DailyDose

ప్రాణాల మీదకు తెచ్చిన ఫ్రీ వెడ్డింగ్ ఘాట్ – TNI నేర వార్తలు

ప్రాణాల మీదకు తెచ్చిన  ఫ్రీ వెడ్డింగ్ ఘాట్ – TNI  నేర వార్తలు

* ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు ఆ కాబోయే జంట చేపట్టిన ఫ్రీ వెడ్డింగ్‌ వారి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.ఈ విషాదకర సంఘటన వారి జీవితాల్లో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని అబ్దుల్లా పూర్‌మెట్ మండలం కొహెడ గ్రామంలో ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లో విషాదం నెలకొంది.ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో షూట్‌ ఎఫెక్టివగ్‌ ఉండటం కోసం పొగ పెటడంతోపెళ్లికొడుకు, పెళ్లికూతురుపై తేనెటీగలు దాడి చేశాయి. కాగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులు హైదరాబాద్‌లోని మాలక్‌పేట యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.మరో రెండు రోజుల్లో పెండ్లి బాజా భజంత్రీలతో సందడిగా మారాల్సిన ఆ ఇండ్లలో ఇప్పుడు ఇలా జరగడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

*మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం మరో ఘోరం చోటుచేసుకుంది. కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందని కోపంతో ఓ వ్యక్తి భార్యను గొంతు నులిమి చంపేశాడు. భయందర్‌లోని ఫాఠక్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన నీలేశ్‌ ఘాఘ్‌ (46) తనకు వడ్డించిన కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందంటూ భార్య నిర్మల (40)తో గొడవ పెట్టుకున్నాడు. తీవ్ర ఆవేశంతో గొంతు నులిమి చంపేశాడు. అతనిపై హత్య కేసు నమోదైంది. గురువారం థానే జిల్లాలోని రబోడిలో ఓ వ్యక్తి టిఫిన్‌ పెట్టలేదని కోడలిని తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే.\

*ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒకే కుటుంబనికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోనసీమ జిల్లా యానాం-ఎదుర్లంక బాలయోగి వంతెనపై ఆదివారం మధ్యాహ్నం వేగంగా వచ్చిన ఇసుక లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న భార్యాభర్తలు, కుమారుడు మృతి చెందగా కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.

*అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెంచలపాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆలూరు, గుంతకల్లు పట్టణానికి చెందిన వారు కసాపురం ఆంజనేయస్వామిని దర్శించుకుని మురుడి, నెమకల్లు దేవాలయాలకు వెళుతూ జాతీయ రహదారిపై ఆగారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆగి ఉన్న తూఫాను వాహనాన్ని ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయపడగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంతకల్లులో ప్రాథమిక చికిత్స తర్వాత కొందరిని అనంతపురం, మరికొందరిని కర్నూలు ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*కళ్లలగర్‌ వైగైనదీ ఆగమనోత్సవం సందర్భంగా ఆళ్వార్‌పురం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో గుమికూడటంతో తొక్కిసలాట జరిగింది. సుమారు 20 మంది భక్తులు ఊపిరాడక తీవ్ర అస్వస్థత చెందారు. వీరిని అంబులెన్సులలో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మి(60) అనే వృద్ధురాలు, సెల్వన్‌(40) అనే మరో వ్యక్తి మృతి చెందారు. మరో పది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలియగానే మంత్రి మూర్తి, జిల్లా కలెక్టర్‌ అనీ్‌షశేఖర్‌ ఆస్పత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.

*నాగార్జున సాగర్‌మునుగోడు మండలంకొరటికల్ గ్రామానికి చెందిన దివ్య (అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దివ్య మృతికి తన భర్త ఐతగొని శేఖర్ మరో మహిళతో అక్రమ సంబంధమే కారణమని దివ్య బంధువులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని నల్గొండ మార్చురీకి తరలించికేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*సత్తెనపల్లిలో యువతి గొంతు కోసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొన్నాళ్లుగా ఫాతిమాతో తులసీరామ్‌ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఫాతిమా కోరడంతో గొంతుకోసి తులసీరామ్‌ పరారైనాడుచెక్‌పోస్ట్‌ దగ్గర తులసీరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*బీటెక్‌ విద్యార్ధి చంద్రయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. డోకిపర్రులో ఓ కాలేజ్‌లో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. కాలేజీ సమీపంలోని రైలు పట్టాలపై విద్యార్థి మృతదేహం లభ్యమైంది. చంద్రయ్య స్వస్థలం పల్నాడు జిల్లారొంపిచర్ల మండలంఅరెపల్లి. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి కాలేజ్‌కు వెళ్లాడని కుటుంబసభ్యులు తెలిపారు. చంద్రయ్య మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. నరసరావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట చంద్రయ్య బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఐజేఎం విల్లాలో ఓ వ్యక్తి అనుమనాస్పదంగా మృతి చెందాడు. అధికార పార్టీ నేత విల్లాలో విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. విల్లా నుంచి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విల్లాకు చేరుకుని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు

* వ్యర్ధ పదార్ధాల గోదాములో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో వ్యర్ధాలతో పాటు వాహనం, 2 పేపర్‌ కటింగ్‌ మిషన్‌లు దగ్ధంమయ్యాయి. గోదాము సమీపంలో టపాసులు పేల్చడంతో ఒక్కసారి మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆస్తినష్టం సుమారుగా రూ. 25 లక్షలు జరిగినట్లు యజమానులు తెలిపారు.

*సెల్ ఫోన్ ఛార్జర్ బాలుడి ప్రాణం తీసింది. డోన్‎లోని పోచా ప్రభాకర్ రెడ్డి నగర్ ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. బాలుడు (పులయ్య) సెల్‎ఫోన్‎కు ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‎కు గురయ్యాడు. దీంతో ఛార్జింగ్ పెట్టిన వెంటనే బాలుడు కుప్పకూలిపోయాడు. గమనించిన బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కొడుకు మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

*సోంపేట మండలంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పలాసపురం 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఇన్నోవా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఈ ఘటన సింహాచలం నుంచి కంచిలి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఒడిసాకు చెందిన ఏళ్ల మహిళపై శుక్రవారం రాత్రి సామూహిక అత్యాచారంజరిగింది. పల్నాడు జిల్లా గురజాల రైల్వేస్టేషన్‌ ఆవరణలో జరిగిన ఈ ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. బాధిత మహిళపై నలుగురైదుగురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సామూహిక అత్యాచారం జరిగినట్లుఅధిక రక్తస్రావం కావటంతో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యపరీక్షల్లో గుర్తించారు. ఆమె స్పృహకోల్పోయి పడిపోయిన పక్కనే ఆమె మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి గంటల మధ్యలో ఆమె రైల్వేస్టేషన్‌ వద్దకు వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉండడంతో పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

*కొహెడ ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లో విషాదం నెలకొంది. ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో పెళ్ళికొడుకుపెళ్ళికూతురుపై తేనెటీగల దాడి జరిగింది. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో డాక్టర్లు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా మంగళవారం పెళ్లి జరగనున్న సమయంలో ఇలా జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

*హైదరాబాద్‌ నగరంలోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల కారణంగా శివాని సూసైడ్ కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం అర్జున్‌తో శివాని వివాహం జరిగింది. చందానగర్‌ పీఎస్‌లో భర్త అర్జున్‌ లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

*హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్‌లో నవాజ్‌ అహ్మద్‌ (15) మృతి చెందాడు. మొఘల్‌పురా పీఎస్‌ పరిధి అంధేరిగల్లీలో ఘటన చోటుచేసుకుంది. మసీదు నుంచి తిరిగివస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు

* పూరీ బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రపు స్నానం ఓ బాలుడికి తండ్రిని దూరం చేసింది. ఈ ఘటన ఒడిశాలోని పూరీలో చోటు చేసుకుంది. బాలాసోర్‌కు చెందిన బన్సిధర్ బెహెరా(35) కుటుంబసభ్యులతో కలసి వేసవి టూర్‌ కోసం పూరీ సముద్ర తీరానికి వెళ్లారు. శనివారం తండ్రీకొడుకులు సరదాగా బీచ్‌లోకి దిగి.. ఆడుతుపాడుతూ స్నానం చేశారు. అలా వారు స్నానం చెస్తూ.. సముద్రపు ఓ పెద్ద అల వైపు బన్సిధర్‌ బెహెరా దూకాడు.