ScienceAndTech

వాట్సాప్ లో ఒకేసారి 32 మందికి గ్రూప్ కాల్

వాట్సాప్ లో ఒకేసారి 32 మందికి గ్రూప్ కాల్

వాట్సప్‌ మరిన్ని ఫీచర్లతో ముందుకొస్తోంది. త్వరలోనే వాట్సప్‌లో మరిన్ని ఫీచర్లు జోడించనున్నట్టు ఆ యాప్‌ యాజమాన్య సంస్థ మెటా ప్లాట్‌ఫార్మ్స్‌ సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ గురువారం ఓ పోస్టులో వెల్లడించారు. గ్రూప్‌ కాల్‌లో ఒకేసారి 32 మంది పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించనున్నామని, 2 గిగాబైట్ల పరిమాణంలోని ఫైళ్లను షేర్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని వాట్సప్‌ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం గ్రూప్‌ వాయిస్‌కాల్‌లో గరిష్ఠంగా 8 మంది మాత్రమే పాల్గొనే అవకాశముంది. ఒక గిగాబైట్‌ మించని ఫైళ్లను మాత్రమే ఇప్పటివరకూ ఈ వేదికలో షేర్‌ చేసుకోవడం వీలవుతోంది. గ్రూప్‌లోని అడ్మినిస్ట్రేటర్‌ ఎప్పుడైనా మెసేజ్‌లను తొలగించే ఫీచర్‌ను కూడా వాట్సప్‌ అందుబాటులోకి తీసుకురానుంది.