DailyDose

పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి – TNI నేర వార్తలు

పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి – TNI  నేర వార్తలు

* అధిక ఉష్ణోగ్రతలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీలో ని కొన్ని జిల్లాలో ఒకటైన కర్నూలులో ఇవాళ విషాదం చోటు చేసుకుంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం కుప్పగల్‌లో వర్షం కారణంగా ఇద్దరు మహిళలు చెట్టుకిందకు వెళ్లారు. ఇదే సమయంలో పిడుగు చెట్టుపై పడి ఇద్దరు మహిళలు ఉరుకుందమ్మ (33) , లక్ష్మమ్మ(39)లు మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

*బేగంపేట ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీలోని జీఎంఆర్‌ మంజిల్‌ భవనంలోని మూడో అంతస్తులోని ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీ్‌స(పీఓపీ) గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భవనంలోని మూడో అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భవనంలో ఒకటి, రెండో అంతస్తులో నివాస గృహాలుండగా మూడో అంతస్తులో పీఓపీ గోదాం ఉంది. రాత్రి అకస్మాత్తుగా గో దాంలో పెద్దఎత్తున మంటలు చేలరేగడంతో మూడో అంతస్తు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఓల్డ్‌కస్టమ్స్‌ బస్తీలో రోడ్లు ఇరుకుగా ఉండటంలో ఫైర్‌ ఇంజన్‌ వచ్చినా భవనం వద్దకు చేరుకునేందుకు గంటకు పైగా సమయం పట్టింది. భవనానికి దూరంగా ఫైర్‌ఇంజన్‌ను నిలిపి పైపులతో మంటలు ఆర్పడంతో అప్పటికే మూడో అంతస్తు పూర్తిగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, సుమారు రూ.8-10 లక్షల వరకు ఆస్థినష్టం జరిగిఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసు లు కేసు నమోదు చేసుకొని అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

*ఆన్‌లైన్‌ మోసంపై ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోరుమిల్లికి చెందిన పాలింగి నాగకృష్ణ సెల్‌ఫోన్‌కు వాట్సాప్‌ మెసేజ్‌వచ్చింది. దీంతో ఈనెల11,12,13తేదీల్లో రూ.1.70లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేసి మోసపోయానని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అంగర ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపారు.

*తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లో 42 ఏళ్ల స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.మయూర్ విహార్ ఫేజ్-3లో బీజేపీ కార్యకర్త జీతూ చౌదరి తన ఇంటి బయట ఉండగా బైక్‌పై వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నాలుగుసార్లు కాల్చిచంపారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.స్థానికులు జీతూను ఓ ప్రైవేట్ కారులో ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.మృతుడు మయూర్ విహార్‌లోని బీజేపీ యూనిట్‌కు చెందిన కార్యకర్త. ఇతను నిర్మాణ రంగ వ్యాపారాన్ని నడుపుతున్నాడు.గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) ప్రియాంక కశ్యప్ తెలిపారు.నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీల ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

*ఆన్‌లైన్‌ మోసంపై ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోరుమిల్లికి చెందిన పాలింగి నాగకృష్ణ సెల్‌ఫోన్‌కు వాట్సాప్‌ మెసేజ్‌వచ్చింది. దీంతో ఈనెల11,12,13తేదీల్లో రూ.1.70లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేసి మోసపోయానని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అంగర ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపారు.

*రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించిన గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లికి చెందిన కౌలు రైతు కొరివి శ్రీనివాసరావు(54) బుధవారం మృతి చెందినట్లు తహసీల్దారు విజయజ్యోతికుమారి తెలిపారు. శ్రీనివాసరావు సొంత భూమి 1.70 ఎకరాలతో పాటు మరో 5 ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో నష్టాలపాలై సుమారు రూ.30 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ అప్పులు తీర్చే మార్గం కానరాక పోవడంతో రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకి, అక్కడి నుంచి ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

*బేగంపేట ఓల్డ్‌కస్టమ్స్‌ బస్తీలోని జీఎంఆర్‌ మంజిల్‌ భవనంలోని మూడో అంతస్తులోని ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీ్‌స(పీఓపీ) గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భవనంలోని మూడో అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భవనంలో ఒకటి, రెండో అంతస్తులో నివాస గృహాలుండగా మూడో అంతస్తులో పీఓపీ గోదాం ఉంది. రాత్రి అకస్మాత్తుగా గో దాంలో పెద్దఎత్తున మంటలు చేలరేగడంతో మూడో అంతస్తు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఓల్డ్‌కస్టమ్స్‌ బస్తీలో రోడ్లు ఇరుకుగా ఉండటంలో ఫైర్‌ ఇంజన్‌ వచ్చినా భవనం వద్దకు చేరుకునేందుకు గంటకు పైగా సమయం పట్టింది. భవనానికి దూరంగా ఫైర్‌ఇంజన్‌ను నిలిపి పైపులతో మంటలు ఆర్పడంతో అప్పటికే మూడో అంతస్తు పూర్తిగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, సుమారు రూ.8-10 లక్షల వరకు ఆస్థినష్టం జరిగిఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసు లు కేసు నమోదు చేసుకొని అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

*కూతురు స్నేహితురాలిపైనే ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రెండవ పట్టణ ఎస్‌ఐ తిరుపతయ్య తెలిపిన వివరాలివీ.. గూడూరు రూరల్‌ పరిధిలోని వేములపాళెంకు చెందిన వెంకటేశ్వర్లు ఓ ప్రయివేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె ఓ ప్రవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న గూడూరుకు చెందిన 16 ఏళ్ల బాలిక వెంకటేశ్వర్లు కుమార్తెకు స్నేహితురాలు. బుధవారం ఈ విద్యార్థిని కళాశాలకు వెళ్లడం కాస్త ఆలస్యమైంది. అప్పటికే కుమార్తెను కళాశాలలో వదిలిన వెంకటేశ్వర్లు.. ఆ బాలిక రాకను గుర్తించి మాయమాటలతో రూరల్‌ ఏరియాలోని పారిచెర్ల వద్ద అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంతలో స్థానికులు గమనించి కేకలు వేయడంతో వెంకటేశ్వర్లు పరారు కాగా.. బాలిక అక్కడి నుంచి ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనపై రెండవ పట్టణ పోలీసులకు పిర్యాదు చేశారు. ఆ మేరకు బాలికను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపతయ్య తెలిపారు.

*దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. రాజధానిలో మయూర్‌ విహార్‌ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత జీతు చౌదరిని (Jeetu Choudhary) దుండగులు తుపాకీతో కాల్చి వేశారు. అదేసమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న చౌదరిని దవాఖానకు తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారు. మయూర్‌ విహార్‌లో బుధవారం రాత్రి 8.15 గంటలకు ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఖాళీగా ఉన్న కాట్రిజ్‌లు, ఇతర ఆధారాలను సేకరించామన్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

* వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో భర్తను భార్య చంపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుపారీ గ్యాంగ్‌తో భర్తను హత్య చేయించింది. 3 నెలల తర్వాత ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసింది.
*హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ పక్కన డెడ్‌బాడీ కలకలం రేపుతోంది. మార్చురీలో ఉండాల్సిన డెడ్‌బాడీని హాస్పటల్ సిబ్బంది లిఫ్ట్ పక్కన వదిలేసి వెళ్లారు. క్లాత్ అడ్డుగా పెట్టి వెళ్లిపోయారు. డెడ్‌బాడీపై ఫిర్యాదు చేసినా పట్టింకోని వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆస్పత్రి సిబ్బంది తీరుపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.