DailyDose

దేశానికి ఆదర్శం తెలంగాణ న్యాయ వ్యవస్థ

దేశానికి ఆదర్శం తెలంగాణ న్యాయ వ్యవస్థ

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022లో ముఖ్య అతిథులుగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. తెలంగాణలో బెంచ్‌ల పెంపుపై ఆనందం వ్యక్తం చేసిన కేసీఆర్‌.. అందుకు అనుగుణంగా సిబ్బంది కూడా కావాలన్నారు.రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని… న్యాయరంగంలోనూ పురోగమించేలా కృషిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును… సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కలిసి ప్రారంభించారు. సదస్సుకు ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర హాజరయ్యారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామని…. ఆయా జిల్లాల్లో కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు అమితమైన ప్రేమ ఉందని…. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవ్యవస్థ సమర్ధంగా పనిచేయడం కోసం అదనపు సిబ్బందిని మంజూరు చేసినట్లు వివరించారు.