Videos

టీజర్‌ వచ్చేది అప్పుడే..

టీజర్‌ వచ్చేది అప్పుడే..

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌నీల్‌ (‘కేజీఎఫ్‌’ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మిస్తున్నారు. అరవై శాతం చిత్రీకరణ పూర్తయింది. కీలక ఘట్టాల్ని గోదావరిఖని బొగ్గు గనుల్లో చిత్రీకరించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మే నెలాఖరులో విడుదల చేయబోతున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్‌ పాత్ర శక్తివంతంగా సాగుతుందని, మునుపెన్నడూ చూడని రీతిలో ఆయన కొత్త పంథాలో కనిపిస్తారని చెబుతున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నది. పాన్‌ ఇండియా మూవీగా ‘సలార్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుంది.