Politics

మంత్రులకు ఆర్భాటాలు ఎక్కువయ్యాయి – TNI రాజకీయ వార్తలు

మంత్రులకు ఆర్భాటాలు ఎక్కువయ్యాయి – TNI రాజకీయ వార్తలు

* సీఎం జగన్, మంత్రులకు ఆర్భాటాలు ఎక్కువయ్యాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. సీఎం ఒంటిమిట్టకు వస్తే 3,500 మంది పోలీసులతో బందోబస్తు అవసరమా? అని ప్రశ్నించారు. కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్ ర్యాలీ కారణంగా.. సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి చెందడం విచారకరమన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణ కోసం.. 3 గంటల పాటు భక్తులను క్యూలైన్లలో ఉంచడం ధర్మమా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో చివరకు కోర్టులకే రక్షణ లేదన్నారు. కుటుంబంలో ఒక్కరికే అమ్మఒడి అమలు చేయడం సమంజసం కాదని తులసిరెడ్డి పేర్కొన్నారు

*వైసీపీ తుగ్లక్ చర్యలను అడ్డుకుంటాం: సోమువీర్రాజు
వైసీపీ తీసుకునే తుగ్లక్ చర్యలను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు పార్టీ ఆఫీసు నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు ఆలయాల నిధులు ఇస్తే ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమ్మవడి గత సంవత్సరం ఇవ్వలేదు..ఈ సంవత్సరం జూన్ లో ఇస్తామని చెప్పారన్నారు. జిల్లాల విభజన పూర్తి కాగానే నిబంధనలు ప్రకటించారని చెప్పారు.300 యూనిట్లు విద్యుత్ ప్రామీణకం పెడితే ఎలా అని ప్రశ్నించారు.ఆధార్ లో కొత్త జిల్లాల నమోదు వంటివి చాలా నిబంధనలు పెట్టారు.. ఈ కారణంగా 60 శాతం మందికి అమ్మవడి రాదన్నారు. అమ్మవడి తొలి సంవత్సరం ఏలా ఇచ్చారో అలాగే ఈ ఏడాది ఇవ్వాల్సిందేనన్నారు. జిల్లాల విస్తరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు, ఆర్థిక బడ్జెట్ హిందూ దేవాలయాలు నుంచి సేకరించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని సోమువీర్రాజు తీవ్రంగా వ్యతిరేకించారు.

*ఉత్తరాంధ్ర భూకాసురుడు ఎవరో దేశం మొత్తం తెలుసు: బుద్దా వెంకన్న
ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర భూకాసురుడు ఎవరో దేశం మొత్తం తెలుసన్నారు. ‘‘మీది కుల పార్టీనా? మాది కుల పార్టీనా తేల్చుకుందాం రా’’ అంటూ సవాల్ విసిరారు. జగన్ అవినీతిలో భాగమై జైలుకెళ్లినందుకే రాజ్యసభ సీటు వచ్చిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది మందికి పని లేకుండా చేసిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. ఇప్పుడు జాబ్ మేళా అంటూ జగన్నాటకం మొదలు పెట్టారన్నారు. చెప్పింది చేసేవారికే జగన్ మంత్రి పదవులిచ్చారని విమర్శించారు. బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలన్నారు. బీసీలకు ఇచ్చే పథకాలను జగర్ రద్దు చేసింది వాస్తవం కాదా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు

