Business

ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి – TNI వాణిజ్య వార్తలు

ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి – TNI వాణిజ్య వార్తలు

* ఐటీ, లైఫ్‌ సైన్సెస్, రెన్యువల్‌ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఆస్ట్రేలియా–ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో లిసాసింగ్‌ వెల్లడించారు. గురువారం ఇక్కడ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో లిసాసింగ్‌ సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా తెలంగాణ, ఆస్ట్రేలియా నడుమ వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు.భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, తెలంగాణతో వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము సిద్ధంగా ఉన్నామని లిసాసింగ్‌ పేర్కొన్నారు. భారత్‌– ఆస్ట్రేలియా మధ్య వ్యాపార, వాణిజ్య ఒప్పందాలపై చర్చ నడుస్తున్న సందర్భంగా ఇక్కడ పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలించేందుకు త్వరలోనే ఒక ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటిస్తుందని చెప్పారు. ప్రగతిశీల తెలంగాణలో ఉన్న పరిస్థితులను ఆస్ట్రేలియా పారిశ్రామిక వర్గాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ అన్నారు.

*వాట్సాప్‌ వినియోగదారులకు శుభవార్త. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేనున్నట్టు వాట్సాప్‌ సంస్థ ప్రకటించింది. ఇప్పటిదాకా గ్రూప్‌ వాయిస్‌ కాల్‌లో 8 మందే పాల్గొనే అవకాశం ఉండగా.. ఆ పరిమితిని 32కు పెంచుతున్నట్టు వెల్లడించింది. అలాగే.. ఫైల్‌ షేరింగ్‌ పరిమితిని 2 జీబీకి పెంచుతున్నట్టు పేర్కొంది. గ్రూపు సందేశాల్లో ఏవైనా అభ్యంతరకరంగా ఉన్నట్టు అనిపిస్తే వాటిని ఎప్పుడైనా తొలగించే అవకాశాన్ని అడ్మిన్లకు కల్పించనున్నట్టు వాట్సాప్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.

*ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) ఆర్థిక కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. తీసుకున్న అప్పులు చెల్లించక పోవడంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) తాజాగా ఎఫ్‌ఆర్‌ఎల్‌పై ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌ ఫైల్‌ చేసింది. అలాగే మఽధ్యంతర రిజొల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఐఆర్‌పీ)గా వికేవీ అయ్యర్‌ను నియమించుకోవాలని ఫ్యూచర్‌కు ఎన్‌సీఎల్‌టీ సూచించింది. అమెజాన్‌తో వివాదం కారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.5,322.32 కోట్ల రుణ బకాయిలు చెల్లించలేక పోయినట్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.

*తమ వాహనాలన్నింటి ధరలు 2.5 శాతం మేరకు పెంచుతున్నామని, కొత్త ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. ఈ నిర్ణయంతో మహీంద్రా శ్రేణిలోని వాహనాల ఎక్స్‌ షోరూమ్‌ ధరలు రూ. 10 వేల నుంచి రూ.63 వేల మధ్యన పెరుగుతాయి. కీలక ముడిపదార్థాల ధరలన్నీ పెరిగిన దృష్ట్యా ధరలు పెంచక తప్పలేదని కంపెనీ వెల్లడించింది.

*జపాన్‌ కార్ల తయారీ దిగ్గజం హోండా కార్స్‌ మార్కెట్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ విభాగంలోకి అడుగు పెడుతోంది. అలాగే విద్యుత్‌ వాహనాల (ఈవీ) రంగంలో దూసుకుపోయే ప్రణాళికలు ఆవిష్కరించింది. వచ్చే నెలలో సిటీ ఈ:హెచ్‌ఈవీ విద్యుత్‌ కారును, వచ్చే ఏడాది ఎస్‌యూవీని విడుదల చేయానుకుంటున్నట్టు ప్రకటించింది. వచ్చే పదేళ్ల కాలంలో ఈవీ విభాగంలో 4,000 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు హోండా కార్స్‌ ఇండి యా ప్రెసిడెంట్‌ తకుయా సుమురా చెప్పారు. గురువారం నాడిక్కడ హోండా సిటీ ఈ:హెచ్‌ఈవీ సెడాన్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకువచ్చే ఈ కారుతో తాము హైబ్రిడ్‌ విద్యుత్‌ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్టు చెప్పారు. అలాగే 2030 నాటికి 30 విద్యుత్‌ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సుమురా తెలిపారు. సిటీ ఈ:హెచ్‌ఈవీకి రెండు సెల్ఫ్‌ చార్జింగ్‌ మోటార్లు, 1.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజన్‌ ఉంటాయి. లీటరుకి 26.5 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారు గరిష్ఠంగా 126 పీఎస్‌ విద్యుత్‌ను అందిస్తుంది.

*బీఎండబ్ల్యూ మార్కెట్లోకి సరికొత్త ఎఫ్‌ 900 ఎక్స్‌ఆర్‌ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.12.3 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). జూన్‌ నుంచి బైక్‌ డెలివరీలు ప్రారంభమవుతాయి. 895సీసీ ఇంజన్‌ అమర్చిన ఈ బైక్‌ కేవలం 3.6 సెకన్ల కాలంలో 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.

*ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ప్రతిపాదన మళ్లీ జోరందుకుంది. ఇందుకోసం కంపెనీ విలువను తాజా గా రూ.7 లక్షల కోట్లుగా లెక్కకట్టారు. ఈ తాజా విలువతో సెబీకి మరోసారి దరఖాస్తు చేసి వీలైనంత త్వరగా ఈ బాహుబలి ఐపీఓ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల్లోనే ఎల్‌ఐఐ ఐపీఓ మార్కెట్‌కు వస్తుందని అధికార వర్గాలు చెప్పాయి. ఎల్‌ఐసీ ఐపీఓపై యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచీ ఆసక్తి వ్యక్తమవుతోది. పబ్లిక్‌ ఇష్యూ కంటే ముందే ఈ మెగా ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఆసక్తి చూపిస్తున్నారు. 12 మంది యాంకర్‌ ఇన్వెస్టర్లయితే ఐపీఓకు ముందే ఎల్‌ఐసీ ఈక్విటీలో రూ.18,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధమయ్యారు. దీంతోపాటు 50-60 మంది యాంకర్‌ ఇన్వెస్టర్లను కంపెనీ షార్ట్‌లిస్ట్‌ చేసినట్టు సమాచారం.

*భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), మైక్రోసాఫ్ట్ జతకట్టాయి. డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడం, చమురు/గ్యాస్ పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో వ్యూహాత్మక క్లౌడ్ భాగస్వామ్యంలో ప్రవేశించాయి. ఉమ్మడి ప్రకటన ప్రకారం… చమురు/గ్యాస్ రంగానికి సంబంధించిన ప్రత్యేక సవాళ్లను పరిష్కరించే క్రమంలో… మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అందించే అవకాశాలను అన్‌లాక్ చేయడానికి ఈ సహకారం ప్రయత్నిస్తుంది. బీపీసీఎల్ తన టెక్ ఆర్కిటెక్చర్ సంబంధిత ఆధునీకరణను వేగవంతం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది… కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంతోపాటు పునర్నిర్వచిస్తుందని భావిస్తున్నారు. ఏడేళ్ల సహకారం ద్వారా… మైక్రోసాఫ్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సర్వీస్‌(ఐఏఏఎస్)గా, ప్లాట్‌ఫారమ్‌గా సర్వీస్(పీఏఏఎస్), నెట్‌వర్క్ మరియు క్లౌడ్‌‌లలో సెక్యూరిటీ సేవలననందిస్తుంది.

*దేశీయ వాహన దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా కార్లు గురువారం నుంచి మరింత ప్రియమయ్యాయి. అన్ని రేంజ్ మోడల్ కార్ల రేట్లను 2.5 శాతం మేర పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. రేట్ల పెంపు తక్షణమే ఆచరణలోకి వచ్చిందని తెలిపింది. ధరల పెంపు ఫలితంగా కార్ల మోడల్‌ను బట్టి ఎక్స్‌షోరూం రేట్లు రూ.10 వేల నుంచి రూ.63 వేల వరకు పెరగనున్నాయని కంపెనీ పేర్కొంది. కార్ల తయారీలో కీలకమైన స్టీల్, అల్యూమినియం, పల్లాడియంతోపాటు ఇతర ముడిపదార్థాల ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ధరల సవరణ చేశామని కంపెనీ వివరించింది. అనూహ్యంగా పెరుగుతున్న ముడిపదార్ధాల ధరల భారాన్ని కస్టమర్లపైకి పాక్షికంగా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.

*దేశీయ వాహన దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా కార్లు గురువారం నుంచి మరింత ప్రియమయ్యాయి. అన్ని రేంజ్ మోడల్ కార్ల రేట్లను 2.5 శాతం మేర పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. రేట్ల పెంపు తక్షణమే ఆచరణలోకి వచ్చిందని తెలిపింది. ధరల పెంపు ఫలితంగా కార్ల మోడల్‌ను బట్టి ఎక్స్‌షోరూం రేట్లు రూ.10 వేల నుంచి రూ.63 వేల వరకు పెరగనున్నాయని కంపెనీ పేర్కొంది. కార్ల తయారీలో కీలకమైన స్టీల్, అల్యూమినియం, పల్లాడియంతోపాటు ఇతర ముడిపదార్థాల ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ధరల సవరణ చేశామని కంపెనీ వివరించింది. అనూహ్యంగా పెరుగుతున్న ముడిపదార్ధాల ధరల భారాన్ని కస్టమర్లపైకి పాక్షికంగా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.

*విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో చైనా మొబైల్‌ తయారీ కంపెనీ షామీ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనుకుమార్‌ జైన్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), బెంగళూరు జోన్‌ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గడిచిన కొన్నేళ్లలో కంపెనీతోపాటు దాని ఉన్నతాధికారులకు సంబంధించిన కోట్ల రూపాయల విదేశీ మారక రెమిటెన్స్‌ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరుకావాల్సిందిగా జైన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఎందుకంటే, గ్లోబల్‌ వీపీగా పదోన్నతి లభించకముందు షామీ ఇండియా విభాగ అధిపతిగా జైన్‌ బాధ్యతలు నిర్వహించారు. భారత్‌లో షామీ కార్యకలాపాలపై జైన్‌ను ప్రశ్నించడంతోపాటు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసిన అధికార వర్గాలు తెలిపాయి

*ఎయిరిండియా గురువారం జారీ చేసిన అధికారిక ప్రకటనలో… అలయన్స్ ఎయిర్ ఇకపై ఎయిర్‌లైన్‌కు అనుబంధ సంస్థ కాదని ధృవీకరించింది. ఎయిరిండియాను టాటా సన్స్ అధికారికంగా తీసుకున్న కొన్ని నెలల తర్వాత ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అక్టోబరు 8 2021న… టాటా సన్స్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్… అప్పుల భారంతో ఉన్న ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను గెలుచుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ నేతృత్వంలోని కన్సార్టియంను టాటా రూ. 18 వేల కోట్లను ఆఫర్ చేయడం ద్వారా అధిగమించింది.

*మార్చి నెలలో ఎగుమతుల రంగం 4000 కోట్ల డాలర్ల మైలురాయిని దాటింది. ఒక నెలలో ఎగుమతులు ఈ మైలురాయి దాటడం ఇదే ప్రథమం. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌, లెదర్‌ విభాగాలు ప్రదర్శించిన పనితీరుతో మార్చిలో ఎగుమతులు 20 శాతం వృద్ధితో 4222 కోట్ల డాల ర్లుగా (రూ.3.21 లక్షల కోట్లు) నమోదయ్యాయి. దిగు మతులు కూడా 24.21 శాతం పెరిగి 6074 కోట్ల డాల ర్లకు (రూ.4.62 లక్షల కోట్లు) చేరాయి.

*దేశీయ ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ మార్చితో ముగిసిన 2022 నాలుగో త్రైమాసిక ఫలితాలను బుధవారం వెల్లడించింది. వార్షికపరంగా 12 శాతం వృద్ధి రేటుతో రూ.5,686 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.5,076 కోట్ల లాభాన్ని పొందినట్టు ప్రస్తావించింది. అయితే త్రైమాసికంపరంగా 2022క్యు3తో పోల్చితే లాభం స్వల్పంగా 2.1 శాతం మేర క్షీణించింది. 2022క్యు4 ఆదాయం దాదాపు 23 శాతం మేర పెరిగి రూ.32,276 కోట్లుగా మోదయ్యిందని తెలిపింది. మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.16 తుది డివిడెండ్‌ అందించేందుకు కంపెనీ బోర్డ్ సిఫార్సు చేసిందని పేర్కొంది. ఇదివరకే ప్రకటించిన మధ్యంతర డివిడెండ్‌తో కలిపి ఈ ఏడాదిలో మొత్తం రూ.31 డివిడెండ్ ప్రకటించినట్టయిందని తెలిపింది. కంపెనీ ప్రదర్శనపై ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ దశాబ్దంలోనే అత్యధిక వార్షిక వృద్ధి నమోదయ్యిందని చెప్పారు. డిజిటల్, ఇన్ఫోసిస్ కోబాల్ట్ నేతృత్వంలోని వన్ ఇన్ఫోసిస్ విధానంతో ఈ వృద్ధి సాధ్యమయిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు నాలుగో త్రైమాసికంలో కొత్తగా 22 వేల మందిని నియమించామని కంపెనీ తెలిపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 50 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్టుగా కంపెనీ ప్రకటించింది.