NRI-NRT

ఆటా 17వ మహాసభలలో వీడియో మరియు లఘు చిత్రాల పోటీలు

ఆటా 17వ మహాసభలలో వీడియో మరియు లఘు చిత్రాల పోటీలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షులు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు మరియు అన్ని కమిటీల సభ్యులు అత్యంత ప్రతిష్టాంతంకంగా అమెరికా రాజధాని నగరం నడిబొడ్దున వాషింగ్టన్ డి సి లో మూడు రోజులపాటు జూలై 1 నుండి 3 వరకు వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా..నభూతో నభవిష్యతీ అనేలా జరగనున్న ఆటా 17వ మహాసభలను పెద్ద ఎత్తున 10,000 పైగా హాజరయ్యె విధంగా సన్నాహాలు చేస్తున్నారు.ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) , ప్రముఖ కవులు, కళాకారులు,రాజకీయ ప్రముఖులు,సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ , నటి రకుల్ ప్రీత్ సింగ్ తో గోల్ఫ్ టోర్నమెంట్ (Golf with Rakul), సంచలనం స్రుష్టిస్తున్న గాయకుడు రాం మిరియాల మరియు ప్రముఖ సంగీత దర్శకుడు పద్మవిభూషణ్ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు.

ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల మన తెలుగు వారందరిని ప్రోత్సహించటం కోసం Tik Tok వీడియో మరియు లఘు చిత్రాలలో (Short Films) ఆసక్తి వున్నవారు ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకోండి. ఈ Tik Tok వీడియో మరియు లఘు చిత్రాల కు న్యాయ నిర్నేతాలుగ ప్రముఖ దర్శక నిర్మాత “కమిలి” సినిమా జాతీయ అవార్డు గ్రహీత హరిచరణ ప్రసాద్, ప్రముఖ దర్శక నిర్మాత “మల్లేశం” సినిమా Critics Choice Best Film అవార్డు గ్రహీత రాజ్ రాచకొండ మరియు ప్రముఖ సంగీత దర్శకుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నామిని కార్తీక్ కొడకండ్ల వున్నారు.

ఈ అవకాశాన్ని వాడుకొని Tik Tok వీడియో మరియు లఘు చిత్రాల పోటీలలో పాల్గొని విజయము సాధించాలని కోరుకొంటున్నాము.

Registration: www.ataconference.org/events-registrations
Last Day of Submission: June 1,2022
Email: atareels2022@gmail.com

ఆటా 17వ మహాసభల మరిన్ని వివరాలకు www.ataconference.org చూడండి.