ScienceAndTech

భూమివైపు దూసుకొస్తున్న అతిపెద్ద తోకచుక్క.. నాసా శాస్త్రవేత్తల నిఘా

భూమివైపు దూసుకొస్తున్న అతిపెద్ద తోకచుక్క.. నాసా శాస్త్రవేత్తల నిఘా

ఇందులో ఎడమవైపు ఫొటో 2022 జనవరి 8 నాటి చిత్రం. కుడివైపు చిత్రంలో తోకచుక్క కేంద్రకం చుట్టూ ఉండే ‘కోమా’ కనిపిస్తుంది.
మామూలుగా కన్నా 50 రెట్లు పెద్దదిగా ఉన్న ఓ తోకచుక్క గంటకు 35,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది.ఈ తోకచుక్క కేంద్రకం మంచుతో నిండి ఉందని, దాని ద్రవ్యరాశి 500 లక్షల కోట్ల టన్నులని, అది మొత్తం 137 కిలోమీటర్ల వెడల్పు ఉందని నాసా హబుల్ టెలిస్కోప్ నిర్ధారించింది. అంటే అమెరికాలోని రోడ్ ఐలండ్ రాష్ట్రం కన్నా ఈ తోక చుక్క పెద్దది.అయితే దూసుకొస్తున్న ఈ తోకచుక్కను చూసి భయపడాల్సిందేమీ లేదు. ఇది మనకు అతి సమీపంగా వచ్చే దూరం.. సూర్యుడికి 100 కోట్ల మైళ్ల దూరం నుంచి వెళ్లిపోతుంది. అది కూడా 2031 నాటికి కానీ రాదు.ఈ తోకచుక్కను తొలిసారి 2010లో గుర్తించారు. దీని పరిమాణాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా నిర్ధారించింది.ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ చూసిన అన్ని తోకచుక్కలకన్నా ఇది చాలా చాలా పెద్దది.

”ఈ తోకచుక్క చాలా పెద్దదే అయివుండాలని మేం ఎప్పుడూ అనుమానిస్తూనే వచ్చాం. ఎందుకంటే అంత సుదూరంగా కూడా అది చాలా ప్రకాశవంతంగా మెరుస్తోంది. అది నిజంగానే చాలా పెద్దదని ఇప్పుడు నిర్ధారణ అయింది” అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెలెస్ (యూసీఎల్ఏ)లో ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ డేవిడ్ జెవిట్ చెప్పారు.ఈ మంచు ధూళి గోళం ”మనవైపు దూసుకొస్తున్న” మేరునగం అని నాసా అభివర్ణించింది.నాసా విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. పెడ్రో బెర్నార్డినెల్లి, గారీ బెర్న్‌స్టీన్ అనే ఖగోళ శాస్త్రవేత్తలు ఈ భారీ తోకచుక్కను కనిపెట్టారు. చిలీలోని సెర్రో టోలొలొ ఇంటర్-అమెరికన్ అబ్జర్వేటరీలో డార్క్ ఎనర్జీ సర్వే విభాగంలో పాత ఫొటోలను పరిశీలించినపుడు వారు ఈ తోకచుక్కను గుర్తించారు.తోకచుక్కలనేవి.. గ్రహాల నిర్మాణం జరిగిన తొలి రోజుల్లో మిగిలిపోయిన మంచుతో కూడిన ‘లెగో బ్లాక్స్’వంటివని నాసా అభివర్ణించింది.

”భారీ బాహ్య గ్రహాల గురుత్వాకర్షణ పెనుగులాటలో సౌర వ్యవస్థ నుంచి బలవంతంగా బయటకు విసిరేసిన వ్యర్థాలవి” అని నాసా పేర్కొంది.భూమికి 4000 కాంతి సంవత్సరాల దూరంలో అంతుచిక్కని వస్తువు, 18 నిమిషాలకు ఒకసారి రేడియో ఎనర్జీ విడుదల
ప్లూటోపై మంచు పర్వతాలు ఎందుకు పగులుతున్నాయి? ఖగోళ శాస్త్రవేత్తలను తికమక పెడుతున్న ‘ఐస్ వోల్కనో’ల మిస్టరీ ఏమిటి?
”అలా తన్నితరిమేసిన తోకచుక్కలు ఊర్ట్ క్లౌడ్‌లో తలదాచుకున్నాయి. సౌర వ్యవస్థకు సుదూరంగా దీన్ని చుట్టుముట్టి సంచరిస్తున్న అనేకానేక తోకచుక్కల రిజర్వాయర్ ఊర్ట్ క్లౌడ్” అని వివరించింది.ఈ తోకచుక్క ఓ అద్భుతమైన వస్తువని మకావు యూనివర్సిటి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన మాన్-టో హుయి అభివర్ణించారు. ”ఇది చాలా పెద్దదని మేం ఊహించాం. కానీ దానిని నిర్ధారించుకోవటానికి ఉత్తమ సమాచారం అవసరమైంది” అని చెప్పారాయన.కామెట్ బెర్నార్డినెల్లి-బెర్న్‌స్టీన్.. ముప్పై లక్షల సంవత్సరాల సుదీర్ఘమైన దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. అలా తిరిగే క్రమంలో సూర్యుడి నుంచి సుమారు అర్ధ కాంతి సంవత్సరం దూరం వరకూ ఈ తోకచుక్క పోతుంది.ఇప్పుడు ఈ తోకచుక్క సూర్యుడికి 200 కోట్ల మైళ్ల కన్నా తక్కువ దూరంలో, మన సౌర వ్యవస్థకు దాదాపు లంబంగా ఉంది.