DailyDose

ఛార్జింగ్‌లో పేలిన ఈ-బైక్‌ బ్యాటరీ.. ఒకరి దుర్మరణం – TNI నేర వార్తలు

ఛార్జింగ్‌లో పేలిన ఈ-బైక్‌ బ్యాటరీ.. ఒకరి దుర్మరణం – TNI  నేర వార్తలు

*నిజామాబాద్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. నిజామాబాద్‌ టౌన్‌ సుభాష్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ చార్జింగ్‌ పెట్టి పడుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వాళ్లకు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*ఒక గుడిసెకు మంటలు అంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. పంజాబ్‌లోని లూధియానాలో బుధవారం తెల్లవారుజామున ఈ విషాదకర ఘటన జరిగింది. కొందరు వలస కార్మికులు టిబ్బా రోడ్డులోని మున్సినల్‌ చెత్త డంపింగ్‌ యార్డ్‌ సమీపంలో గుడిసెలు నిర్మించుకుని ఉంటున్నారు. బుధవారం ఉదయం 2 గంటలకు ఒక గుడిసెకు మంటలంటుకున్నాయి. దీంతో అందులో నిద్రిస్తున్న కుటుంబంలోని ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు.

*మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖండ్వా జిల్లాలో కొటి గ్రామంలోని కాలువ‌లో న‌లుగురు బాలిక‌లు ప్ర‌మాద‌వ‌శాత్తూ మునిగిపోయారు. కాలువ‌లో స్నానం చేసేందుకు 11 మంది బాలిక‌లు వెళ్ల‌గా వారిలో ఆరుగురు కొట్టుకుపోయారు. వారిలో ఇద్ద‌రిని కాపాడ‌గా మ‌రో న‌లుగురు మ‌ర‌ణించారు. గ్రామంలోని సంవిద్ గురుకులం రెసిడెన్షియ‌ల్ స్కూల్‌లో వీరంతా ఐదో త‌ర‌గతి చ‌దువుతున్నారు.ఓంకారేశ్వ‌ర్ డ్యామ్‌న‌కు చెందిన కాలువ‌లో స్నానం చేసేందుకు బుధ‌వారం ఉద‌యం బాలిక‌లు వెళ్ల‌గా వైశాలి నావ‌ల్ సింగ్ అనే 13 ఏండ్ల బాలిక నీటి ప్ర‌వాహంలో ప‌డిపోయింది. ఆమెను కాపాడేందుకు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ముగ్గురు బాలిక‌లు న‌దిలో దూకి నీటి ప్ర‌వాహానికి చిక్కుకున్నారు. ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్న పోలీసులు గ‌జ ఈత‌గాళ్ల సాయంతో న‌లుగురి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు.బాత్‌రూంలో నీళ్లు రాక‌పోవ‌డంతో న‌దిలో స్నానం చేయాల‌ని తాము ఇక్క‌డ‌కు వ‌చ్చామ‌ని ఓ బాలిక తెలిపింది. విద్యార్ధినులు స్నానం చేసేందుకు స్కూల్‌లో స‌రైన వ‌స‌తులు లేవ‌ని బాలిక‌ల త‌ల్లితండ్రులు ఆరోపించారు. దీంతో వారు కాలువ‌లో స్నానానికి వెళ్ల‌క‌త‌ప్ప‌డం లేద‌ని వాపోయారు. బాలిక‌ల‌ను కేవ‌లం ఏప్రిల్‌లోనే స్కూల్‌కు పిలిపించినా అప్పుడు కూడా వారికి స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం లేద‌ని అన్నారు

*నంద్యాల: జిల్లాలోని బండిఆత్మకూర్ మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన జింక శ్రీనివాసులు అనే కౌలు రైతు అప్పుదారుల వత్తిడి తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పు చెల్లించనందుకు అప్పుదారులు ఇంటి దగ్గరకు వచ్చి దుర్భాషలాడానికి మనస్థాపం చెందిన శ్రీనివాసులు ఈ అఘాయిత్యానికి యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

*నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి ఎదుట అంగన్ వాడి ఉద్యోగి ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. రొంపిచర్ల మండలం, విప్పర్లపల్లికి చెందిన అంగన్ వాడి టీచర్ శివ నాగేంద్రం పురుగుల మందు తాగబోయింది. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు శివ నాగేంద్రంను అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతల వేదింపులే కారణంగా బాధితురాలు చెబుతోంది. తనను ఉద్యోగం మానేయాలని ఆరు నెలల నుంచి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వద్ద బోరున విలపించింది. అలాగే బాధితురాలు శివ నాగేంద్రం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

*అప్పుల బాధ తాళలేక చెట్టుకు ఉరివేసుకుని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని మేళిగనూరు గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో దేవరమణి జగదీశ్‌(40)కు అప్పులు పెరిగిపోయాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన జగదీశ్‌ మంగళవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరిన తన సొంత పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అటుగా వెళ్తున్న గ్రామస్థులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. జగదీశ్‌కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు.

*బ్యాంక్‌ నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకెళ్తున్న వ్యక్తి నుంచి వాటిని ఇద్దరు వ్యక్తులు అపహరించారు. గద్వాల జిల్లా కేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ ఎస్‌ఐ రమాదేవి వివరాల ప్రకారం.. గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన నాగేష్‌ గంజి మార్కెట్‌ యార్డ్‌లో పని చేస్తున్నారు. మంగళవారం పట్టణంలోని పోస్టాఫీస్‌ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ నుంచి రూ.3.50 లక్షలు డ్రా చేసి తీసుకెళ్తుండగా, రాజీవ్‌మార్గ్‌లో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై నాగేష్‌ వెనుక నుంచి వచ్చారు. మీ బైక్‌లో ఉన్న డబ్బులు పడిపోయాయి అని చెప్పడంతో బైక్‌ను ఆపి వెతికేందుకు ప్రయత్నించాడు. తరువాత వచ్చి చూడగా తన బైక్‌లో ఉన్న డబ్బులు పోయినట్లు గమనించాడు. తన దృష్టిని మళ్లించి తన వెనుక వచ్చిన ఇద్దరు వ్యక్తులే డబ్బులు చోరీ చేసినట్లు గుర్తించాడు. ఈ విషయమై పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమాదేవి తెలిపారు.

*సంచలనం సృష్టించిన దళిత బాలికపై అత్యాచారం కేసులో మరో 10 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కౌలూరు గ్రామానికి చెందిన తొండెపు కమలాకరరావు, ఇబ్రహీంపట్నంమండలం కొత్తగేటు గ్రామానికి చెందిన తన్నీరు మురళీకృష్ణ, నగరంలోని ఇన్నర్‌రింగురోడ్డులో గల శ్రీరామ్‌నగర్‌ 10వ లైనుకు చెందిన ఆరికట్ల రాధాకృష్ణమూర్తి, ఇబ్రహీంపట్నం మండలం కేసనకొండకు చెందిన షేక్‌ మీరావలి, కంచికచర్ల మండలం గనిఆతుకూరుకు చెందిన సయ్యద్‌ దన్వీర్‌, నందిగామ మండలం ఐతవరంనకుం చెందిన బి.కొండలరావు, కంచికచర్లకు చెందిన చింతల గోపి, కంచికచర్ల మండలం గండేపల్లికి చెందిన రేగళ్ల కల్యాణ్‌, విజయవాడ రూరల్‌, ప్రసాదంపాడుకు చెందిన బళ్లారపు తిరుమలగిరిబాబు, విజయవాడ భవానీపురంనకు చెందిన ధనుంజయరావులను వెస్టు ఇన్‌చార్జి ఏఎస్పీ కె.సుప్రజ ఆధ్వర్యంలో అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.

*ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ప్రమాదంలో 80 శాతం గాయాలపాలైన బిహార్‌లోని నలంద జిల్లాకు చెందిన మునారక్‌ పాస్‌వన్‌(46) విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.

*సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా ఉన్న 11 ఎర్రచందనం దుంగలను మంగళవారం స్వాధీనం చేసుకొన్నట్లు అనంతసాగం డీఆర్‌వో కోటేశ్వరావు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు జలాశయం నుంచి లోతట్టున 7 కి.మీ అవతల నీటిమడుగులో దాచి ఉన్న దుంగలను గుర్తించి వెలికితీశామని తెలిపారు. వాటి విలువ సుమారు లక్ష ఉంటుందన్నారు. ఇంకా నిల్వలు ఉన్నాయని గాలిస్తున్నామని చెప్పారు. సోమశిల అటవీ ప్రాంతంపై ప్రతేక నిఘా ఉంచామని, అడవిలోకి ఎవరు వెళ్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

*కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో రైతు రుద్రవేణి సదయ్య(51) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. సదయ్య 4 ఎకరాల్లో వరి, పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం 4.7 లక్షల అప్పు చేశాడు. పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెంది సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు.

* కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పమిడిముక్కల మండలం తాడంకి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు పక్క ఆగివున్న టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి యానం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా.. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

*అప్పుల బాధ తాళలేక చెట్టుకు ఉరివేసుకుని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని మేళిగనూరు గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో దేవరమణి జగదీశ్‌(40)కు అప్పులు పెరిగిపోయాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన జగదీశ్‌ మంగళవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరిన తన సొంత పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అటుగా వెళ్తున్న గ్రామస్థులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. జగదీశ్‌కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు.

*సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా ఉన్న 11 ఎర్రచందనం దుంగలను మంగళవారం స్వాధీనం చేసుకొన్నట్లు అనంతసాగం డీఆర్‌వో కోటేశ్వరావు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు జలాశయం నుంచి లోతట్టున 7 కి.మీ అవతల నీటిమడుగులో దాచి ఉన్న దుంగలను గుర్తించి వెలికితీశామని తెలిపారు. వాటి విలువ సుమారు లక్ష ఉంటుందన్నారు. ఇంకా నిల్వలు ఉన్నాయని గాలిస్తున్నామని చెప్పారు. సోమశిల అటవీ ప్రాంతంపై ప్రతేక నిఘా ఉంచామని, అడవిలోకి ఎవరు వెళ్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

*నిజామాబాద్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందడం కలకలం రేపుతోంది. నిన్న డెలివరీ అయిన కోటగిరి మండలం కొడిచేర్ల గ్రామానికి చెందిన లక్ష్మి… ఈరోజు ఉదయం అకస్మాత్తుగా మృతి చెందింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం వల్లే బాలింత మృతి చెందిదని ఆస్పత్రి వద్ద బందువుల ఆందోళనకు దిగారు

*దండేపల్లిలోని బీసీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ గదులను విద్యార్థులు బార్‌గా మార్చి బీర్‌లు పొంగించారు. మందు- మాంసంతో భారీ విందు చేసుకుని రచ్చ రచ్చ చేశారు. ఇంత జరుగుతున్నా పట్టనట్టు వ్యవహరించిన హాస్టల్ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*సూర్యాపేట: జిల్లాలోని అర్వపల్లి మండలం తిమ్మాపురం వద్ద రెండు లారీలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. క్యాబిన్‌లో ఇరుక్కొని ఇద్దరు డ్రైవర్‌లు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* నంద్యాల: జిల్లాలోని బండిఆత్మకూర్ మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన జింక శ్రీనివాసులు అనే కౌలు రైతు అప్పుదారుల వత్తిడి తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పు చెల్లించనందుకు అప్పుదారులు ఇంటి దగ్గరకు వచ్చి దుర్భాషలాడానికి మనస్థాపం చెందిన శ్రీనివాసులు ఈ అఘాయిత్యానికి యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.