DailyDose

జగన్ సామి ఏమిటి ఇది ?

జగన్ సామి ఏమిటి ఇది ?

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్లందరూ ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటున్నారట’

ఈ మాట వేరెవరో అన్నది కాదు.. సాక్షాత్తూ ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి సెలవిచ్చినది. ముఖ్యమంత్రి జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుని, తన అసమానమైన సమర్థతతో కేబినెట్‌లో రెండోసారి కూడా బెర్త్ సంపాదించుకున్న నారాయణస్వామి జగన్ పాలనకు ఇచ్చిన కితాబు ఈ డైలాగు!

బడుగుల కోసం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి అందరూ ఎస్సీలుగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారనేది ఈ మాట అనడంలో సదరు డిప్యూటీ సీఎం గారి కవి హృదయం. ఇలాంటి మాట ద్వారా రెడ్లు ఖచ్చితంగా గొప్ప వారని, ఎస్పీలు ఖచ్చితంగా వారికంటె చాలా చాలా అథమ వర్గం అని చెబుతున్నట్లుగా అర్థం వస్తుందనే విషయం డిప్యూటీ సీఎం గారికి తెలుసో లేదో?

ఈ డైలాగు ఒక కొత్త సందేహం పుట్టిస్తోంది. ఎస్సీల కోసం జగనన్న చాలా ఎక్కవ చేస్తున్నారని ఆయన అనవచ్చు గాక. కానీ.. అందువలన రెడ్లు మాత్రమే ఎస్సీలుగా పుట్టాలని ఎందుకు కోరుకుంటున్నారో ఆ సంగతి డిప్యూటీ నారాయణ స్వామి గారికి మాత్రమే తెలుసునేమో! – దాసరి కృష్ణ మోహన్ సీనియర్ జర్నలిస్ట్