Movies

షూటింగ్‌లో భయపడ్డా!

Auto Draft

స్వతహాగా తాను భయస్తురాలినని..అందుకే హారర్‌ సినిమాల్లో నటించడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పింది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. హిందీ అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణీ అవుతున్న ఈ భామ నటించిన హారర్‌ చిత్రం ‘భూల్‌ భులయ్య-2’ చిత్రీకరణ జరుపుకుంటున్నది. గురువారం కియారా అద్వాణీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను రీట్‌ అనే పాత్రలో కనిపించబోతున్నా. నా పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో భయపెడుతుంది. ఇలాంటి నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించడం చాలా కొత్తగా అనిపించింది. ఒక్కోసారి షూటింగ్‌ టైంలో కూడా భయపడ్డా. తెరపై నన్ను నేను చూసుకొని నమ్మలేకపోయాను. హారర్‌ జోనర్‌ ఇష్టం లేకపోయినప్పటికీ నటిగా అన్ని రకాల పాత్రల్ని సమర్థవంతంగా పోషించగలననే భరోసా కోసం ఈ సినిమాలో భాగమయ్యా’ అని చెప్పుకొచ్చింది. అనీష్‌బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 20న ప్రేక్షకులముందుకురానుంది. కియారా అద్వాణీ తెలుగులో రామ్‌చరణ్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.