NRI-NRT

కెనడా మంత్రి పండా ప్రసాద్‌కు TCAGT సన్మానం

TCAGT Felicitates Canada Minister Prasad Panda

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో ఏరియా(TCAGT) ఆధ్వర్యంలో టొరంటో పర్యటనకు విచ్చేసిన మంత్రి పండా ప్రసాద్‌ను సత్కరించారు. అధ్యక్షురాలు దేవి చౌదరి, ట్రస్టీల బోర్డు మాజీ ఛైర్మన్ సూర్య బెజవాడలు సభకు పరిచయం చేశారు. మంత్రి ప్రసాద్ ప్రసంగిస్తూ, సామాజిక సేవల్లో పాల్గొనడం ద్వారా ప్రజలను చురుకైన పాత్ర పోషించేలా ప్రోత్సహించడం ద్వారా తెలుగు సంఘాలు శక్తివంతం కాగలవని ఆకాంక్షించారు. కోటేశ్వర పోలవరపు, శివ యెల్లాల సెక్రటరీ, మైత్రి కల్లూరి,జగన్ పైడిపర్తి, శైలజ, రాజేష్ విస్సా, శ్రీవాణి, పూర్ణచంద్రరావు వఝా, సాదా గద్దె, సురేష్ పిన్నమనేని తదితరులు పాల్గొన్నారు.