DailyDose

మద్యం సేవించి గురుద్వారా వెళ్లారని పంజాబ్ సీఎంపై కేసు నమోదు

Auto Draft

గురుద్వారలోకి మద్యం సేవించి వెళ్లారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై భారతీయ జనతా పార్టీ నేత తాజిందర్ సింగ్ బగ్గా పోలీసులు ఫిర్యాదు చేశారు.అనంతరం ఆ ఫిర్యాదు కాపీని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సీఎం భగవంత్ మాన్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పంజాబ్ డీజీపీని కోరారు. శుక్రవారం శరోమణి గురుద్వార పర్బందక్ కమిటీ సైతం ఇదే ఆరోపణ చేసింది. దీంతో భగవంత్ మాన్ క్షమాపణ చెప్పాలని కోరుతూ పంజాబ్‌లోని ప్రతపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.భగవంత్ మాన్‌పై ఇలాంటి ఆరోపణలు కొత్తేం కాదు. గతంలో సైతం మద్యం సేవించి గురుద్వారలోకి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. పార్లమెంట్‌కు సైతం ఒకసారి ఇలాగే వచ్చారని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ నిజమే అన్నట్లుగా.. కొద్ది రోజుల క్రితం ఒక ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తాను మద్యం మానేస్తున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సైతం ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం.