NRI-NRT

కాన్సాస్‌లో శుభకృత్ ఉగాది వేడుకలు

కాన్సాస్‌లో శుభకృత్ ఉగాది వేడుకలు

కాన్సాస్ నగర తెలుగు సంఘం(TAGKC) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానిక Blue Valley Northwest High Schoolలో ఏప్రిల్ 9వ తేదిన శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిపారు. 600 మంది తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష్ రేపల్లె స్వాగత ఉపన్యాసం చేశారు. పూజారి శ్రీనివాసాచారి పంచాంగ శ్రవణం చేశారు. నూతన అధ్యక్షుడు వంశీ సువ్వారి, Trust Board Chair దుర్గ తెల్ల కొత్త కార్యవర్గాన్ని అందరికి పరిచయం చేశారు. నేహా రెడ్డి, నిధి రావు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.ఉపాధ్యక్షుడు నరేంద్ర దుదెల వందన సమర్పణ, జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగిశాయి. తెలుగు భోజనాలు అలరించాయి.