Business

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్-2022 ఇదే..! – TNI వాణిజ్య వార్తలు

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్-2022 ఇదే..!  – TNI వాణిజ్య వార్తలు

*ప్రముఖ దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ రూపొందించిన హ్యుందాయ్ IONIQ 5 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఇటీవల జరిగిన న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో 2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా హ్యుందాయ్ IONIQ 5 ది ఆల్-ఎలక్ట్రిక్ కార్ ను బ్రెంబో ప్రకటించింది. ఈ మోడల్ 2022 వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్, 2022 వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకుంది.హ్యుందాయ్ IONIQ 5 ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఎనిమిది (28) ఆటోమొబైల్స్ కంపెనీలతో పోటీ పడింది. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ గా మూడు కార్లు ఫైనలిస్ట్‌లోకి షార్ట్‌లిస్ట్ ఆయ్యాయి.. ఫోర్డ్ ముస్టాంగ్ మాక్-ఇ, హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా ఈవీ6 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో 2022లో మొదటి మూడు ఫైనలిస్టులుగా ఉన్నాయి.

*ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఒకినావా ఆటోటెక్‌.. ప్రెయిజ్‌ ప్రో మోడల్‌కు చెందిన 3,215 యూనిట్ల వాహనాలను తక్షణమే రీకాల్‌ చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వాటి బ్యాటరీల్లో ఏదైనా సమస్యలున్నాయా అని పరీక్షించి, పరిష్కరించేందుకే వెనక్కి రప్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దేశంలో ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ కంపెనీ తన వాహనాలను రీకాల్‌ చేయడం ఇదే తొలిసారి.

*గడచిన ఆర్థిక సంవత్సరం (2021-22) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన నికర లాభం 23 శాతం వృద్ధి చెంది రూ.10,055.20 కోట్లుగా నమోదైందని బ్యాంక్‌ వెల్లడించింది. అన్ని విభాగాల్లో రుణాలకు డిమాండ్‌ పెరగటం, మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు తగ్గటం కలిసివచ్చిందని పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-21) ఇదే కాలంలో బ్యాంక్‌ లాభం రూ.8,186.51 కోట్లుగా ఉంది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 8 శాతం పెరిగి రూ.41,085.78 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 10.2 శాతం వృద్ధితో రూ.18,872.70 కోట్లుగా నమోదైనట్లు బ్యాంక్‌ పేర్కొంది. ఈ కాలంలో అన్ని విభాగాలు, ఉత్పత్తుల్లో వృద్ధితో అడ్వాన్సులు 20.8 శాతం మేర పెరిగినట్లు తెలిపింది.

*క్యాప్టివ్‌ ఇన్సూరెన్స్‌, స్టాండ్‌ఎలోన్‌ మైక్రో ఇన్సూరెన్స్‌ వంటి కొత్త రకం బీమా వ్యాపారాల్లోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎ్‌ఫడీఐ)ను అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత బీమా అభివృద్ధి, నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏఐ) చైర్మన్‌ దేవాశిష్‌ పాండా.. ఇన్సూరెన్స్‌ పరిశ్రమకు సంబంధించిన ఓ సదస్సులో ఈ దిశగా సంకేతాలిచ్చారు.

*ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అపజయాల పరంపర కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై పోరులో వరుసగా ఆరవ మ్యాచ్‌లోనూ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. లక్నో సూపర్ జెయింట్స్‌ 18 పరుగుల తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది.

* బైక్‌ ట్యాక్సీ ప్లాట్‌ఫామ్‌ ర్యాపిడో కొత్తగా 18 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,370 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. స్విగ్గీ, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీలతో పాటు ఇప్పటికే ర్యాపిడోలో పెట్టుబడులు పెట్టిన మరికొన్ని పీఈ సంస్థల నుంచి ఈ పెట్టుబడులు సమకూరాయి.