Devotional

మహా ‘అన్న’ ప్రసాదం – TNI ఆధ్యాత్మికం

మహా ‘అన్న’ ప్రసాదం – TNI ఆధ్యాత్మికం

1. అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న.. అందుకే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చినవెంకన్న దేవస్థానం నిత్యాన్నదాన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 30 నుంచి 40 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఎంతో రుచికరమైన స్వామివారి అన్నప్రసాదం ఆకలిని తీరుస్తోంది. సాధారణ రోజుల్లో నిత్యం ఐదు వేల మందికి, శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 10 నుంచి 15 వేల మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని దేవస్థానం అందజేస్తోంది.
*** రాత్రి వేళ బస చేసే యాత్రికులకు, అలాగే కాలినడకన విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రాత్రి వేళల్లో సైతం ఈ అన్నప్రసాద వితరణను జరుపుతున్నారు. శ్రీవారి దర్శనార్థం శని, ఆదివారాల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే భక్తులకు అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఆకలితో వచ్చే వారికి లేదనకుండా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. అందుకే ఈ నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంకులో జమచేసిన ఫిక్స్‌›డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో పాటు, ఒకరోజు అన్నదానం కోసం భక్తులు నెలపాటు చెల్లించే విరాళాలతో ఈ అన్నప్రసాద వితరణను జరుపుతున్నారు.
**మెనూ ఇది..
దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు ఒక మెనూ ప్రకారం స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. నిత్యం అన్నప్రసాద వితరణలో గూడాన్నం ప్రసాదాన్ని, అలాగే పప్పు, పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగను అందిస్తున్నారు.
*గుర్తింపు ఇలా..
రూ.3,65,000 చెల్లించే భక్తులను మహాన్నదాతలుగా, రూ.1,00,000 నుంచి 3,65,000 లోపు చెల్లించే వారిని మహారాజ పోషకులుగా, రూ.50 వేల నుంచి రూ.1,00,000 లోపు చెల్లించే వారిని రాజపోషకులుగా గుర్తిస్తున్నారు. అలాగే 2019 అక్టోబర్‌ వరకు రూ.1,116గా ఉన్న శాశ్వత విరాళాన్ని రూ.2,116లకు పెంచారు. ఈ విరాళాన్ని చెల్లించే వారిని శాశ్వత అన్నదాతలుగా గుర్తిస్తారు.
*పథకం వివరాలివీ..
పథకం ప్రారంభం: 1994 డిసెంబర్‌ 8.
ఇప్పటి వరకు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ చేసిన డిపాజిట్‌ విరాళాలు:రూ. 62,80,68,338
వీటిపై వస్తున్న నెలసరి వడ్డీ: 28 లక్షలు.
ఒకరోజు అన్నదానం నిమిత్తం భక్తులు
రూ.216 చెల్లించడం ద్వారా నెలకు వస్తున్న విరాళాలు: రూ.15 లక్షల నుంచి 20లక్షలు
ఇప్పటి వరకు మహాన్నదాతలుగా గుర్తింపు పొందినవారు: 65 మంది.
మహారాజ పోషకులుగా గుర్తింపు పొందిన వారు: 1,203 మంది.
రాజ పోషకులుగా గుర్తింపు పొందిన వారు:985 మంది
శాశ్వత అన్నదాతలుగా గుర్తింపు పొందిన వారు: 1,80,000 మంది
**అన్నదానం జరుగు వేళలు..
సోమవారం నుంచి శుక్రవారం వరకు:
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.
శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు.

2. Mathuraలోని శ్రీ కృష్ణ దేవాలయం లౌడ్ స్పీకర్ల స్విచ్ ఆఫ్మ
థుర నగరంలోని శ్రీ కృష్ణ దేవాలయంలో లౌడ్ స్పీకర్ల స్విచ్ ఆఫ్ చేశారు. మతపరమైన ప్రదేశాల్లో సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేర మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయ సముదాయంలోని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను, సౌండ్ సిస్టమ్‌లను స్విచ్ ఆఫ్ చేశారు.శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయ సముదాయంలోని ఎత్తైన మందిర భవనం భగవత్ భవన్‌పై ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్‌లను స్విచ్ ఆఫ్ చేసినట్లు శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్, శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ సెక్రటరీ కపిల్ శర్మ తెలిపారు.భగవత్ భవన్ ఆలయంలోని సౌండ్ సిస్టమ్‌లు ఇకపై చాలా తక్కువ వాల్యూమ్‌లో ప్లే చేస్తామని శర్మ తెలిపారు.తద్వారా కీర్తన-భజన ధ్వని ఆలయ సముదాయం దాటి వెళ్లదు.గతంలో ఆలయంలో ఉదయం మంగళ హారతి నుంచి అన్ని మతపరమైన కార్యక్రమాలలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించారని శర్మ చెప్పారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతి ఒక్కరికి తన మతపరమైన సిద్ధాంతాల ప్రకారం తన ఆరాధన పద్ధతిని అనుసరించే స్వేచ్ఛ ఉందని చెబుతూనే, మతపరమైన ప్రదేశాల్లో ధ్వని వ్యవస్థల పరిమాణం మితంగా ఉండాలని సలహా ఇచ్చారు.

3. ఈ – కామ‌ర్స్ ద్వారా పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల విక్ర‌యం – జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం
టిటిడి త‌యారు చేస్తున్న 15 ర‌కాల పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల‌తో పాటు, ఆల‌యాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో త‌యారు చేస్తున్న అగ‌ర‌బ‌త్తీలు, ఫోటో ఫ్రేమ్ త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌ను ఈ – కామ‌ర్స్ ప్లాట్ ఫాంల ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేయ‌డానికి స‌హ‌క‌రించాల‌ని జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం కోరారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని త‌న ఛాంబ‌ర్‌లో అధికారులు, జియో ప్లాట్ ఫాం ప్ర‌తినిధులతో బుధ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి అగ‌ర‌బ‌త్తీల‌కు భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని దీనివ‌ల్ల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని 15 వేల నుండి 30 వేల ప్యాకెట్ల‌కు పెంచ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. పంచ‌గ‌వ్య, ఫోటో ఫ్రేమ్ త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌కు ఈ త‌ర‌హా ఆద‌ర‌ణ ల‌భించేలా చేయ‌డానికి త‌గిన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల‌ని కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌చార ప్ర‌ణాళిక‌లు కూడా సూచించాల‌న్నారు. బెంగుళూరు, చెన్నై, వైజాగ్‌, హైద‌రాబాద్ స‌మాచార కేంద్రాల్లో ఈ ఉత్ప‌త్తుల విక్ర‌యాలు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లో ఢిల్లీ, భువ‌నేశ్వ‌ర్‌లోని స‌మాచార కేంద్రాల్లో విక్ర‌యాలు ప్రారంభిస్తామ‌న్నారు. ఈ కామ‌ర్స్‌లో విక్ర‌యాల కోసం అవ‌స‌ర‌మైతే స‌మాచార కేంద్రాల‌ను స్టాక్ పాయింట్లుగా కూడా ఉప‌యోగిస్తామ‌న్నారు. తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదంలాగే పంచ‌గ‌వ్య, అగ‌ర‌బ‌త్తీలు, ఫోటో ఫ్రేమ్ త‌దిత‌ర ఉత్ప‌త్తులు కూడా స్వామివారి ప్ర‌సాదాలు గానే భ‌క్తులు భావించేలా చేయ‌డం ద్వారా ఈ – కామ‌ర్స్‌లో వీటిని భ‌క్తుల‌కు మ‌రింత చేరువ చేయ‌వ‌చ్‌ఈని టిటిడి ఐటి స‌ల‌హాదారు శ్రీ అమ‌ర్ సూచించారు. ఇందుకోసం డిజిట‌ల్ మీడియాలో ప్ర‌చారానికి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. అలాగే టిటిడి అఫ్‌లైన్ ద్వారా జ‌రుపుతున్న విక్ర‌యాల‌కు బ్యాంకుల‌ను అనుసంధానం చేసే పివోఎస్ విధానాన్ని త‌యారు చేసి ఇస్తామ‌న్నారు. అద‌న‌పు ఎఫ్ఎసిఏవో శ్రీ ర‌విప్ర‌సాద్‌, సిఐవో శ్రీ సందీప్ పాల్గొన‌గా జియో ప్లాట్ ఫాం ప్ర‌తినిధులు వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు.

4. సికింద్రాబాద్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన స్వర్ణ బంధన మహా కుంభాభిషేకం లో రాష్ట్ర పశుసంవర్ధకమత్స్యపాడి పరిశ్రమల అభివృద్ధిసినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి తో పాటు పద్మారావు నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.

5. 9వ రోజుకు చేరిన ప్రాణహిత పుష్కరాలు
ప్రాణహిత పుష్కరాలు 9వ రోజుకు చేరాయి. కోటపల్లి (మం)అర్జున గుట్ట వద్ద పుష్కర ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. ఏపీ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం, మజ్జిగ, మంచినీటిని దాతలు అందిస్తున్నారు. వేమనపల్లిలోని పుష్కర ఘాట్‌లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.