Movies

రాజ్యసభకు ఇళయరాజా?

రాజ్యసభకు ఇళయరాజా?

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేసే విషయం తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభసభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువసభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఇప్పుడు ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన ఇటీవల అంబేడ్కర్‌-మోదీ పుస్తకానికి ముందుమాటలో అంబేడ్కర్‌ ఆశయాలను మోదీ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా నియమించనున్నారన్న వార్త చర్చనీయాంశమైంది.