DailyDose

సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో పడి భక్తుడు మృతి – TNI నేర వార్తలు

సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో పడి భక్తుడు మృతి – TNI  నేర వార్తలు

* సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి గొర్లె మోహన్ రావు(19) అనే భక్తుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన మోహన్ రావు అనే భక్తుడు ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం దేవస్థానానికి వచ్చాడు. ఈ క్రమంలో పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 2 నెలల కిందట ఓ భక్తుడు పుష్కరిణిలో స్నానాలు చేయడానికి పూడికలు తీయాలని విజ్ఞప్తి చేసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించారు. బురద నీటిలో భక్తులు స్నానాలు చేస్తుంటే కనీస భద్రతా ప్రమాణాలు తీసుకోలేదని భక్తులు మండిపడుతున్నారు. అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపట్నం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

*ఒక వాహనం, మినీ బస్సు ఢీకొన్నాయి. రెండు వాహనాలకు మంటలంటున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది స్కూల్‌ టీచర్లతోసహా 11 మంది మరణించారు. ఇరాక్‌లోని బాబిలోన్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. షియాల పవిత్ర నగరం కర్బలాలో జరిగిన రంజాన్‌ విందుకు హాజరైన కొందరు మినీ బస్సులో శుక్రవారం అర్థరాత్రి వేళ తిరిగి వస్తున్నారు. అయితే వ్యతిరేక దిశలో వేగంగా వచ్చిన మరో వాహనం ఆ మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో బస్సులోని 9 మంది స్కూల్‌ టీచర్లతో సహా 11 మంది మరణించినట్లు ఇరాక్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు గాయపడినట్లు చెప్పారు. అతి వేగం, ఇతర వాహనం డ్రైవర్‌ నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు.

*కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న ఓ టీకొట్టులో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. భారీ శబ్దం రావడంతో మత్స్యకారులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదానికి సమీపంలోనే హార్బర్‌ పెట్రోల్ బంక్ ఉంది. కానీ, ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

*నటి గాయత్రి రఘురాంతో పాటు 150 మంది బీజేపీ కార్యకర్తలపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం కోయంబేడులోని అంబేడ్కర్‌ విగ్రహానికి వీసీకే, ఇతర పార్టీ నాయకులు నివాళులర్పించే సమయంలో బీజేపీకి చెందిన నటి గాయత్రి రఘురాం, 150 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో గాయత్రి రఘురాం వెట్రివేల్, వీరవేల్‌ అంటూ కుమారస్వామి పేరుతో నినాదాలు చేశారు.

*మధురై ఆళగర్‌ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తుల తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమం ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

*సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి గొర్లె మోహన్ రావు(19) అనే భక్తుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన మోహన్ రావు అనే భక్తుడు ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం దేవస్థానానికి వచ్చాడు. ఈ క్రమంలో పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 2 నెలల కిందట ఓ భక్తుడు పుష్కరిణిలో స్నానాలు చేయడానికి పూడికలు తీయాలని విజ్ఞప్తి చేసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించారు. బురద నీటిలో భక్తులు స్నానాలు చేస్తుంటే కనీస భద్రతా ప్రమాణాలు తీసుకోలేదని భక్తులు మండిపడుతున్నారు. అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపట్నం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

*పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ సింగ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై శనివారం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. బీజేపీ నేత తజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం పంజాబ్‌లో కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. సీఎం భగవంత్‌ మాన్‌ ఏప్రిల్‌ 14వ తేదీన మద్యం సేవించి గురుద్వారాలోకి ప్రవేశించారని తజీందర్‌ సింగ్‌ తెలిపారు. అయితే, దేశవ్యాప్తంగా జరుపుకునే బైసాఖీ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మద్యం సేవించిన స్థితిలో తఖ్త్ దమ్‌దామా సాహిబ్‌లోకి ప్రవేశించారని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) అంతకుముందు శుక్రవారం ఆరోపించింది.దీంతో తాజాగా బీజేపీ నేత బగ్గీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోన సీఎం క్షమాపణలు చెప్పాలని కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ సందర్బంగా భగ్గా.. ట్విట్టర్‌ వేదికగా తన ఫిర్యాదు మేరకు సీఎంపై చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు.

*హైదరాబాద్ నల్లకుంట పీఎస్ పరిధిలో గంజాయి కలకలం సృష్టించింది. బయమ్మ వీధిలో గంజాయి అమ్ముతున్న కౌసల్య గాయత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి 1,100 గ్రా. గంజాయి ద్రావణం, 450 గ్రా. పొడి గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి అసలు సూత్రధారులు మనోజ్‌సింగ్, మనోహర్‌సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు

*గంట్యాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గంట్యాడ దగ్గర రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు రామకృష్ణ, రామచంద్రారెడ్డిగా గుర్తించారు.

*తిరుపతి: నగరంలోని అశోకనగర్‌లో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 154 బస్తాల నిషేధిత గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.28 లక్షల గుట్కాలు సీజ్ చేశారు. మార్కెట్‌లో వీటి ధర కోటి పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుట్కాలతో పాటు నాగేంద్రకుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్‌ఈబీ సూపరింటెండెంట్ స్వాతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*హైదరాబాద్‌ నగరంలోని ట్యాంక్‌బండ్‌పై కారు బోల్తాపడింది. శనివారం ఉదయం ట్యాంక్‌బండ్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు (TS08 EZ 3990) అదుపుతప్పి ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్ద బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు వైద్య విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాంధీ దవాఖాన నుంచి నెక్లెస్‌ రోడ్డు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారును రోడ్డుపైనుంచి తొలగించి.. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

*కామారెడ్డిలో త‌ల్లీకుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. స్థానికంగా ఉన్న‌ న్యూ మ‌హారాజా లాడ్జిలో గ‌దిలో త‌ల్లీకుమారుడు నిప్పంటించుకున్నారు. గ‌ది నుంచి తెల్ల‌వారుజామున పొగ‌లు రావ‌డంతో సిబ్బంది గ‌మ‌నించారు. దీంతో పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

*జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఆర్మీ క్యాంప్‌ సమీపంలో భారీ మందుపాతరను వెళికితీశారు. జిల్లాలోని గుర్దాన్‌ చావా వద్ద రాజౌరీ గుర్దాన్‌ రోడ్డుపై అనుమానాస్పద వస్తువులు ఉన్నాయనే సమాచారంతో భధ్రతా బలగాలు గాలింపు నిర్వహించాయి. ఈ క్రమంలో ఆర్మీ క్యాంప్‌ సమీపంలో పాతిపెట్టిన ఐదు కిలోల ఐఈడీని గుర్తించారు. దీంతో దానిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు.

*ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ కానిస్టేబుల్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. విజయవాడ టూటౌన్‌ కొత్తపేట పీఎస్‌ పరిధిలో పోలీస్‌ క్వార్టర్స్‌లో నివాసముంటున్న ప్లాట్‌ నుంచి దూకి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సొంటి వీరబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

*మదురైలో నిర్వహిస్తున్న చిథిరై ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు, మదురైలోని చిథిరై ఉత్సవాల్లో అపశ్రుతి జరిగింది. శ్రీ కల్లాళగర్ సుందరరాజా పెరుమాళ్ స్వామి ఊరేగింపునకు భారీగా జనం తరలిరాగా.. తొక్కిసలాట జరిగింది. ఓ 90 ఏళ్ల వృద్ధుడు, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

*తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్‌ సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌, సీఐ నాగార్జున గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ యాదగిరి సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్ జితేందర్‌ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పద్మ, సంతోష్‌ మృతదేహాలతో బంధువులు ఆందోళనకు దిగారు.

*షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా బ్యాటరీ నుంచి మంటలు చెలరేగడంతో ఓ కారు దగ్ధమైన ఘటన శుక్రవారం రాత్రి టీటీడీ పరిపాలనా భవనం వద్ద జరిగింది. తిరుపతి సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి నర్రెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో టీటీడీకి చెందిన కారు దగ్ధమౌతున్నట్టు సమాచారం అందడంతో తమ ఫైర్‌ ఫైటింగ్‌ టీమ్‌ అక్కడకు చేరుకుందన్నారు. తాము వెళ్లేటప్పటికే కారు అధికభాగం కాలిపోయిందనిఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. తమ సిబ్బంది మంటలను ఆర్పారన్నారు. కాగా.. కారు దగ్ధమైన విషయమై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని వెస్ట్‌ పోలీసులు తెలిపారు.

*ఖమ్మం రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‎కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను స్థానికుల సహాయంతో బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఖమ్మం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

*షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా బ్యాటరీ నుంచి మంటలు చెలరేగడంతో ఓ కారు దగ్ధమైన ఘటన శుక్రవారం రాత్రి టీటీడీ పరిపాలనా భవనం వద్ద జరిగింది. తిరుపతి సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి నర్రెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో టీటీడీకి చెందిన కారు దగ్ధమౌతున్నట్టు సమాచారం అందడంతో తమ ఫైర్‌ ఫైటింగ్‌ టీమ్‌ అక్కడకు చేరుకుందన్నారు. తాము వెళ్లేటప్పటికే కారు అధికభాగం కాలిపోయిందని, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. తమ సిబ్బంది మంటలను ఆర్పారన్నారు. కాగా.. కారు దగ్ధమైన విషయమై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని వెస్ట్‌ పోలీసులు తెలిపారు.

*తమిళనాడులోని తిరుచ్చి ఎన్‌ఐటీ కళాశాలలో చదువుతున్న కాకినాడ ప్రాంతానికి చెందిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. కాకినాడ భానుగుడికి చెందిన సౌమ్యా దేవి ఎన్‌ఐటీ కళాశాల హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. హాస్టల్‌ గదిలో సౌమ్యాదేవితోపాటు తిరువారూరుకు చెందిన దీక్షణ అనే విద్యార్థిని కూడా ఉంటోంది. గురువారం తమిళ ఉగాది సెలవు కావటంతో దీక్షణ హాస్టల్‌ గది నుంచి బయటకు వెళ్లింది. రాత్రి ఆమె తిరిగి వచ్చి చూడగా గది తలుపులు మూసివున్నాయి. ఎంత పిలిచినా సౌమ్య తలుపులు తీయలేదు. దీంతో అనుమానించిన విద్యార్థినులు కళాశాల సిబ్బంది సాయంతో తలుపుల్ని బలవంతంగా తెరిచి చూడగా సౌమ్యాదేవి ఉరికి వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆమె మరణించినట్టు స్పష్టమవ్వడంతో కళాశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తువాక్కుడి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

* అతి వేగం.. రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. అదే లారీని ఢీకొంది. నిజామాబాద్‌-నిర్మల్‌ జిల్లాల సరిహద్దులో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. టీఎస్‌ ఆర్టీసీకి చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌కు 39 మంది ప్రయాణికులతో గురువారం అర్ధరాత్రి బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిజామాబాద్‌ జిల్లా మెండోర మండలం వద్ద ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ముందు వెళుతున్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సహా 20 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు.. క్షతగాత్రులను నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.

*పుదుచ్చేరి ఎక్స్‌ ప్రెస్‌ రైలుకు (Puducherry Express) పెను ప్రమాదం తప్పింది. దాదర్‌ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం రాత్రి ముంబైలోని మాతుంగా-దాదర్‌ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. దీంతో రైలులోని మూడు బోగీలు రైల్వే ట్రాక్‌పై నుంచి పక్కకు జరిగాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

*ఖమ్మం: జిల్లాలోని మధిర రైల్వేస్టేషన్‌ వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో అతడిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నప్పటికీ మృతదేహాన్ని రైల్వే సిబ్బంది పట్టాలపైనుంచి తొలగించలేదు. దీంతో ప్రమాదం జరిగిన ట్రాక్‌పై స్టేషన్‌ మాస్టర్‌ రైళ్ల రాకపోకలు నిలిపివేశారు.

*నల్లగొండ: జిల్లాలోని దామరచర్లలో లారీ దగ్ధమయింది. రసాయన పరిశ్రమకు ముడిసరుకుతో ఓ లారీ రాజస్థాన్‌ నుంచి తడకు వెళ్తున్నది. ఈ క్రమంలో దామరచర్ల వద్ద లారీలో షార్ట్‌సర్య్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం జరిగడంతో దామరచర్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ప్రమాదానికి గురైన లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో శుక్రవారం చోటుచేసుకుంది. భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.రెడ్డి కాలనీలోని అపార్ట్ మెంట్ పై నుంచి దూకి శ్రీకాంత్ (35) బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతను ఎందుకు చనిపోయాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

*కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ కంబగిరి రాముడు కు ముందస్తు బెయిల్ మంజూరు..తమిళనాడుకు చెందిన వ్యాపారి సతీష్ బాలకృష్ణన్ నుంచి 15 లక్షలు బలవంతంగా లాక్కున్నారని సిఐతో పాటు మరో ముగ్గురు మధ్య వర్తులపై కేసు నమోదు..అజ్ఞాతంలో ఉన్న సిఐ హైకోర్టులో ముందస్తు బెయిల్ కు ప్రయత్నాలు..షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.