DailyDose

లండన్‌లో 48 మంది మహిళలపై వేధింపులు – TNI నేర వార్తలు

లండన్‌లో 48 మంది మహిళలపై వేధింపులు – TNI  నేర వార్తలు

*వృత్తిని అడ్డుపెట్టుకుని అకృత్యాలకు పాల్పడుతున్న భారత సంతతి వైద్యుడిని లండన్‌ కోర్టు దోషిగా తేల్చింది. 72 ఏళ్ల కృష్ణసింగ్‌ 35 ఏళ్లలో 48 మంది మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రకరకాల పరీక్షల పేరుతో అభ్యంతరకరంగా ప్రవర్తించడం, వారిని ముద్దాడేందుకు ప్రయత్నించడం, అసభ్యకరమైన భాషను ప్రయోగిస్తూ నీచమైన వ్యాఖ్యలు చేయడం తదితర చేష్టలతో తన వంకర బుద్ధిని ప్రదర్శించేవాడు. 1983 నుంచి యథేచ్ఛగా సాగిపోతున్న ఆ వైద్యుడి అరాచకాలకు 2018లో తెరపడింది. ఓ మహిళ అతడిపై కేసు పెట్టడంతో నాలుగేళ్లుగా విచారణ జరిపిన లండన్‌ కోర్టు.. తాజాగా గురువారం కృష్ణసింగ్‌ను దోషిగా తేల్చింది. త్వరలో అతడికి శిక్షను ఖరారు చేయనుంది.

*అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరుమండల వింజనంపాడులో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నార్నె శ్రీనివాసరావు (56) రెండేళ్ల నుంచి ఆరు ఎకరాలలో మిర్చి సాగు చేశాడు. తెగుళ్లబారిన పంట దిగుబడి లేదు. సాగు కోసం సుమారు రూ.10 లక్షలు అప్పు చేశారు. తిరిగి చెల్లించే మార్గం కానరాక బుధవారం సాయంత్రం తన పొలం దగ్గరకు వెళ్ళి పురుగు మందు తాగాడు. ఆయనను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ, తెల్లవారుజామున మరణించారు.

*కోర్టు ధిక్కార కేసులో విశాఖపట్నం జిల్లా గాజువాక తహసీల్దార్‌ ఎంవీఎస్‌ లోకేశ్వరరావుకు హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. లోకేశ్వరరావు ఈ నెల 18న హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడిషియల్‌) ముందు హాజరు కావాలని, అనంతరం ఆయన్ని ‘సివిల్‌ ప్రిజన్‌’కు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు.

*నిజామాబాద్‌ జిల్లాలోని మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్‌ వద్ద ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో 24 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో దవాఖానకు తరలించారు.

* నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండలం బుస్సాపూర్ గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 24 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

* ప.గో జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో ఓ ఇంట్లో ఇండియన్ గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటరీ పెడుతుండగా ఒక్కసారికి పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లోని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* గుంటూరు జిల్లాలోని పొన్నూరులో దారుణం జరిగింది. కన్న తండ్రి కోటేశ్వరరావు(52)ను కొడుకు శశిధర్‌ కుమార్‌(21) సుత్తితో కొట్టి హత్య చేశాడు. మద్యం తాగి వచ్చి తండ్రి గొడవ చేస్తున్నాడంటూ కొడుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొన్నూరులోని 14వ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*గుంటూరు జిల్లాలోని పిట్టలవానిపాలెం మండలం కప్పలవారిపాలెం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో నలుగురు గాయపడ్డారు. వెంటనే వారిని బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ప.గో జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో ఓ ఇంట్లో ఇండియన్ గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటరీ పెడుతుండగా ఒక్కసారికి పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లోని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*నిజామాబాద్‌: జిల్లాలోని మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్‌ వద్ద ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.దీంతో 24 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో దవాఖానకు తరలించారు.గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. మిగిలినవారిని వేరే బస్సుల్లో వారి గమ్యస్థానాలకు తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

*పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తూ..ఓ కారు లారీని ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దపల్లి మండలం రాఘవపూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన కారు ఎదురుగా వస్తున్నా లారీని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ప్రణయ్ (10)అనే అబ్బాయి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి జరిగింది. ధ్వజస్తంభ ప్రతిష్టలో కప్పితాడు తెగిపడడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, క్షతగాత్రులను యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాళ్లరేవు మండలం నీలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

*గుంటూరు జిల్లాలోని క్రోసూరు మండలం ఊటుకూరులో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత అక్కపై తమ్ముడు కుటుంబం దాడి చేసింది. నడి రోడ్డు మీద బట్టలు చింపి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అటు దివ్యాంగురాలైన చిన్నారిపై కుడా తమ ప్రతాపం చూపించారు. దాడిపై బాధితురాలు వీరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు జరిగిన అవమానంతో బాధితులు తీవ్ర మనస్తాపానికి గురైంది. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని వీరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం వీరమ్మ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

*కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో విద్యుత్ షాక్‌ తగిలి రైతు మృతి చెందాడు. పొలంలో మోటార్ వేస్తుండగా షాక్ తగలడంతో రైతు తాడేపల్లి నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. పొచిగానీలంక గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అరెటి గెలలు నరరికేందుకు వెళ్లి మంచినీటి కోసం మోటార్ వద్దకు వెళ్లిన సమయంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. మరో రైతు కూలీ చిట్టిమోతు భీముదుకు తీవ్ర గాయాలు అవడటంతో మెరుగయిన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.

*గాజువాక ఎస్‎బీఐ ఏటీయంలో చోరి విఫలయత్నం అయింది. గుర్తు తెలియని దుండగులు ఏటీయం మిషన్‎ను ధ్వంసం చేశారు. గాజువాక బి. హెచ్. పి.వి జంక్షన్ వద్ద ఉన్న ఎస్‎బీఐ ఏటీఎమ్‎లో దండగులు అర్ధరాత్రికి చోరీకి ప్రయత్నించారు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుల కోసం గాలిస్తున్నారు.

*కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (కేటీపీపీ) కోసం తన భూమిని తీసుకున్న జెన్‌కో అధికారులు ఉద్యోగావకాశం కల్పించలేదని మనస్తాపం చెందాడో నిర్వాసితుడు. కేటీపీపీ వద్ద పురుగుల మందుతాగి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్సకు అయిన బిల్లు కట్టలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గణపురం మండలం చెల్పూరులో కేటీపీపీ మొదటి దశ నిర్మాణంలో భూపాలపల్లి పట్టణ పరిధి మహబూబ్‌పల్లికి చెందిన మర్రి బాబు(50) మూడెకరాల భూమిని కోల్పోయాడు. ప్రత్యామ్నాయంగా ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పిన జెన్‌కో యాజమాన్యం ఆ తర్వాత పట్టించుకోలేదు. తనకు కాకున్నా తన కుమారుడికైనా ఉద్యోగం ఇవ్వాలని అధికారులు చుట్టూ తిరిగిన బాబు విసిగిపోయాడు. ఈనెల 1న కేటీపీపీ ప్రధాన గేటు వద్ద పురుగుల మందు తాగాడు. దీంతో జెన్‌కో సిబ్బంది అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి బిల్లు రూ. 60 వేలు కాగా అ డబ్బు కడితేనే ఇంటికి పంపుతామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

*వేసవికాలంలో ఏసీ కంప్రెషర్ పేలిన దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది.ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్ లోని ఓ తినుబండారాల దుకాణంలో ఎయిర్ కండీషనర్ కంప్రెషర్ ఒక్కసారిగా పేలింది. రెండు అంతస్తుల భవనంలో కంప్రెషర్ పేలడంతో ఏసీ మెకానిక్ లు నదీమ్, తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఈ దుర్ఘటనలో షాన్‌, డానిష్, అజ్జు, బిజయ్, ఇక్రాలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో చేర్చారు.కంప్రెషర్ పేలడంతో మంటలు చెలరేగాయి. మూడు అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను ఆర్పామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు.

*ఎమ్మిగనూరు పట్టణంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. పట్టణంలోని మునెప్ప నగర్‌లో నివాసం ఉంటున్న మహేశ్వరరెడ్డి బుధవారం ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లికి వెళ్లాడు. దీన్ని అదునుగా తీసుకున్న దొంగలు చప్పుడు కాకుండా చాకచక్యంగా ఇంటి కాంపౌండులోకి దూకి గ్రిల్‌ తొలగించి ఇట్లోకి దూరి బీరువాలో దాచిన రూ. 15లక్షల నగదు, 10 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. మధ్యాహ్నం పక్కింటివారికి అనుమానం వచ్చి ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని ఇంట్లో చూడగా బీరు వా తెరిచి ఉండటం, బీరువాలో నగదు, నగలు దోపిడీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటిని పరిశీలించారు. యజమానితో వివరాలు తెలుసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవలే సోమప్ప సర్కిల్‌లో ఉన్న సిండికెట్‌ బ్యాంకు ముందు ఉన్న ఏటీఎమ్‌లో చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. ఇది మరువకముందే మునెప్పనగర్‌లో పట్టపగలు చోరీ జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

*పోలేకుర్రు పంచాయతీ పరిధి జక్కలవారిపేట వద్ద 216 రహదారిపై ఉన్న షాపులో దొంగతనం చేసేందుకు ఇద్దరు యువకులు ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అదేవిధంగా సుంకటరేవు బీసీపేట వద్ద మరో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ నలుగురు కాకినాడ అన్నంగాటీ ప్రాంతం రెల్లివారివీధికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసినట్టు ఏఎ్‌సఐ ప్రసాదరావు తెలిపారు.

*ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి (28) ఆత్మహత్య చేసుకున్నారు. బూర్గంపాడు మండలం సారపాకలో ని స్వగృహంలో గురువారం తెల్లవారుజామున ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన మహాలక్ష్మి.. ప్రస్తుతం పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో.. మానసిక ఒత్తిడికి లోనైన ఆమె.. తెల్లవారుజామున ఉరి వేసుకున్నారు. త్రండి తాటి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యురాలిగా పేదలకు సేవ చేయాలనుకున్న తన కూమార్తె.. అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల తాటి వెంకటేశ్వర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయనకు మహాలక్ష్మి ఒక్కగానొక్క కుమార్తెకాగా.. ఓ కుమారు డు ఉన్నారు. భార్య ఏడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. కాగా.. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే రేగ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బా లసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య తదితరులు ఆయన నివాసానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు.

*ఖమ్మం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ నాయకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. నిత్యం ఠాణాకు రావాలంటూ పోలీసులు తీవ్రంగా వేధిస్తుండటం వల్లే తన కుమారుడు పురుగు మందు తాగాడని ఆయన తల్లి సావిత్రమ్మ ఆరోపిస్తోంది. ఆమె కథనం ప్రకారం.. ఖమ్మం త్రీ టౌన్‌ ప్రాంతంలోని 46వ డివిజన్‌ గొల్లబజార్‌కు చెందిన యువకుడు సామినేని సాయిగణేష్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కొంత కాలంగా బీజేపీ కార్యకలాపాల్లో చురుగ్గా తిరుగుతూ ప్రస్తుతం మజ్దూర్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గతంలో ఖమ్మం చర్చి కాంపౌండ్‌లో ఓ మతానికి చెందిన గుర్తును నిర్మిస్తుండగా సాయి దానిని అడ్డుకున్నారు. పోలీసులు ఆయనతో పాటు పలువురిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

* మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని విద్యార్థిని చేత తాగించి నగ్నచిత్రాలను చరవాణిలో చిత్రీకరించాడో విద్యార్థి. వాటిని సామాజిక మాధ్యమాల్లో మరో యువకుడు పోస్టు చేశాడు. ఈ దారుణంపై ఫిర్యాదు అందడంతో వారిద్దరినీ అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల స్టేషన్‌ ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దదోర్నాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్‌ మీరావలి (19) డిప్లమో చదువుతున్నాడు. మరో గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకలకు ఇటీవల మార్కాపురం వచ్చింది. పరిచయం ఉండటంతో మీరావలి పలకరించాడు. శీతల పానీయం తాగుదామంటూ పిలిచాడు. అందులో మత్తు పదార్థం కలిపి ఇవ్వడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. విద్యార్థినిని వివస్త్రను చేసి చరవాణిలో చిత్రీకరించాడు. ఆ చిత్రాలను చూసిన మీరావలి స్నేహితుడు, మోకానిక్‌ డి.రసూల్‌(22) వాటిని సామాజిక మాధ్యమంలో పెట్టడంతో వైరల్‌గా మారాయి. విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు బుధవారం రాత్రి పెద్దదోర్నాల పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని విషయాన్ని తెలిపారు. ఎస్సై సీఐ మారుతీకృష్ణ వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. నాగూర్‌ మీరావలి, రసూల్‌ను అరెస్టు చేశారు.

* తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన మిస్సింగ్ విద్యార్థి నిఖిల్ మృతదేహం దుర్గం చెరువులో లభ్యమైంది. సూసైడ్ నోట్ రాసి నిఖిల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా రెండు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం దుర్గం చెరువులో నిఖిల్ మృతదేహం లభ్యమైంది.నా చావుకు ఎవరూ కారణం కాదని మానసిక ఒత్తిడి తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుసూసైడ్ నోట్లో నిఖిల్ వెల్లడించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*జగ్గయ్యపేట నియోజకవర్గం,తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసుల తనిఖీలు తెలంగాణ నుంచి ఆంధ్రా కు వస్తున్న ఆర్టీసీ బస్సులో సరైన పత్రాలు లేని కోటి 90 లక్షల రూపాయలు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.ఇద్దరు వ్యక్తులను విచారించగా తెలంగాణ లో పొలం అమ్ముకుని ఆ డబ్బుతో ఆంధ్రాలో పొలం కొని రిజిస్ట్రేషన్ నిమిత్తం డబ్బులు తీసుకు వెళ్తున్నట్టు తెలియజేశారని ఈ డబ్బును ఇన్కంటాక్స్ ఆఫీస్ కు అందజేస్తున్నామని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు

* ధిక్కరణ కింద… ఆ తహసీల్దార్కు ఆరు నెలల జైలు శిక్ష
విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ లోకేశ్వరరావుకు హైకోర్టు… కోర్టు ధిక్కరణ కింద 6 నెలల సాధారణ జైలుశిక్ష, 2 వేలు జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో ఏపీ రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ.. ప్రహరీని కూల్చేసిన ఘటనపై విశాఖ జిల్లా గాజువాక తహసీల్దారు ఎంవీఎస్‌ లోకేశ్వరరావుపై హైకోర్టు మండిపడింది. కోర్టుధిక్కరణ కింద ఆయనకు 6నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా సొమ్ము చెల్లించకపోతే తీర్పు ప్రతిని కలెక్టర్‌కు పంపి ఏపీ రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. పిటిషనర్ల భూమిలో జోక్యం చేసుకోవద్దని, వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించొద్దని 2014 మార్చి 21న ఇచ్చిన కోర్టు ఉత్తర్వులకు తహసీల్దారు కొత్త భాష్యం చెబుతూ 2021 జూన్‌ 13న ప్రహరీ కూలగొట్టారని న్యాయస్థానం నిర్ధారించింది. తహసీల్దారు వ్యవహార శైలి చట్టబద్ధ పాలనకు అవరోధమే కాకుండా.. న్యాయవ్యవస్థ, న్యాయపాలనకు తీవ్ర నష్టం చేస్తుందని వ్యాఖ్యానించింది. ఇలాంటివారిపై కనికరం చూపితే న్యాయవ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి బుధవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.నేపథ్యమిదే…. విశాఖ జిల్లా గాజువాక మండలం తుంగ్లాం గ్రామం సర్వే నంబరు 29/1లోని తమ 5.42 ఎకరాల భూమి నుంచి తమను ఖాళీ చేయించేందుకు అధికారులు యత్నిస్తున్నారంటూ విశాఖపట్నానికి చెందిన పి.అజయ్‌కుమార్‌, పి.సునీతదేవి 2014లో హైకోర్టును ఆశ్రయించారు. వారిని నిలువరించాలని కోరారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని 2014 మార్చి 21న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ, 2021 జూన్‌ 13న తహసీల్దారు సమక్షంలో అధికారులు పొక్లెయిన్లతో పిటిషనర్లు నిర్మించిన ప్రహరీలో కొంతభాగాన్ని కూల్చేశారు. దీంతో అజయ్‌కుమార్‌, సునీతదేవి 2021 జూన్‌ 17న అధికారులపై కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలుచేశారు. ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎన్‌.సుబ్బారావు వాదనలు వినిపించారు. గాజువాక తహసీల్దారు అఫిడవిట్‌ దాఖలు చేస్తూ.. అనధికారికంగా నిర్మించిన ప్రహరీని కూల్చామన్నారు. 5.42 ఎకరాలపై యాజమాన్య హక్కును పిటిషనర్లు కోరలేరన్నారు. ఆ భూమి మొదట విశాఖ స్టీలు ప్లాంటుకు, తర్వాత రైల్వేశాఖకు బదిలీ చేశారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్లు భూమిని ఆక్రమించారనే కారణం చూపుతూ ప్రహరీ కూల్చామని తహసీల్దారు ఒప్పుకొంటున్నారని గుర్తుచేశారు. ఆ భూమిని పిటిషనర్లు ఆక్రమించారని అధికారులు భావిస్తే.. ఏపీ భూఆక్రమణ(నిరోధక) చట్టంలోని నిబంధనలను అనుసరించి వారిని ఖాళీ చేయించాలన్నారు. అలాకాకుండా ఉద్దేశపూర్వకంగా గోడను కూల్చారన్నారు. ఈ చర్య కోర్టుధిక్కరణ కిందికి వస్తుందని స్పష్టం చేశారు. ఇతర ప్రతివాదులకు కోర్టుధిక్కరణ వర్తించదన్నారు.