NRI-NRT

ఊరి కోసం. నాసా ఆహ్వానాన్ని వదునుకొంది..

Auto Draft

పైసా ఖర్చు లేకుండా అమెరికా వెళ్లే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కదా! కానీ 17 ఏళ్ల జయలక్ష్మి మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని కాదనుకొని ఆ డబ్బుని తన గ్రామ సమస్యలను తీర్చడానికి వినియోగించింది.

* తమిళనాడులోని అదనకొట్ట గ్రామానికి చెందిన జయలక్ష్మి చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. తర్వాత తల్లి ఆళగువల్లి మతిస్థిమితం కోల్పోయింది. తల్లితో పాటు తమ్ముడు బాధ్యత తీసుకొని తన తొమ్మిదో ఏట నుంచే కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచింది జయలక్ష్మి. ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటూనే సెలవు రోజుల్లో వ్యవసాయ కూలి గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూంది. ఇంటర్ చదువుతున్న ఆమె గతేడాది నాసా నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొంది. జిల్లాలో ప్రథమ ర్యాంక్ సాధించి నాసా పర్యటనకు ఆహ్వానం అందుకుంది. ఆమె అమెరికా వెళ్లేందుకు అవసరమైన విమాన చార్జీలను భరించడానికి ‘స్వర్గ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ రూ.య1.6 లక్షల ఇవ్వటానికి సిద్ధమయింది. ఇంకెవరైనా అయితే, ఎంచక్కా అమెరికా వెళ్లి వస్తారు కదా. కానీ ‘ఆ డబ్బు మా ఊరి కోసం ఖర్చు చేయండని’ ఆ స్వచ్ఛంద సంస్థలు కోరింది జయలక్ష్మి. మా ఊళ్లో 125 కుటుంబాలు ఉంటే ఏ ఒక్క ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం లేదు. చిన్నప్పటినుంచి బహిర్భూమి వెళ్లాలంటే భయం. రాత్రిపూట ఎవరినైనా తోడు తీసుకువెళ్లాలి. ఈ సమస్యను పరిష్కరించాలని చాలా ఖర్చు అవుతుంది అన్నారు. నేను అమెరికా వెళ్లడం కన్నా ఆ డబ్బుతో గ్రామ సమస్యను పరిష్కరించడం ముఖ్యం అనుకున్నా. ఆ నగదును మా ఊళ్లో టాయిలెట్స్ నిర్మాణానికి అందించమని ఎన్జీవో ను కోరా. అందుకు వాళ్లు ఒప్పుకోవడం నా అదృష్టం. ఊళ్లోని 125 ఇళ్లకు రూ. 20 వేల చొప్పున నగదు సహాయాన్ని అందించారు. ఆ మొత్తంతో యువత సహాయాన్ని తీసుకొని గ్రామ వాసులే సొంతంగా నిర్మాణాలను చేపట్టారు. అలా జూలైలో ప్రారంభించిన టాయిలెట్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. ఈ విషయం తెలుసుకున్న మా జిల్లా కలెక్టర్, మరో ఎన్జీవో నన్ను అమెరికాకు పంపించడానికి అయ్యే ఖర్చులను ఏర్పాటు చేశారు. కానీ కోవిడ్ వల్ల నా ప్రయాణం వాయిదా పడింది. పెద్దయ్యాక కలెక్టర్ అయ్యి. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా’ అంటుంది జయలక్ష్మి.