Movies

డబ్బింగ్‌ కంప్లీట్‌

డబ్బింగ్‌ కంప్లీట్‌

సమంత టైటిల్‌రోల్‌ పోషిస్తున్న పురాణ నేపథ్య చిత్రం ‘శాకుంతలం’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను సమంత సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘శాకుంతలం’లో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేసినట్లు సమంత ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. రికార్డింగ్‌ థియేటర్‌ ఫొటోను షేర్‌ చేశారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ దుష్యంతుడి పాత్రలో నటించారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో నీలిమ గుణ, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమంత నటించిన తమిళ చిత్రం ‘కాథువాక్కుల రెండు కాదల్‌’ త్వరలోనే విడుదల కానుంది.