NRI-NRT

2021లో అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణి ఆదాయం ఎంతో తెలుసా..

2021లో అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణి ఆదాయం ఎంతో తెలుసా..

గతేడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి మొత్తం 610,702 డాలర్ల ఆదాయం పొందారు. ఈ విషయాన్ని ట్యాక్స్ చెల్లింపుల సందర్భంగా బైడెన్ దంపతులు పేర్కొన్నారు. ఈ ఆదాయంపై వారు మొత్తం 150,439 డాలర్ల పన్ను చెల్లించారు. బైడెన్ దంపతుల ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన వివరాలను శ్వేతసౌధం తాజాగా వెల్లడించింది. ఇక ఉపాధ్యక్షురాలు కమాలా హ్యారిస్, ఆమె భర్త డగ్ ఎమ్హాఫ్ గతేడాది మొత్తం 1,655,563 డాలర్లు ఆర్జించారు. 523,371డాలర్ల ఫెడరల్ ట్యాక్స్ చెల్లించారు. 1970 నుంచి అమెరికా అధ్యక్షులు తమ ఆదాయం, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను ప్రజల ముందు పెడుతున్నారు. ఇది ఓ సాంప్రదాయంగా కొనసాగుతోంది.