*బాధ కలిగినా తప్పలేదు.. అందుకే ఆ నిర్ణయం: మంత్రి విశ్వరూప్
ఏ మంత్రికైనా బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రజలపై భారం మోపటం బాధాకరమేనని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అన్నవరం సత్య నారాయణ స్వామిని దర్శించుకున్న ఆయన.. ఆర్టీసీని కాపాడుకునేందుకు తప్పని పరిస్థితుల్లో బస్సు ఛార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు.బాధాకరమే అయినా.. తప్పక ఛార్జీలు పెంచాల్సి వచ్చిందిరవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి రావటం బాధాకరమేనని పినిపే విశ్వరూప్ అన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి విశ్వరూప్.. ఆర్టీసీని కాపాడుకునేందుకు అనివార్యంగా ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఛార్జీలు తక్కువ అని వెల్లడించారు. డీజిల్ ధర తగ్గగానే సెస్ తగ్గించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తిరుమలకు దశలవారీగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు.”ప్రమాణం చేసిన వెంటనే ఛార్జీలు పెంచాల్సి రావడం బాధాకరమే. ఆర్టీసీని కాపాడుకునేందుకు అనివార్యంగా తీసుకున్న నిర్ణయమిది. తెలంగాణతో పోలిస్తే మన రాష్ట్రంలో ఛార్జీలు తక్కువ. డీజిల్ ధర తగ్గగానే సెస్ తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. తిరుమలకు దశలవారీగా వంద ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతాం.” -పినిపే విశ్వరూప్‌, రవాణా శాఖ మంత్రి
ప్రయాణికులపై భారం: డీజిల్ సెస్‌ పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ. 5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనుంది. వీటికి అదనంగా అన్నింటిపైనా రూపాయి చొప్పున సేఫ్టీ సెస్సు విధించింది. అలాగే పల్లెవెలుగు బస్సుల్లో ఇప్పటిదాకా రూ.8 ఉన్న కనీస ఛార్జీని రూ.10 పెంచిన ఆర్టీసీ.. రూ.2 డీజిల్ సెస్సు, రూ.1 సేఫ్టీ సెస్సు విధించింది. ఇవన్నీ కలిపితే కనీస టికెట్ ధర రూ.13 అవుతుండగా.. చిల్లర సమస్య రాకుండా అంటూ కనీస ఛార్జీని రూ.15 చేసింది.

*నాది పోటీ సభ కాదు.. అధిష్టానం వద్దనలేదు : మాజీమంత్రి అనిల్
మంత్రివర్గ విస్తరణతో వైకాపాలో మొదలైన చిచ్చు.. ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి, భగ్గుమన్నవారిని బుజ్జగించినప్పటికీ.. మిగిలిన వారిలో మాత్రం అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉన్నట్టే కనిపిస్తోంది. నెల్లూరు వైకాపా రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. తాజా మంత్రి కాకాణికి స్వాగతం పలికేరోజునే.. మాజీ మంత్రి బహిరంగ సభ ఏర్పాటు చేస్తుండడంపై నెల్లూరులో జోరుగా చర్చ సాగుతోంది.రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత వైకాపాలో ఎంత రచ్చ సాగిందో తెలిసిందే. అసంతృప్తులను బుజ్జగించేందుకు స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే.. ఉక్రోషం అణచుకోలేకపోయినవారు రోడ్డున పడ్డప్పటికీ.. మిగిలిన వారు లోలోపల రగిలిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరు వైకాపాలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం అని అంటున్నారు. ఈ జిల్లానుంచి మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్‌.. పునర్ వ్యవస్థీకరణలో పదవి పోగొట్టుకున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆయన స్థానాన్ని భర్తీచేశారు. వీరిమధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయని, కేబినెట్ పరిణామాలు వీటిని మరింత రాజేశాయని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

*ఉత్తరాంధ్ర భూకాసురుడు ఎవరో దేశం మొత్తం తెలుసు: బుద్దా వెంకన్న
ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర భూకాసురుడు ఎవరో దేశం మొత్తం తెలుసన్నారు. ‘‘మీది కుల పార్టీనా? మాది కుల పార్టీనా తేల్చుకుందాం రా’’ అంటూ సవాల్ విసిరారు. జగన్ అవినీతిలో భాగమై జైలుకెళ్లినందుకే రాజ్యసభ సీటు వచ్చిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది మందికి పని లేకుండా చేసిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. ఇప్పుడు జాబ్ మేళా అంటూ జగన్నాటకం మొదలు పెట్టారన్నారు. చెప్పింది చేసేవారికే జగన్ మంత్రి పదవులిచ్చారని విమర్శించారు. బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలన్నారు. బీసీలకు ఇచ్చే పథకాలను జగర్ రద్దు చేసింది వాస్తవం కాదా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు

*భార‌త్‌కు హాని త‌ల‌పెట్టాల‌ని చూస్తే స‌హించ‌నే స‌హించం : రాజ్‌నాథ్‌
రక్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాకు మ‌రోసారి వార్నింగ్ ఇచ్చారు. భార‌త్‌కు ఎవ‌రైనా హాని త‌ల‌పెట్టాల‌ని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమ‌ని తేల్చి చెప్పారు. భార‌త్‌ను ఇబ్బంది పెట్టాల‌ని చూసే వారిపై క‌ఠినంగానే వుంటామ‌ని హెచ్చ‌రించారు. ప్‌చస్తుతం భార‌త్ అత్యంత శ‌క్తిమంతంగా ఎదుగుతోంద‌ని, ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో కూడా టాప్‌లో ఉంద‌ని తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో లోని ఇండియ‌న్‌- అమెరిక‌న్ క‌మ్యూనిటీని ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌సంగించారు.‘భార‌త సైన్యం ఎలాంటి దీటైన జ‌వాబిచ్చిందో బ‌హిరంగంగా చెప్పలేను. అలాగే ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో కూడా చెప్ప‌లేను. కానీ… చైనాకు మాత్రం ఓ హెచ్చ‌రిక వెళ్లింది. భార‌త ప్ర‌భుత్వం అలాంటి వాటిని ఉపేక్షించ‌ద‌న్న విష‌యం మాత్రం అర్థ‌మైంది. ఇండియాను ఇబ్బంది పెట్టాల‌ని చూస్తే చూస్తూ ఊరుకోదు అన్న విష‌యం మాత్రం చైనాకు బోధ‌ప‌డింది’. అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.భార‌త్ దౌత్య‌ప‌రంగా ఓ దేశంతో స‌త్సంబంధాల‌ను కొన‌సాగించినంత మాత్రాన‌.. ఇత‌ర దేశంతో స‌రైన దౌత్య సంబంధాల‌ను కొన‌సాగించ‌ద‌న్న అర్థం కాద‌ని, అలాంటి దౌత్య నీతిని భార‌త్ ఎప్పుడూ అవ‌లంబించ‌ద‌ని అమెరికాకు పరోక్షంగా చుర‌క‌లంటించారు. భార‌త్ ఎప్పుడూ విన్‌-విన్ కాన్సెప్ట్ ప్ర‌కార‌మే దౌత్యాన్ని నెరుపుతుంద‌ని రాజ్‌నాథ్ తేల్చి చెప్పారు

*ఆ ఘటననపై సీఎం ఎందుకు స్పందిచడం లేదు? : జీవీరెడ్డి
నెల్లూరు కోర్టులో సాక్ష్యాలు మాయమైన ఘటననపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందిచడం లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘న్యాయస్థానం తలుపులు పగలగొట్టినా డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు.. తన కేబినెట్లో మంత్రిగా ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డి ఏ1 గా ఉన్న కేసులోని ఆధారాలు మాయమైతే తనకు సంబంధం లేదన్నట్లు ముఖ్యమంత్రి ఎలా ఉంటారు? నెల్లూరు కోర్టులో సాక్ష్యాలు మాయమైన ఘటనను, వైసీపీలో నేరారోపణలు ఎదుర్కొంటూ, న్యాయస్థానాల్లో విచారణకు హాజరవుతున్న వారంతా స్ఫూర్తిగా తీసుకునే వరకు ముఖ్యమంత్రి స్పందించరా? నెల్లూరు ఘటన మాదిరే నేరస్తులంతా న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై దాడి చేసి, శిక్షల నుంచి బయటపడాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమా? నెల్లూరు ఘటనలో అసలు దోషులకు శిక్షపడేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. దారినపోయే అనామకుల్ని అరెస్ట్ చేసి, సొంత బాబాయ్ హత్యకేసులాగా సాక్ష్యాలు చోరీ చేసి కేసుని నీరుగార్చే ప్రయత్నాలు మానుకోండి.

