NRI-NRT

సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో రాజ్ నాథ్ సింగ్ భేటి

సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో రాజ్ నాథ్ సింగ్ భేటి

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో గురువారం భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్కడి ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు. సుదీర్ఘకాలంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు వారు, ఇతర భారతీయులు, భారతీయ మూలాలున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ఇతర ప్రముఖులతో రాజ్ నాథ్సంగ్ సంభాషించారు . ఈ సందర్భంగా ఆయన … భారత్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. ఎన్నారైల విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమెరికా వీసా విషయంలో ఇటీవల తలెత్తిన పరిణామాలపై చర్చించారు. ఎన్నారైల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, అమెరికాలో ఉన్న భారతీయుల క్షేమం కోసం కరోనా సమయంలో ఉచితంగా టీకాలు పంపిణీ చేసిన విషయాన్ని రాజ్నాథ్ ప్రస్తావించారు
Whats-App-Image-2022-04-16-at-5-23-21-AM-1
రక్షణమంత్రి రాజ్నాథ్సంగ్ పాల్గొన్న ఈ కార్యక్రమం భారత దౌత్యకార్యాలయం కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ నేతృత్వంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రలో నిర్వహించగా , భారత దౌత్యకార్యాలయం నుంచి డాక్టర్ అకున్ సబర్వాల్ , రాజేశ్ నాయక్ సమన్వయ పరిచారు. సిలికాన్ ఆంధ్ర చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల, దిలీప్ కొండపర్తి, రాజు చామర్తి, దీనబాబు కొండుభట్ల, ఆరిజోనా నుంచి ఇండియన్ కమ్యూనిటీ ప్రముఖులు వెంకట్ కొమ్మినేనితో పాటు పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. రాజ్ నాథ్ సింగ్ పాటు రక్షణ మంత్రిత్వశాఖకు సంబంధించిన సీనియర్ అధికారులు ఎయిర్ మార్షల్ శివకృష్ణ, డిఫెన్స్ ప్రొడక్షన్ ఆడిషినల్ సెక్రటరీ సంజయ్ జాజు, పంకజ్ అగర్వాల్ , అనూప్ సింఘాల్, హర్షవర్ధన్, రక్షణమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఆలోక్ తివారీ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
Whats-App-Image-2022-04-16-at-5-23-21-AM-2
Whats-App-Image-2022-04-16-at-5-23-21-AM
Whats-App-Image-2022-04-16-at-5-24-08-AM-1
Whats-App-Image-2022-04-16-at-5-24-08-AM
Whats-App-Image-2022-04-16-at-8-17-15-AM