Movies

వేరీజ్ సాయిపల్లవి

వేరీజ్ సాయిపల్లవి

ఇటీవలి రోజుల్లో వరసగా విజయాలు దక్కించు కుని క్రేజీ క్రేజీగా సాగింది సాయిపల్లవి. పరిశ్రమలోకి వచ్చినతరువాత గ్లామర్ పాత్రల జోలికే వెళ్ళకుండా తనదయిన తీరులో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నది. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది ఇక , అంతే- ఆ తర్వాత బయట ఎక్కడా కన పడలా, వినపడలా. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఏవీలేవు. ‘విరాటపర్వం’ మినహా ప్రస్తుతం చేస్తున్న సినిమా మరొకటి లేదు. ఏం జరిగింద, ఏం చేస్తుంది ? అన్న ప్రశ్నలు. వైద్య విద్యను పూర్తిచేసే పనిలో పడిందా?