DailyDose

భాంగ్రాతో భల్లే ఫిట్‌నెస్‌!

భాంగ్రాతో భల్లే ఫిట్‌నెస్‌!

పంజాబీ సంప్రదాయ నృత్యం.. భాంగ్రా. ఇది ఫిట్‌నెస్‌ డ్యాన్స్‌గా పాపులర్‌ అవుతున్నది. ఒక భాంగ్రా డ్యాన్స్‌ సెషన్‌తో 500-800 కేలరీల శక్తిని కరిగించుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు రోజుకు నలభై అయిదు నిమిషాలు కేటాయిస్తే చాలు. దీనివల్ల ముంజేతులు, భుజాలు, తొడల కండరాలు దృఢంగా తయారవుతాయని చెబుతున్నారు. నృత్యం మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. ఒత్తిడి మటుమాయం అవుతుంది. అలా మానసిక ఆరోగ్యమూ బావుంటుంది. పీసీఓడీ, ఊబకాయం, నెలసరి సమస్యలకు కూడా భాంగ్రాలో పరిష్కారం ఉందని పంజాబ్‌ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. భారతీయ నృత్య రీతులైన కూచిపూడి, భరతనాట్యం కూడా ఇలాంటి సత్ఫలితాలనే ఇచ్చినట్టు గతంలో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.