NRI-NRT

బ్రిటన్‌లో భారతీయ బాలికకు అరుదైన గౌరవం

బ్రిటన్‌లో భారతీయ బాలికకు అరుదైన గౌరవం

బ్రిటన్‌లో 11 ఏళ్ల భారత సంతతి బాలిక అనిషా యడ్లకు అరుదైన గౌరవం దక్కింది. రిచ్‌మండ్ పార్క్‌లోని వైట్ లాడ్జ్‌లోని ప్రముఖ ‘ది రాయల్ బ్యాలె స్కూల్‌’లో అనిషా సీటు దక్కించుకుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్లాసికల్ బ్యాలె(జిమ్నాస్టిని పోలిన ఓ ప్రత్యేకమైన నృత్యం) శిక్షణ ఇవ్వడం ఈ స్కూల్ ప్రత్యేకత. దీనికోసం ప్రపంచ నలుమూలల నుంచి ప్రతియేటా వేలాదిగా దరఖాస్తులు వస్తాయి. వాటిలోంచి వడబోసి పరిమిత సంఖ్యలో మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది కేవలం 12 మందిని మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. వారిలో అనిషా యడ్ల ఒకరు. ఇలా తన డ్యాన్సింగ్ టాలెంట్‌తో అనిషా బ్యాలె స్కూల్‌లో అడ్మిషన్ పొందడం విశేషం.
J1
బ్రిటన్‌లో 11 ఏళ్ల భారతీయ బాలికకు అరుదైన గౌరవంఇక 17ఏళ్ల క్రితం ఇండియా నుంచి బ్రిటన్ వెళ్లిన అనిషా ఫ్యామిలీ లీసెస్టర్‌లో స్థిరపడింది. అనిషా తండ్రి సూర్యది విజయవాడ కాగా, తల్లిది హైదరాబాద్. చిన్న వయసులో తన కూతురు సాధించిన ఈ అరుదైన గౌరవం పట్ల సూర్య ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో చాలా కొద్ది మందికే ఈ అవకాశం దక్కుతుందని, అది తన కుమార్తెకు దక్కడం చాలా గర్వకారణమని ఆన పేర్కొన్నారు.
j2