ఆయన సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.ఇమ్రాన్‌‌‌ఖాన్ తర్వాత పాకిస్తాన్ దేశానికి ప్రధాని అయ్యారు షెహబాజ్ షరీఫ్.. ఆ దేశ 23వ ప్రధానిగా ఆయన సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అయితే 70 ఏళ్ల షెహబాజ్ షరీఫ్ ఇప్పటివరకు మొత్తం అయిదుగురిని వివాహం చేసుకున్నారు. వారి జాబితా ఇలా ఉంది.. అలియా హనీ, నీలోఫర్ ఖోసా, కుల్సూమ్ హై, నుస్రత్, తెహ్మీనా దురానీ.. ఇందులో అలియా హనీ, నీలోఫర్ ఖోసా, కుల్సూమ్ హై లకి విడాకులు ఇచ్చారు షరీఫ్.. ప్రస్తుతం ఆయనకి నుస్రత్, తెహ్మీనా దురానీ అనే ఇద్దరు భార్యలున్నారు.. నుస్రత్, షరీఫ్ దంపతులకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలుండగా, ఆలియా, షరీఫ్ లకి ఓ కూతురు జన్మించారు.షరీఫ్ 1973లో 23 సంవత్సరాల వయస్సులో మొదటిసారి నుస్రత్ షాబాజ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె మరణించడంతో 1993లో అలియా హనీ అనే వర్ధమాన మోడల్‌‌ని పెళ్లి చేసుకున్నాడు.. అప్పుడు ఆయన వయస్సు 43 సంవత్సరాలు.. వీరి వివాహం ఎక్కువ రోజులు నిలవలేదు.. 1993లో అలియా హనీతో విడాకులు తీసుకున్న షరీఫ్.. నీలోఫర్ ఖోసాను మూడవ వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత తెహ్మీనా దుర్రానీతో నాల్గవ వివాహం చేసుకున్నారు. చివరగా ఐదో పెళ్లిని 60 సంవత్సరాల వయసులో కల్సూమ్ హైని అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్నారు షరీఫ్.. వీరు కూడా విడాకులు తీసుకున్నారు. అటు గతంలో పాక్‌కి ప్రధానిగా మూడుసార్లు ఎన్నికైన నవాజ్ షరీఫ్ కు షెహబాజ్ షరీఫ్ సొంత తమ్ముడు కావడం విశేషం. ఇక పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన షాబాజ్ షరీఫ్ గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు