Movies

ఆలియా భట్‌ షాకింగ్‌ నిర్ణయం!

ఆలియా భట్‌ షాకింగ్‌ నిర్ణయం!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా రిలీజ్‌ కాగానే ఈ సినిమా పట్టాలెక్కించడానికి మేకర్స్‌ రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఎన్టీఆర్‌30 ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి ఆలియా తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు కూడా చెప్పేసిందట. బాయ్‌ఫ్రెండ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో పెళ్లి కారణంగా వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించేందుకు ఆలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది