DailyDose

అగ్రరాజ్యంలో దొంగల హల్‌చల్.. మహిళను కారుతో ఢీకొట్టి..- TNI నేర వార్తలు

అగ్రరాజ్యంలో దొంగల హల్‌చల్.. మహిళను కారుతో ఢీకొట్టి..- TNI  నేర వార్తలు

* అగ్రరాజ్యం అమెరికాలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. మహిళను కారుతో ఢీకొట్టి మరీ అమె వద్ద ఉన్న విలువైన వస్తువులను చోరీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఓ మహిళ స్థానికంగా ఉన్న జ్యువలరీ షాపును తాజాగా సందర్శించింది. అక్కడ తనకు నచ్చిన కొన్ని ఆభరణాలను కొనుగోలు చేసి తిరిగి ఇంటికి పయనమైంది. ఈ క్రమంలో ఇద్దరు దుండగులు ఆమెపై కన్నేశారు. షాప్‌ నుంచి బయటి వచ్చిన వెంటనే ఆమెను వెంబడించారు. అది గమనించిన ఆమె.. వారి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తడం ప్రారంభించింది. దీంతో కారులో ఆమెను ఫాలో అయిన దుండగులు.. సదరు మహిళను వాహనంతో ఢీ కొట్టారు. అనంతరం ఆమె దగ్గర ఉన్న కొన్ని విలువైన వస్తువులను దొంగిలించి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన వారం క్రితం జరగ్గా.. అందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు తాజాగా విడుదల చేశారు. అంతేకాకుండా ఆ దుండగులను పట్టుకునేందుకు స్థానికుల సహాయాన్ని కోరుతున్నారు.

*పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం నగరానికి చెందిన బీజేపీ నేత సాయి గణేష్ కుటుంబ సభ్యులను కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ ద్వారా పరామర్శించారు. అధైర్య పడవద్దని పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సాయి గణేష్ పై పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

*రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్‌ ట్రాలీని జీపు ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతిచెందడం, ఎనిమిది మంది గాయాలపాలు కావడం తీవ్ర విషాదం నింపింది. ఝున్‌ఝును – గుఢా గోడ్జి హైవేపై ఈ మధ్యాహ్నం ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రోడ్డుపక్కన పార్క్‌ చేసిన ట్రాక్టర్‌ ట్రాలీని జీపు ఢీకొట్టడంతో జీపులో ప్రయాణిస్తున్న వారిలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందినట్టు ఝున్‌ఝును జిల్లా ఎస్పీ ప్రదీప్‌ మోహన్‌ శర్మ వెల్లడించారు. ఓ ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

*యూపీలో మరో ఆరుగురి మృతి!
మరోవైపు, యూపీలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సును ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. కుషినగర్‌ జిల్లాలో పెళ్లి వేడుకలో పాల్గొని ఎస్‌యూవీ వాహనంలో తిరిగి వస్తుండగా బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 12 మంది గాయపడినట్టు వెల్లడించారు. నిన్న రాత్రి 10.30గంటల సమయంలో ఘజియాబాద్‌-రుద్రాపూర్‌ రదారిపై ఇంద్రాపూర్‌ గ్రామం సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.

*రాజస్థాన్ ఝున్ఝునూ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ జీపు.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ ట్రాక్టర్ ట్రాలీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడ్డారు. ఝున్ఝునూ- గుఢా రోడ్ హైవే వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించారు.

*గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం దూళ్లిపాళ్ళ దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*ఏలూరు: జిల్లాలోని కొయ్యలగూడెం మండలం కన్నాపురం వద్ద లారీల నుండి దారిదోపిడికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం నుండి విజయనగరం వెళుతున్న గొర్రెలలోడు వ్యాన్‌ను అటకాయించిన దుండగులు… ఐదు వేలు నగదు, 2.5 కాసుల బంగారు గొలుసు దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కన్నాపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

*భర్త తాగి తిరుగుతూ.. కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో కలత చెందిన భార్య కుమార్తెకు విషగుళికలు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాపించి తానూ తాగి ఆత్మహత్య చేసుకుంది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని హరినగరం చెంచుగూడెంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. హరినగరం చెంచుగూడెంకు చెందిన పవన్‌కల్యాణ్‌ (చిట్టి)తో నాగేంద్రమ్మ(24)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు హన్సిక, వెన్సిక ఉన్నారు. వీరిలో హన్సిక (18 నెలలు)కు విష గుళికలు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాపించిన నాగేంద్రమ్మ తానూ తాగింది. ఇందులో మిగిలిన కూల్‌ డ్రింక్‌ను పవన్‌కల్యాణ్‌ అన్నకొడుకు నందు (5) కూడా తాగాడు. వీరిని గమనించిన బంధువులు ఆళ్లగడ్డకు తరలిస్తుండగా మార్గంమధ్యలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. నందు నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగేంద్రమ్మ తల్లి ప్రభావతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. భర్త తాగి కుటుంబ పోషణను పట్టించుకోకపోవడంతో కలత చెంది తన కుమార్తె ఇలా చేసుకుందని ప్రభావతమ్మ ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు.

*ప్రకాశం: జిల్లాలోని కంభం మండలం రావిపాడులో పాలగిరి రామ్మూర్తి అనే రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామ్మూర్తి స్వగ్రామం పొదిలి మండలం కాటువారి పాలెం. కంభం మండలం రావిపాడులోని బంధువుల ఇంటికి వచ్చిన రామ్మూర్తి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఆర్థిక ఇబ్బందులతోపాటు భార్యాభర్తలు వేర్వేరు ఊర్లలో ఉద్యోగాలు చేయాల్సి వస్తోందని కలత చెందిన బ్యాంకు ఉద్యోగిని భర్తతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

*వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ యువతి ఫోటోను షేర్‌ చేసిన యువకుడిపై ఆమె బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో ఆ యువకుడి మర్మాయవానికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా చాట్రాయి మండలం నరసింహారావుపాలెంలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. నూజివీడు సీఐ అంకబాబుచాట్రాయి ఎస్‌ఐ ప్రతాపరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ ఓ యువతి ఫొటోను వాట్సాప్‌ గ్రూపులో షేర్‌ చేశాడు. దీనిపై ఆగ్రహించిన యువతి కుటుంబీకులు శ్రీకాంత్‌ను పెద్ద మనుషుల ముందుకు పిలిపించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగి యువతి కుటుంబీకులు శ్రీకాంత్‌పై దాడి చేశారు. యువతి బంధువు శ్రీకాంత్‌ మర్మావయంపై కాలితో తన్నడంతో విలవిల్లాడాడు. ఆయనను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీకాంత్‌ పరిస్థితి బాగానేఉందని పోలీసులు చెప్పారు.

* భర్త తాగి తిరుగుతూ.. కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో కలత చెందిన భార్య కుమార్తెకు విషగుళికలు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాపించి తానూ తాగి ఆత్మహత్య చేసుకుంది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని హరినగరం చెంచుగూడెంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. హరినగరం చెంచుగూడెంకు చెందిన పవన్‌కల్యాణ్‌ (చిట్టి)తో నాగేంద్రమ్మ(24)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు హన్సిక, వెన్సిక ఉన్నారు. వీరిలో హన్సిక (18 నెలలు)కు విష గుళికలు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాపించిన నాగేంద్రమ్మ తానూ తాగింది. ఇందులో మిగిలిన కూల్‌ డ్రింక్‌ను పవన్‌కల్యాణ్‌ అన్నకొడుకు నందు (5) కూడా తాగాడు. వీరిని గమనించిన బంధువులు ఆళ్లగడ్డకు తరలిస్తుండగా మార్గంమధ్యలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. నందు నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగేంద్రమ్మ తల్లి ప్రభావతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. భర్త తాగి కుటుంబ పోషణను పట్టించుకోకపోవడంతో కలత చెంది తన కుమార్తె ఇలా చేసుకుందని ప్రభావతమ్మ ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు.

*నల్లజర్ల మండలంలో పుల్లలపాడు, నభిపేట గ్రామాలలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. రెండు కోళ్లు, రెండు కోడి కత్తులు, రూ.17,000 నగదును పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. కోడిపందాలు నిర్వహిస్తున్న 12 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

*అల్లూరి: జిల్లాలోని పాడేరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ఎదుట 230 కేజీల గంజాయి పట్టుపడింది. బ్రిజా కారులో తరలిస్తున్న గంజాయి, కారును సీజ్ చేశారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కారు ఆపి డ్రైవర్ పరారయ్యాడు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో యస్.ఐ ఫనీంద్రబాబు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.11 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.

*ఉండి మండలం, యండగండి వద్ద ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గొయ్యిలో బోల్తా పడింది. బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను రక్షించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. స్కూల్ బస్సు పాలకోడేరు మండలం, మైపాడు నుంచి యండగండి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు శ్రీవిజ్ఞాన్ స్కూలుకి చెందినదిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఉరవకొండ మండలం వై రాంపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు బెలుగప్ప మండల కేంద్రానికి చెందిన ఎర్రప్ప(65)గా పోలీసులు గుర్తించారు.

*తల్లీకొడుకుల ఆత్మహత్య కేసులో విచారణ అధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి నియమితులయ్యారు. మూడు బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇవాళ నిందితులకు నోటీసులిచ్చే అవకాశం ఉంది. ఇంకా పరారీలోనే నిందితులున్నారు. కాగా.. మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన గంగం సంతో్‌ష్ శనివారం కామారెడ్డిలో తన తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.

*మహబూబాబాద్: జిల్లాలోని మరిపెడ మండలం దేశ్యా తండాలో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. కాగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇంటిముందు కట్టేసిన ఆవు మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

* గ్రామ వాలంటీరుగా పనిచేస్తూ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఓ బాలికతో పరిచయం పెంచుకున్న యువకుడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంకకు చెందిన గ్రామవాలంటీరు బూసి సతీష్‌ (23) అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో ఆ బాలికతో పరిచయం పెంచుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో నమ్మించి అఘాయిత్యానికి తెగబడ్డాడు. విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించాడు. ఆదివారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సతీష్‌పై పోక్సో కింద కేసు నమోదుచేశారు. బాలికను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై కె.శుభశేఖర్‌ తెలిపారు.

*నగరంపాలెం (గుంటూరు) లో జీవన్మృతుడైన ఓ యువకుడి అవయవాలను దానం చేయడంతో నలుగురికి పునర్జన్మ లభించింది.రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు బ్రెయిన్‌డెడ్‌ కావడంతో కుటుంబ సభ్యుల అనుమతితో అవయవదానం చేసినట్లు రమేష్‌ ఆసుపత్రి వైద్యుడు సోనాల్‌ ఆస్థాన తెలిపారు. పెదపలకలూరులోని జన్మభూమినగర్‌కు చెందిన బొక్కిసం రాజా(38) ఈనెల 13న రాత్రి 9 గంటలకు పెదనందిపాడు వెళుతూ చిలకలూరిపేట హైవే సమీపంలో రోడ్డుప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలు కావడంతో యువకుడిని అంబులెన్స్‌లో రమేష్‌ ఆసుపత్రికి తరలించారు. మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో రోగి బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు.దీంతో రాజా కుటుంబ సభ్యులు అవయవదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావడంతో జీవన్‌దాన్‌ కేంద్రం రమేష్‌ ఆసుపత్రిలో అవయవాలను వేరు చేసి రమేష్‌ ఆసుపత్రికి లివర్‌, కిడ్నీ అవయవాలను ట్రాన్స్‌ప్లాంట్‌కు అనుమతి ఇచ్చింది. మరో కిడ్నీ విజయవాడ ఆయుష్‌ ఆసుపత్రికి తరలించారు. గుండె ఎంజీఎం ఆసుపత్రి చెన్నైకు గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేసి గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో తరలించారు. మృతుడు రాజాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

*ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రవేట్‌ బస్సు కంచికచర్ల వద్ద హైవేపై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*అబ్దుల్లాపూర్‌మెట్‌: నగర శివారులో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ జంటపై తేనెటీగలు దాడిచేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ జంట నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికి త్స పొందారు. మహబూబ్‌నగర్‌కు చెం దిన అనురాగ్‌రెడ్డి, శివాణి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. ఎల్‌బీనగర్‌లోని రాక్‌టౌన్‌ కాలనీలో ఉంటున్నారు. వీరికి మే నెల లో పెళ్లి జరగనుంది. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం ఈ నెల 11న పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగురోడ్డు సమీపంలోని కోహెడ గుట్టపైకి ఫొటో షూట్‌కు వెళ్లారు. ఫొటో ఎఫెక్ట్‌ కోసం పొగ పెట్టగా సమీపంలోని తేనె తుట్టెకు వ్యాపించి తేనెటీగలు వీరి పై దాడి చేశాయి. గుట్టపై ఆల యం ఉండడంతో గదిలోకి వెళ్లికొద్దిసేపు తలదాచుకున్నారు. మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు.

*అనంతపురం: పట్టణంలోని రాజీవ్‌ కాలనీకి చెందిన విద్యార్థి మహ్మద్‌సాబ్‌(13) ఆదివారం చిత్రావతి నదిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. షేక్‌ బాబాఫకృద్దీన గుజిరీ వ్యాపారం చేస్తూ కుమారుడు మహ్మద్‌సాబ్‌ను బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదివిస్తున్నాడు. ఆదివారం సెలవు కా వడంతో తోటి స్నేహితులతో కలిసి సమీపంలోని చిత్రావతిలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు లోతుగా వెళ్లి ము నిగిపోయాడు. తోటి స్నేహితులు సమాచారం అందించడంతో వెళ్లి బయటకు తీసేలోపు విద్యార్థి మరణించాడు. ఏఎ్‌సఐ మద్దిలేటి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*మహారాష్ట్రలోని శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుందాల్కర్ భార్య రజనీ మంగేష్ కుందాల్కర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో సంచలనం రేపింది. ఆదివారం రాత్రిగంటల ప్రాంతంలో ముంబైలోని తన నివాసంలో రజనీ ఉరివేసుకుని కనిపించింది.ఎమ్మెల్యే భార్య రజనీ ఆత్మహత్యకు పాల్పడినట్లు ముంబై పోలీసులు చెప్పారు.ముంబై పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.మంగేష్ కుందాల్కర్ కుర్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే.

*కంచికచర్ల మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పరిటాల బైపాస్‌లో వద్ద ఎదురుగా వెళ్తున్న లారీనిప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి డివైడర్‌ను కూడా ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ ప్రయాణిస్తున్న మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు సమాచారం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై ట్రావెల్స్‎లో ఉన్న ప్రయాణికులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*ఆళ్ళగడ్డ మండలంలో అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్కార్పియో కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న నంద్యాల ఆస్పత్రికి తరలించారు. మద్దిలేటి స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కడప జిల్లా మైదుకురు వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు వెంకటేశ్వర్లు స్వరాజ్యం విజయలక్ష్మిగా పోలీసులు గుర్తించారు.

*ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ గూబగుండం వద్ద జాతీయ రహదారిపై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న జీపు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరుకు చెందిన వెంకటేశ్వరు్ విజయలక్ష్మి, సామ్రాజ్యమ్మ గా పోలీసులు గుర్తించారు.

*చాట్రాయి మండలంనరసింహారావు పాలెంలో దారుణం జరిగింది. కూతురి వెంట పడుతున్నాడని ఆమె తండ్రి శ్రీకాంత్‌ అనే యువకుడిని గదిలో బంధించి మర్మంగాలపై రోకలి బండతో దాడి చేశాడు. దీంతో యువకుని పరిస్థితి విషమంగా మారింది. వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు జాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌లో అప్పుల బాధ తాళలేక రైతు ల్యాదెళ్ల రవి(ఆత్మహత్య చేసుకున్నాడు. రవి తనకున్న రెండెకరాల్లో పత్తివరి పండించుకుంటుండేవాడు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దిగుబడి రాక అప్పులు రూ. లక్షలకు చేరాయి. అవెలా తీర్చాలో అర్థం కాక సోమవారం ఉరేసుకున్నాడు.