NRI-NRT

బర్మింగ్ హామ్ లో భద్రాచలం.. ఘనంగా సీతారాముల కల్యాణం

బర్మింగ్ హామ్ లో భద్రాచలం.. ఘనంగా సీతారాముల కల్యాణం

యూకేలోని బర్మింగ్హామ్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు . శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 10 న నిర్వహించిన ఈ కార్యక్రమానికి 3 వేలకు పైగా భక్తులు హాజరయ్యారు . వేదపండితులు వేలమూరి వెంకటరమణ , ముకురాల సిద్ధార్థశర్మ వేదోక్తపూర్వకంగా కల్యాణోత్సవం జరిపారు . కార్యక్రమంలో భాగంగా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి వ్యాఖ్యానం అందించారు . కల్యాణోత్సవం అనంతరం భక్తులకు ప్రసాదంతో పాటు ప్రతి కుటుంబానికి తిరుమల శ్రీవారి లడ్డూ , రామపరివార్ కాయిన్ , రామకోటి పుస్తకాలను నిర్వాహకులు అందజేశారు .
Whats-App-Image-2022-04-22-at-12-47-00-PM-1
Whats-App-Image-2022-04-22-at-12-47-00-PM