NRI-NRT

వైభవంగా “తాజా” 20వ వార్షికోత్సవం

వైభవంగా “తాజా” 20వ వార్షికోత్సవం

ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్ తెలుగు సంఘం(తాజా) 20వ వార్షికోత్సవం, ఉగాది వేడుకలను శనివారం నాడు ఆరెంజ్ పార్క్‌లోని థ్రాషర్ హోర్న్ సెంటరులో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా స్థానిక ప్రవాస చిన్నారులు, సభ్యులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అధ్యక్షుడు మిట్టపల్లి సురేష్ సభికులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 11 మంది మాజీ అధ్యక్షులను ఈ సందర్భంగా సత్కరించారు. పసందైన తెలుగు విందు భోజనం అలరించింది.