Movies

ఎన్టీఆర్‌ ఎంత మారిపోయాడో.. వైరల్‌ అవుతున్న లుక్‌

ఎన్టీఆర్‌ ఎంత మారిపోయాడో.. వైరల్‌ అవుతున్న లుక్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో తారక్‌ పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. కొమరం భీమ్‌ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత కొరటాల శివతో తారక్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కొమరం భీమ్‌ కోసం రఫ్‌ లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్‌ ఈ చిత్రం కోసం కంప్లీట్‌ లుక్‌ని మార్చేశాడు. స్లిమ్‌గా, స్టైలిష్‌ లుక్‌లోకి మారిపోయాడు. స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఫిట్ గా ఉండాలని కొరటాల సూచించడంతో అందుకు తగ్గట్లు తారక్‌ మారిపోయాడు. మాంచి ట్రిమ్డ్‌ లుక్‌లోకి వచ్చి సరికొత్త స్టైల్‌లో కనిపిస్తున్నాడు.