కాకాణి గోవర్థన్ రెడ్డిని జగన్ తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలి. మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి. తన, పరబేధం లేకుండా తప్పు చేసిన వారందరినీ శిక్షిస్తానన్న జగన్ ఆ మాటను కాకాణి విషయంలో ఆచరణలో పెట్టాలి. నెల్లూరు న్యాయస్థానంలో జరిగిన ఘటనను రాష్ట్ర హైకోర్టు సుమోటాగా విచారణను స్వీకరించి అసలు దోషులను శిక్షించాలి. రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం రెట్టింపయ్యేలా హైకోర్ట్ తక్షణమే నెల్లూరు ఘటనపై చర్యలకు ఉపక్రమించాలి’’ అని జీవీరెడ్డి డిమాండ్ చేశారు.

*రైతులను ఏడిపించేలా కేసీఆర్‌ పద్ధతులు: సీతక్క
రైతులను ఏడిపించేలా సీఎం కేసీఆర్‌ విధానాలు ఉన్నాయని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శనివారం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. మిల్లర్ల దోపిడీలో టీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవడం లేదన్నారు. రైతు సంఘర్షణ సభకు రైతులంతా హాజరు కావాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు

*వైసీపీ తీరుపై రఘురామ
వైసీపీ తీరుపై ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యానికి నగదు బదిలీతో ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల ఆహార భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్టు పేరుతో మోసగిస్తున్నారని రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.

*రెవెన్యూ శాఖలో అవినీతి భారీ స్థాయిలో పెరిగింది: మంత్రి ధర్మాన
రెవెన్యూ శాఖలో అవినీతి భారీ స్థాయిలో పెరిగిపోయిందని, దాని నివారణకు కృషి చేస్తానని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు శ్రీకాకుళంలో మంత్రికి అభినందన సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ… ‘అవినీతి నివారణలో భాగంగా సీఎం బ్యాంకుల నుంచి రైతుల ఖాతాలకు నేరుగా నగదు పంపే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అయినా అవినీతి తగ్గిపోలేదు. ఇది మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. నిజాయితీగా పనిచేస్తేనే ప్రజలు నమ్ముతారు. కులం, మతం చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయి. పంజాబ్‌లో ఆప్‌కు పట్టం కట్టడమే ఇందుకు నిదర్శనం. వయోభారం పెరిగే కొద్దీ రాజకీయాల్లో ఉత్సాహం తగ్గుతోంది. త్వరలో విరామం ప్రకటించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అప్పుడప్పుడు అనిపిస్తోంది. ప్రజల ప్రేమాభిమానులు ఇందుకు అడ్డొస్తున్నాయి’ అని ధర్మాన తెలిపారు.

*జాతీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు మానాలి: గుత్తా నల్లగొండ: దేశంలోని జాతీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు మానుకుని ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడితే మంచిదని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు బాంధవుడైన సీఎం కేసీఆర్‌ రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్నారన్నారు. ఛత్తీస్‌ఘడ్‌, బీహార్‌, ఏపీ రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం లోడు వాహనాలు వస్తున్నాయని, ఇక్కడే ఆయా రాష్ట్రాల ధాన్యాన్ని విక్రయించుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయడంతో తెలంగాణ రైతాంగానికి న్యాయం జరుగుతుందన్నారు. తామే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తున్నామని బీజేపీ అనడం సిగ్గుచేటని సుఖేందర్‌రెడ్డి అన్నారు.

*సీపీఎస్‌ను పరిష్కరించలేక పోతున్నాం: తమ్మినేని సీతారాం
సాంకేతిక సమస్యలు కారణంగా సీపీఎస్‌ను పరిష్కరించలేక పోతున్నామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రెండో రోజు శుక్రవారం నిర్వహించిన ఏపీటీఎఫ్‌ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి భేదాభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్ల బోధన అవసరమని, అలా అని తెలుగుభాషను విస్మరించడం జరగదన్నారు. ఏపీటీఎఫ్‌ ఉద్యమాలు చరిత్ర కలిగినవని పేర్కొన్నారు. అనంతరం పూర్వ సమాచారహక్కు జాతీయ కమిషనర్‌, మహేంద్రయూనివర్శిటీ సూల్‌ ఆఫ్‌ లా ఆచార్యుడు మాడభూషి శ్రీధర్‌ మాట్లాడుతూ నేటితరానికి విద్య నిరంతర లక్ష్యసాధన కావాలన్నారు. ఇందు కోసం ఉపాధ్యాయులంతా కృషి చేయాలని తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు.

*ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రభావం ఉంటుంది: ఉండవల్లి
ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రభావం ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలనలో వైఎస్సార్‌కు సీఎం జగన్‌రెడ్డికి పోలికలేదన్నారు. విభజన హామీలపై వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతోందని తప్పుబట్టారు. ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలున్నాయని తెలిపారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు కుదరవన్నారు. జిన్నా టవర్ అసలు ఇష్యూ కానే కాదని కొట్టిపారేశారు. ఓ రాజకీయ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఉండవల్లి అరుణ్‌కుమార్ దుయ్యబట్టారు.

*కోర్టులకే రక్షణ లేదు?: సోమిరెడ్డి
కోర్టులకే రక్షణ లేకుంటే ప్రజలు, సాక్షులకి ఏం రక్షణ ఉంటుంది? అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లో హీయరింగ్ రాబోతున్న కేసుల ఆధారాలు చోరీ కావడమేంటి? అని ప్రశ్నించారు. తనకు, తన కుటుంబానికి విదేశాల్లో ఆస్తులున్నాయని, గతంలో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి నకిలీ పత్రాలు చూపారని గుర్తుచేశారు. నకిలీ పత్రాల వ్యవహారంపై కాకాణి, మరికొందరిపై కేసు నమోదైందని తెలిపారు. ఆధారాలు చోరీ చేయాల్సిన అవసరం ఎవరికుందో అందరూ అర్ధం చేసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు.

*ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు: సురేష్ప్ర
భుత్వ పథకాలపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి సురేష్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వెళ్లగొట్టినా టీడీపీ నేతలకు సిగ్గులేదన్నారు. జగనన్న అమ్మఒడిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అమ్మఒడికి కొత్తగా ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని తెలిపారు. ఏపీకి జగన్ శాశ్వత సీఎం అనే ఆలోచనలో ప్రజలున్నారని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

*దొంగ పోలీసుతో నన్ను హత్య చేసి వేరే అకౌంట్‌లో రాయాలని చూశారు: రఘురామ
దొంగ పోలీసుతో తనను హత్య చేసి వేరే అకౌంట్‌లో రాయాలని చూశారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. రామకృష్ణారెడ్డి అనే అధికారికి తన ఇంటి ముందు ఏం చేస్తున్నారని డీజీపీకి లేఖ రాసినట్లు చెప్పారు. ఇప్పటివరకు డీజీపీ స్పందించలేదని ఎంపీ రఘురామ అన్నారు. విచారణ జరపాలని కేంద్రహోంశాఖ సెక్రటరీకి లేఖ రాసినట్లు రఘురామ తెలిపారు.ప్రసుత్తం ఏపీలో అమ్మఒడి స్కీమ్ ఒక్కటే ఉందని, అమ్మఒడి స్కీమ్‌కి 20 శాతం బెనిఫిషేర్స్ తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. జనవరిలో ఇచ్చే అమ్మఒడి స్కీమ్‌ను జూన్‌కి మార్చారని, 300 యూనిట్లు కరెంట్ వాడితే అమ్మఒడి కట్ అంటున్నారని, ఇదెక్కడి న్యాయం? అని ఎంపీ ప్రశ్నించారు. అమ్మఒడి పథకానికి, కరెంట్‌కి లింక్‌ పెట్టడం దివాళా కోరుతనమన్నారు. సిగ్గులేకుండా రేషన్ బియ్యం కోటలో క్యాష్ ఇస్తామంటున్నారని, పెట్టింది ఆహార భద్రత స్కీమ్.. డబ్బుల స్కీమ్ కాదని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కిలో బియ్యానికి రూ. 28 పెట్టి ప్రజలకు అందిస్తుందని, ఆహార భద్రత స్కీమ్ కేంద్రానిది, మార్చే హక్కు రాష్ట్రానికి లేదని రఘురామ అన్నారు.

*ళితబంధుతో దళితుల జీవితాల్లో వెలుగు: సబిత
దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌లోని విక్టోరియా మెమోరియల్‌లో జరిగిన కార్యక్రమంలో దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను అందజేసిన సందర్భంగా, రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం రావిచెడ్‌, న్యామతాపూర్‌ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆమె మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం(జూన్‌) నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు.

*పింఛన్లు మంజూరు చేయండి: ఆర్‌. కృష్ణయ్య
కొత్తగా దరఖాస్తు చేసుకున్న 11.12 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య శుక్రవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, నేత, బీడీ కార్మికులు 3.30లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీటికి తోడు ఎన్నికల వాగ్దానం ప్రకారం వయోపరిమితి 57 సంవత్సరాలకు తగ్గించిన తర్వాత 7.82 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. వీరంతా పింఛను కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం పింఛన్లు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని కోరారు.

*ఉత్పత్తి ఖర్చు తగ్గించకుండా మేకిన్‌ ఇండియా ఎలా సాధ్యం: కేటీఆర్‌
ఉత్పత్తి ఖర్చు తగ్గించకుండా మేకిన్‌ ఇండియా నినాదం ఎలా సాధ్యపడుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆసియాలోనే అతి పెద్ద గుండె స్టంట్ల పరిశ్రమ సహజానంద్‌ మెడికల్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎంటీ) పరిశ్రమను శుక్రవారం కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. మేకిన్‌ ఇండియా లక్ష్యం కేవలం నినాదానికే పరిమితం అయిందన్నారు. ఆశయం ఉదాత్తంగా ఉన్నా అందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వ కార్యాచరణ ఉండాలన్నారు. ఇక్కడ ఉత్పత్తి చేయడం కంటే చైనా నుంచి దిగుమతి చేసుకోవడం చవక అన్న భావన సర్వత్రా వ్యాపించి ఉందన్నారు. ముఖ్యంగా వైద్య ఖర్చు తగ్గాలంటే వైద్య పరికరాల దిగుమతి తగ్గాలని కేటీఆర్ అన్నారు.

*మాట తప్పితే ఊరుకునేది లేదు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ధాన్యం కొనుగోలులో మద్దతు ధరపై మాట తప్పితే ఊరుకునేది లేదని, రైతులతో తిరుగుబాటు తప్పదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసే ఉదయసముద్రం, నక్కలగండి ఎత్తపోతల పథకం ప్రాజెక్ట్‌ల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యహారిస్తోందన్నారు. కోట్లు ఖర్చుచేసినా మిషన్‌ భగీరథ జలాలు ఇంటింటికీ అందడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తనపై నమ్మకంతోనే అడుగకున్నా స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని మటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

*కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదు: షర్మిల
సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం లేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం శాపంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బడి, గుడి కన్నా మద్యం షాపులు ఎక్కువయ్యాయని తప్పుబట్టారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని షర్మిల మండిపడ్డారు.

*బండి సంజయ్‌ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదు: పొంగులేటి
కూసుమంచి మండలం మానేపల్లిలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటిస్తున్నారు. బండి సంజయ్‌ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదని పొంగులేటి తెలిపారు. బీజేపీని ప్రజలు గమనిస్తున్నారని, బండి సంజయ్‌వి అహంకారపూరితమైన వ్యాఖ్యలు అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ప్రతి ఏటా ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

*ఉప ఎన్నికలలో బీజేపీకి షాక్
నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధికార రహిత రాష్ట్రాలు.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌లో ఉప ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. చాలాచోట్ల విజయ సంబురాలు జరుగుతున్నప్పటికీ.. ఈసీ అధికారిక ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.పశ్చిమ బెంగాల్‌ ఉపఎన్నికల ఫలితాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది. అసన్సోల్ లోక్‌సభతో పాటు బాలీంగజ్‌ అసెంబ్లీ స్థానాల్లో.. శతృఘ్నసిన్హా, బాబుల్‌ సుప్రియోలు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. దాదాపు వీళ్ల విజయం ఖాయమైంది. అసన్సోల్.. ఇది వరకు బీజేపీ సీటు. ఈ నేపథ్యంలో టీఎంసీ కార్యకర్తలు విజయోత్సవ సంబురాల్లో మునిగిపోయారు. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు