Politics

జగన్ అరాచకాలతో కోర్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది – TNI రాజకీయ వార్తలు

జగన్ అరాచకాలతో కోర్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది   – TNI రాజకీయ వార్తలు

* సీఎం జగన్ అరాచకాలతో కోర్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కోర్టులో చోరీకి పాల్పడి.. ఆధారాలను సైతం వైకాపన్లు కొట్టేస్తున్నారని మండిపడ్డారు. 3 నెలల క్రితమే మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నకిలీ పత్రాల కేసును.. ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించి భంగపడిందన్నారు. జూన్‌లో వాదనలు ప్రారంభమైతే జైలుకెళ్లడం ఖాయమనే భయంతోనే కీలక ఆధారాలను మాయం చేశారని దుయ్యబట్టారు. నెల్లూరులోని 4వ ఏడీఎం కోర్టులో జరిగిన చోరీపై సమగ్ర విచారణ జరగాలన్నారు. బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

*సీఎం కేసిఆర్ వల్లే మన పల్లెలకు జాతీయ గుర్తింపు: మంత్రి ఎర్రబెల్లి
పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, అత్యధిక0గా ప్రజలు పల్లెల్లో నివసిస్తుండటమే ఇందుకు కారణమని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించారన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, అందువల్లే మన పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు గా మారాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వశక్తి కరణ్ పురస్కారానికి ఇటీవల ఎంపిక అయిన మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచ్ లింగన్న గౌడ్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్య ప్రకటించిన జాతీయ ఉత్తమ జిల్లా, మండల, గ్రామ స్థాయిలో 19 అవార్డులు దక్కాయని చెప్పారు. అవన్నీ మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా మారాయి అనడానికి నిదర్శనం అన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు మంత్రిగా తాను, అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని అన్నారు. ప్రజల భాగస్వామ్యం తోనే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. అందుకే గ్రామాలు అభివృద్ధి పదంలో నడుస్తూ జాతీయ స్థాయి పురస్కారాలను ఎంపిక అవుతున్నాయని చెప్పారు. పంచాయతీ అవార్డు 2022 సంవత్సరానికి తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి కి వరించిందని అన్నారు. కరోనా పరిస్థితి లో సర్పంచ్ సేవను గుర్తు చేశారు. కరోనా తో మరణించిన వ్యక్తి ని స్వయం గా ట్రాక్టర్ పై తీసుకెళ్లి అంతక్రియలు చేశారు అని గుర్తు చేశారు. ఈ ప్రగతిని కొనసాగిస్తూ మరిన్ని అవార్డులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. లింగన్న గౌడ్ ను అభినందించి, తన సహకారం ఎల్లపుడూ ఉంటుందని వెన్ను తట్టారు. కాగా తనను సత్కరించి, గ్రామ అభివృద్ధిలో తన సహకారం అందిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి లింగన్న గౌడ్ ధన్యవాదాలు తెలిపారు

*పథకంపై ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మఒడి ఇవ్వాలి: లోకేష్‌
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టుందని విమర్శించారు. జగన్ మోసపు రెడ్డి అమ్మఒడి పథకం తీరు అని, తేదీల మతలాబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్దఒడిగా అమ్మఒడి పథకం మారిందని లోకేష్‌ అన్నారు. ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి పథకం మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేశారని మండిపడ్డారు. పథకంపై ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మఒడి ఇవ్వాలని లోకేష్‌ డిమాండ్ చేశారు

*బండి సంజయ్‌ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదు: పొంగులేటి
కూసుమంచి మండలం మానేపల్లిలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటిస్తున్నారు. బండి సంజయ్‌ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదని పొంగులేటి తెలిపారు. బీజేపీని ప్రజలు గమనిస్తున్నారని, బండి సంజయ్‌వి అహంకారపూరితమైన వ్యాఖ్యలు అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ప్రతి ఏటా ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

*దళితబంధు అని మరో మోసం.. రూ. 51 లక్షలు కేసీఆర్ బాకీ: షర్మిల
ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో షర్మిల రైతుగోస దీక్ష చేస్తున్నారు. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల ఆరోపించారు. ఎన్నిసార్లు దళితులను మోసం చేస్తావు కేసీఆర్ అని షర్మిల ప్రశ్నించారు. దళితబంధు అని మరో మోసమని, భూమి కాదని 10 లక్షలు ఇస్తామని మరో మోసమని షర్మిల విమర్శించారు. భూమి ఇస్తే కనీసం 30 లక్షలు వచ్చేవని, 20 లక్షలు పంట విలువ.. మొత్తం 51 లక్షలు కేసీఆర్ బాకీ పడ్డారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ఉన్నోడు కోట్లు సంపాదించేలా కేసీఆర్‌ పాలన: Bandi sanjay
రాష్ట్రంలో పేదోడు పేదవాడిగానే ఉండేలా.. ఉన్నోడు కోట్లు సంపాదించేలా సీఎం కేసీఆర్‌ పాలన ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం అలంపూరు మండలం లింగనవాయి గ్రామంలోని గ్రామస్థులతో బండి సంజయ్ మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ అబద్ధాలాడి గద్దెనెక్కారన్నారు. తెలంగాణలో కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ పేదల నడ్డివిరిచే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరుల త్యాగాల వల్ల తెలంగాణ సాధించుకుంటే కేసీఆర్‌ కుటుంబం అడ్డగోలుగా దోచుకుతింటోందని ఆరోపించారు. తెలంగాణలో పేదోళ్ల ప్రభుత్వం రావాలని బండి సంజయ్‌ ఆకాంక్షించారు.

*లంగాణలో ప్రతి పథకంలోనూ కేంద్రం నిధులే: kishan reddy
తెలంగాణ ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర భాగంగా అలంపూరు మండలం లింగనవాయి గ్రామంలో గ్రామస్థులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మాటమంతి కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తే నిజాం దొర కేసీఆర్ తెలంగాణలో అడ్డుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో కుటుంబ, అహంకార పాలన పోవాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

*జగన్‌ రాష్ట్రాన్ని ఖాళీ చేసి ప్యాలస్‌లు నిర్మించుకుంటున్నారు: యనమల
రాష్ట్రాన్ని ఖాళీ చేసి జగన్‌ ప్యాలస్‌లు నిర్మించుకుంటున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటున్నారని, కానీ వారి వద్ద, వారి నాయకులవద్ద డబ్బు ఉందన్నారు. జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు. జీతాలు ఇవ్వలేని వారు పేదలను ఎలా ఆదుకుంటారని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, ఈ పాలకులకు అడ్డుకట్ట వేయగలిగేది పేదోడి ఓటు మాత్రమేనన్నారు. ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలని యనమల విజ్ఞప్తి చేశారు.

*తెలంగాణ న్యాయశాఖ దేశానికి ఆదర్శం కావాలి: సీఎం కేసీఆర్‌
ఎనిమిదేండ్ల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. విద్యుత్‌ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామన్నారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అని చెప్పారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో జరుగుతున్న న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, సీఎం కేసీఆర్‌, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం ఇంకా ముందుకెళ్లాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.హైదరాబాద్‌ పట్ల జస్టిస్‌ ఎన్వీ రమణకు చాలా ప్రేమ ఉన్నదని చెప్పారు. సుదీర్ఘకాలం హైదరాబాద్‌లో పనిచేసినందున ఆయనకు అన్ని విషయాలు తెలుసున్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. అయితే సీజేఐ రమణ చొరవతో హైకోర్టు బెంచీలను 24 నుంచి 42కు పెంచారన్నారు.న్యాయ వ్యవస్థలో గతంలో 780 పోస్టులు మంజూరు చేశామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. మరో 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులకు అదనంగా 1730 పోస్టులు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులలో పనిభారం ఉందని తెలిసిందన్నారు. జిల్లా కోర్టుల్లో జడ్జిలు, మెజిస్ట్రేట్‌ సిబ్బందిని నియమిస్తే పనిభారం తగ్గుతుందని చెప్పారు. 23 జిల్లాల్లో జిల్లా కోర్టు భవనాలు చేపడతామని, వాటికోసం స్థల సేకరణ జరుగుతున్నదని వెల్లడించారు.రాష్ట్రంలో ఇప్పటివరకు కోటి 52 లక్షల ఎకరాల భూములను డిజిటలైజ్‌ చేశామన్నారు. రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. న్యాయమూర్తులు హోదాకు తగ్గట్లుగా 42 మంది జడ్జిలకు 30 ఎకరాల్లో క్వార్టర్స్‌ నిర్మిస్తామని, సీజేఐ రమణతో శంకుస్థాపన చేయిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడంలో పోటీ నెలకొందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పారిశ్రామికవేత్తలు న్యాయవ్యవస్థ గురించే అడుగుతారని చెప్పారు. సమస్యలు వెంటనే పరిష్కరిస్తే మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు

*బీజేపీ నేతలు వీలైతే సహకరించండి…అంతే గానీ: Gutta
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిలా రైతులు నష్టపోవద్దనే ఈరోజు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభింపజేశారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ నాయకులు వీలైతే రాష్ట్రానికి సహాకరించాలే తప్ప విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్రం మొండి వైఖరి వల్ల రైతులకు నష్టం జరగకుండా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రైతులకు ఇబ్బందులు జరగకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు

*కిరణ్ మజుందార్ షా మాటలు తప్పు అని రుజువైంది : కేంద్ర మంత్రి
కర్ణాటకలో మతపరమైన విభజన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా చెప్పిన మాటలు తప్పు అని రుజువైందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఏప్రిల్ 14 గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాష్ట్రంలో మతపరమైన సమస్యలేవీ లేవని, కిరణ్ మజుందార్ షా వ్యక్తం చేస్తున్న ఆందోళన తప్పు అని తేటతెల్లమైందని చెప్పారు. కర్ణాటకలో ఇటీవల హిజాబ్ వివాదం, దేవాలయాల పరిసరాల్లో ముస్లిం వ్యాపారులపై నిషేధం వంటి వివాదాల నేపథ్యంలో కిరణ్ మజుందార్ షా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్‌కి ఓ విజ్ఞప్తి చేశారు. అందరికీ అవకాశం ఉండే సమ్మిళిత వాతావరణాన్ని హామీ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సమాజంలోని అన్ని వర్గాలు సంయమనం పాటించాలని కోరారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేని సమస్యలేవీ లేవని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. కాంగ్రెస్ వంటి పార్టీలు రాజకీయంగా బలహీనపడిన విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడం కోసం ఇటువంటి కథనాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కిరణ్ మజుందార్ షా చాలా అంశాలపై ట్వీట్లు చేశారని, కానీ అవన్నీ తప్పు అని రుజువైందని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిపై దర్యాప్తు జరిపించి, చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ చెప్పారన్నారు. బెంగళూరు కాస్మొపాలిటన్ సిటీ అన్నారు.
కర్ణాటకలో మతపరమైన సమస్య లేదన్నారు. ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నించే శక్తులు కొన్ని ఉన్నాయని చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ వంటి పార్టీలు ఇటువంటివాటిని సృష్టిస్తాయని, ఇలాంటి సమస్యలను సాగదీస్తాయని తెలిపారు

*నిర్విరామ విద్యుత్ ఇవ్వాల్సిందే: రేవంత్
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ అంతరాయం ఏర్పడటంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ‘‘పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయి. కేసీఆర్ తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను గుల్లచేసి పారేశాడు. కొనుగోళ్లలో ఆయనకు కమీషన్లు… విద్యుత్ వ్యవస్థలకు అప్పులు మిగిలాయి. ఏది ఏమైనా పంటలకు చివరి తడి పూర్తయ్యే వరకు నిర్విరామ విద్యుత్ ఇవ్వాల్సిందే’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు

*సీఎం జగన్‌పై హరిరామజోగయ్య విసుర్లు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ హోంమంత్రికాపుసంక్షేమ సేన వ్యవస్ధాపక అధ్యక్షుడు చెగోండి హరిరామజోగయ్య విమర్శలు గుప్పించారు. రాత్రిపగలు అనకుండా పల్లెలు, పట్టణాలు అని లేకుండా గంటల తరబడి విద్యుత్ కోతలు అనధికారికంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దౌర్భాగ్య స్ధితిని ప్రజలు చూడలేదని తెలిపారు. నిరవధిక విద్యుత్ సరఫరా చేయలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అనుభవ రాహిత్యమే అని ఆయన వ్యాఖ్యానించారు. నవరత్నాలు అనేక మందికి అందిస్తున్నామని సీబీఐ దత్తపుత్రుడు జగన్ చెపుతున్నారని యెద్దేవా చేశారు. ఈ పథకాల ద్వారా 10 శాతం మంది ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదన్నారు. తమ జేబులు నింపుకోవడమే ధ్యేయంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేసే ప్రాజెక్టులు ప్రైవేటు వ్యక్తులకు తక్కవ ధరకు అమ్మడంపోరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ ధరకు విద్యుత్ కొనడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. గోరుచుట్టుపై రోకలి పోటులా విద్యుత్ కోతలకు తోడుగా విద్యుత్ చార్జీల పెంపు ఈ ప్రభుత్వం చేసిందని ఆగ్రహించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దించి జనసేన గ్యారేజ్ దెబ్బ రుచి చూపించాలని హరిరామజోగయ్య వ్యాఖ్యలు చేశారు.

*మంత్రి కేటీఆర్‌కు తొందర ఎక్కువైంది: Raghunandan rao
మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24గంటలు ఉచిత కరెంటు ముచ్చటే లేదన్నారు. మంత్రి కేటీఆర్‌కు తొందర ఎక్కువైందని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయన్న ఆందోళన కేటీఆర్‌లో కన్పిస్తోందన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసమే బండి పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. సీఎం‌ కేసీఆర్ సంతకం వలనే కృష్ణా జిల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 290 టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టిన విషయం కేటీఆర్‌కు తెలియకపోవటం హాస్యాస్పదమన్నారు. వాస్తవాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే రిటైర్‌ అయి‌న అధికారులను కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.

*జగన్‌ బలహీన నేత: గంటా
మంత్రివర్గ విస్తరణ తరువాత సీఎం జగన్ బలహీనమైన నాయకుడని తేలిపోయిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవాచేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు బలమైన నాయకుడిగా జగన్‌కు రాష్ట్రంలో ఎదురులేదని చెప్పుకొచ్చారని, అయితే తాజా పరిణామాలతో అదంతా ఒట్టిదేనని స్పష్టమైందన్నారు. రెండున్నరేళ్ల తరువాత క్యాబినెట్‌ మొత్తం మార్చుతానని చెప్పిన జగన్‌, ఇప్పుడు 11 మంది పాత మంత్రుల్ని కొనసాగించి 14 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారని విమర్శించారు. అటువంటప్పుడు మొత్తం మంత్రులతో రాజీనామాలు ఎందుకు చేయించారని ప్రశ్నించారు. ఇంత హడావిడి చేసి ఎనిమిది జిల్లాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం బాధాకరమని గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు.

*అదానీ, అంబానీల శిష్యుడు జగన్‌
‘‘పారిశ్రామికవేత్తలు అదానీకి, అంబానీకి లాభాలు చేకూర్చే పద్ధతిలో కేంద్రం అడుగులు వేస్తుంటే, సీఎం జగన్‌ మరో అడుగు ముందుకేసి ధరలు పెంచుతున్నారు. సీఎం కూడా అదానీ, అంబానీల శిష్యుడే. గంగవరం పోర్టుకు అనుమతులిచ్చేస్తున్నారు. విశాఖస్టీల్‌, పోర్టులు అమ్మేస్తున్నారు. చివరికి మారుమూల ఉన్న కారెకల్‌ పోర్టును అదానీ పరం చేశారు’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఆర్టీసీ బస్సు చార్జీలను దాదాపు 150శాతం పెంచేయడం దారుణమంటూ గురువారం తిరుపతి సెంట్రల్‌ బస్‌స్టేషన్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. అంతర్జాతీయస్థాయిలో క్రూడాయిల్‌ ధరలు తక్కువగా ఉన్నాయని, అయితే మన దగ్గర మాత్రం ఎందుకు పెంచుతున్నారంటే అదానీకి, అంబానీకి ఆదాయం చేకూర్చడానికేనని నారాయణ దుయ్యబట్టారు.

*ఎవరి కోసం బండి సంజయ్‌ పాదయాత్ర: భట్టి
ఎవరి కోసం బీజేపీ నేత బండి సంజయ్‌ పాదయాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని పాదయాత్ర చేస్తున్నారా అని నిలదీశారు. పేదల అకౌంట్స్‌లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి వేయనందుకా పాదయాత్ర అంటూ మండిపడ్డారు. పెట్రో, డీజిల్‌ ధరలు పెంచమని పాదయాత్ర చేస్తున్నారా సంజయ్‌ చెప్పాలని భట్టి విక్రమార్క అన్నారు.

*రాష్ట్రానికి రావాల్సిన నిధులు రఘునందన్‌ తేవాలి: హరీశ్‌రావు
రాష్ట్రానికి రావాల్సిన నిధులు రఘునందన్‌ తేవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఢిల్లీ నుంచి నిధులు తెస్తే మీ యోజకవర్గానికి..అడిగినన్ని నిధులు తానిస్తానన్నారు. తెలంగాణకు రావాల్సిన రూ.1200 కోట్లు కేంద్రం ఎగ్గొట్టిందని ఆయన ఆరోపించారు. దుబ్బాకలో త్వరలో డయాలసిస్‌ సెంటర్‌ ప్రారంభిస్తామన్నారు.

*నిమ్జ్‌కు అనుమతి ఇవ్వొద్దు: కోదండరాం
జహీరాబాద్‌ దగ్గర జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తోందని, ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు టీజేఎస్‌ అధినేత కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గురువారం ఆయన కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిమ్జ్‌ ఏర్పాటుకు 22 గ్రామాల పరిధిలో 12,630 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. దీనివల్ల దాదాపు 6,500 మందికిపైగా రైతులు వీధిన పడతారని చెప్పారు.

*మూడేళ్లలో 5 లక్షల కోట్లు దోపిడి!: రామ్మోహన్‌
సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్లు దోపిడీకి పాల్పడ్డారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. అనంతరం విద్యుత్‌ కోతలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా కలివరం గ్రామంలో ర్యాలీ చేశారు.

*తుగ్లక్‌ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి: కళా
‘‘రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ తుగ్లక్‌ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది’’ అని మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. వైసీపీ తీరుతో రాష్ట్రంలో మహిళలు, యువతకు రాబోయే రోజుల్లో తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ప్రజల నుంచి అన్ని రకాలుగా దోచుకుంటున్న ప్రభుత్వం వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రెండు కోట్ల 50 లక్షల మంది జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదన్నారు.

*మంత్రి పదవులు సూట్‌కేసులు ముట్టజెప్పినవారికే..: కొల్లు రవీంద్ర
తన బినామి కంపెనీలకు సూట్‌కేసులు ముట్టజెప్పినవారికే జగన్‌రెడ్డి మంత్రి పదవులు కట్టబెట్టారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన ప్రదర్శన చేశారు. నూతన మంత్రివర్గం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు గణనీయంగా పెంచేశాయన్నారు. ఏలూరులో విద్యుత్‌ సరఫరా లేక ఒక పరిశ్రమ దగ్ధమైందన్నారు. దేశానికే తలమానికమైన మచిలీపట్నం రోల్డుగోల్డు పరిశ్రమకు పవర్‌ హాలిడే ప్రకటించడం వల్ల కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని కొల్లు అన్నారు.

*జగన్‌ రాష్ట్రాన్ని ఖాళీ చేసి ప్యాలస్‌లు నిర్మించుకుంటున్నారు: యనమల
రాష్ట్రాన్ని ఖాళీ చేసి జగన్‌ ప్యాలస్‌లు నిర్మించుకుంటున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటున్నారని, కానీ వారి వద్ద, వారి నాయకులవద్ద డబ్బు ఉందన్నారు. జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు. జీతాలు ఇవ్వలేని వారు పేదలను ఎలా ఆదుకుంటారని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారనిఈ పాలకులకు అడ్డుకట్ట వేయగలిగేది పేదోడి ఓటు మాత్రమేనన్నారు. ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలని యనమల విజ్ఞప్తి చేశారు.

*అబద్ధాలు చెప్పడమే జగన్‌రెడ్డి నైజం: లోకేశ్‌
అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేసి ప్రజలను ఏమార్చడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఘనుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అనేక అబద్ధాలు చెప్పి జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. నిజం చెప్పడం ఆయన నైజం కాదంటూ వివరించారు. మోసపూరిత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే వుందని లోకేశ్‌ అన్నారు.

* అంబేడ్కర్‌ బతికి ఉంటే జగన్‌ను అభినందించేవారు: మంత్రి రోజా
రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ బతికి ఉంటే సీఎం జగన్‌ను అభినందించేవారని పర్యాటక శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా పేర్కొన్నారు. అంబేడ్కర్‌కు నిజమైన వారసుడిలా ఆయన ఆలోచనలు, ఆశయాలను జగన్‌ ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. గురువారం సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, ఉషశ్రీ చరణ్‌.. రాజ్యాంగనిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల్పరించారు.