Movies

సన్నివేశాలు అరుదు

సన్నివేశాలు అరుదు

చేతినిండా సినిమాలతో సుకుమార గులాబీ శృతీహాసన్ బిజీగా ఉంది . ఓపక్క షూటింగులు చేస్తూ , ఇంకో పక్క మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నది . తాను ఇష్టపడినట్లు తరచూ తెరపై మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం ప్రదర్శిం చడం సాధ్యపడదంటున్నది . “ యాక్షన్ సన్నివేశాల్ని నేను ఎంజాయ్ చేస్తాను . అయితే అవి కథను ఎంత కన్విన్స్ చేస్తాయన్నది ముఖ్యంకదా . మహిళలు తెరపై ఈ ఆర్ట్స్ పర్ఫార్మ్ చేస్తే చూడడానికి బాగానే ఉంటుంది . అయితే , అవి కథలో మిళితమై , వాస్త వాన్ని ప్రతిబింబించగలగాలి . కథానాయికలకు స్క్రీన్పై యాక్షన్ సన్నివేశాలు చేసే అవకాశాలు అరు దుగా వస్తాయి … ” అంటూ తనదైన మార్కు నవ్వులు విసిరింది .