DailyDose

FLASH: సీపీఐ నారాయణకు సతీవియోగం

FLASH: సీపీఐ నారాయణకు సతీవియోగం

సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం అలుముకున్నది. ఆయన సతీమణి వసుమతిదేవి (65) కన్నుమూశారు. కొంతకాలం ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో వసుమతిదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. వసుమతి మృతిపై పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు నివాళులర్పించి, నారాయణకు సంతాపం ప్రకటించారు.