Movies

టాలీవుడ్‌పై ఆ బ్యూటీ కన్ను ?

టాలీవుడ్‌పై  ఆ బ్యూటీ కన్ను ?

నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మలయాళ బ్యూటీస్‌తో కళకళలాడిపోయేది. అయితే కొంత కాలంగా ఆ ప్లేస్ ను కన్నడ ముద్దుగుమ్మలు ఆక్రమిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా అనుష్క శెట్టి టాలీవుడ్‌ను వదిలిపెట్టలేదు. ప్రస్తుతం పూజా హగ్డే, రష్మికా మందణ్ణ, నభ నటేశ్ లాంటి స్టన్నింగ్ బ్యూటీస్ తెలుగు ఇండస్ట్రీలో తమ ప్రభావం చూపిస్తున్నారు. తాజాగా వీరి లిస్ట్ లోకి చేరిన మరో కన్నడ భామ శ్రీనిధి శెట్టి. ‘కేజీఎఫ్’ పాన్ ఇండియా చిత్రంతో శాండిల్ వుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి అందులో అంతగా ప్రధాన్యం ఇవ్వలేదు దర్శకుడు. కానీ రెండో భాగంలో చెప్పుకోదగ్గ స్థాయిలో స్ర్కీన్ స్పేస్ ఇచ్చాడు. ‘కేజీఎఫ్ 2’ లో శ్రీనిధి శెట్టి గ్లామర్, అభినయం ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవడంతో ఆమెకు సౌత్‌లో వరుస అవకాశాలు వచ్చిపడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే శ్రీనిధి శెట్టి దృష్టి మాత్రం పర్టిక్యులర్‌గా టాలీవుడ్ పైనే ఉందని సమాచారం. ప్రస్తుతం ఆమెకి తెలుగులో మీడియమ్ రేంజ్ హీరోల సినిమాల్లో కథానాయికగా అవకాశాలొస్తున్నాయి. అయితే ఆమె పెద్ద హీరోల సరసన హీరోయిన్‌గా చేయడానికే మొగ్గుచూపిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల వారి సమాచారం. ఒక్క పెద్ద హీరోతో ఆమెకు ఓ సినిమా పడితే.. ఆమె పంట పండినట్టే అని చెప్పుకుంటున్నారు. మరి ఆమె కోరిక నిజంగా నెరవేరుతుందో లేదో చూడాలి.