Movies

కాజల్ కొడుకు పేరేంటో తెలుసా..?

కాజల్ కొడుకు పేరేంటో తెలుసా..?

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ దంపతులకు అభిమానులు ఇండస్ట్రీ వారు శుభాకాంక్షలు తెలిపారు. ఇక కాజల్‌కు కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డకు ఏ పేరు పెట్టబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాజల్ చెల్లి నిషా అగర్వాల్ బాబు పేరును రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో బాబు పేరు ‘నీల్ కిచ్లు’ అని తెలిపింది నిషా. కాగా, కాజల్ అగర్వాల్ ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడు.
8