DailyDose

విద్యార్థిని ఇంట్లో టిఫిన్ చేసిన సీఎం స్టాలిన్- కారంగా ఉంద‌ని కామెంట్

విద్యార్థిని ఇంట్లో టిఫిన్ చేసిన సీఎం స్టాలిన్- కారంగా ఉంద‌ని కామెంట్

ఓ విద్యార్థిని ఇంట్లో టిఫిన్ చేశారు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్. నరికురవర్‌ లోని పదో తరగతి విద్యార్థిని ఇంటికి స్టాలిన్‌ వెళ్లారు. అక్కడ ఇడ్లీ, వడ తిన్నారు. సరికురవర్ వర్గాల వారు వెనుకబడ్డారని, వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక మీడియాలో వీడియో వైరల్ అయింది. ఆ సమయంలో త్వరలోనే వారి ఇంటికి వెళ్లి భోజనం చేస్తానని స్టాలిన్ హామీ ఇచ్చారు. దీంతో కె.దివ్య అనే విద్యార్థిని ఇంటికి వెళ్లారు. వారితో సరదాగా మాట్లాడిన అనంతరం వారితో కూర్చుని టిఫిన్‌ చేశారు. సాంబార్‌ ఇడ్లీ తిన్న ఆయన ‘కారంగా ఉంది’ అన్నారు. వెంటనే అక్కడ ఉన్న అతను పిల్లలకు జలుబు, దగ్గు రాకుండా ఉండటం కోసం కారంగా చేశామ‌న్నారు. గతంలోనూ స్టాలిన్ సుగాలి విద్యార్థులకు వీడియో కాల్ చేసి వారితో మాట్లాడారు..