NRI-NRT

హీరో భార్యతో ఎలాన్ మస్క్ రాసలీలలు.. విడాకుల కేసులో ట్విస్ట్!

హీరో భార్యతో ఎలాన్ మస్క్ రాసలీలలు.. విడాకుల కేసులో ట్విస్ట్!

హాలీవుడ్ స్టార్ జానీడెప్, అతడి మాజీ భార్య అంబర్​హెర్డ్ విడాకుల వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు వచ్చిన జానీడెప్.. కీలక విషయాలు వెల్లడించారు.

పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ ఫేమ్, హాలీవుడ్ స్టార్ హీరో జానీడెప్ విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తన మాజీ భార్య, ప్రముఖ నటి అంబర్​హెర్డ్​పై రూ.380 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసిన జానీ డెప్.. దీనిపై వర్జీనియాలోని ఫెయిర్​ఫాక్స్​లోని కౌంటీ కోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యారు. తన భార్య ఎప్పుడూ తనను మానసికంగా వేధించేదని కోర్టులో ఆరోపించారు. ‘అంబర్​హెర్డ్ ఆరోపణలు చాలా దారుణమైనవి.. బాధకలిగించేలా ఉన్నాయి. నా జీవితంలో ఏ మహిళపైనా నేను చెయ్యి చేసుకోలేదు’ అని జానీ డెప్ చెప్పుకొచ్చారు.

పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ మూవీలో జానీ డెప్అయితే, అంబర్​ హెర్డ్​ను కుళ్లిపోయిన శవంగా జానీడెప్ అభివర్ణిస్తూ తన స్నేహితుడికి సందేశాలు పంపాడని నటి తరఫున హాజరైన న్యాయవాది వాదించారు. ఈ మేరకు ఆ స్నేహితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో పాటు ఆమెను దుర్భాషలాడుతూ వ్యాఖ్యలు చేశారని కోర్టులో ఆరోపించారు. మరోవైపు, అంబర్​హెర్డ్ తనపై చెయ్యి చేసుకున్నారని.. నటి ఇంట్లో పని చేసిన మహిళ ఆరోపించారు. జీతం పెంచాలని అడిగినందుకు చెంప ఛెళ్లుమనిపించారని అన్నారు. ఏ కారణాలు లేకుండానే అప్పుడప్పుడూ ఆరిచేవారని చెప్పుకొచ్చారు. కాగా, జానీ డెప్​పై అంబర్​హెర్డ్ ఇదివరకే రూ.760 కోట్ల పరువునష్టం వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేరు ఈ కేసులో మార్మోగుతోంది. కోర్టు డాక్యుమెంట్లలో మస్క్ పేరు ఉంది. జానీ డెప్ ఇంట్లో లేనప్పుడు అంబర్​హెర్డ్​తో కలిసి ఎలాన్ మస్క్ నడిపిన రాసలీలలకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. అంబర్​హెర్డ్​తో పాటు మరో నటి కారా డెలెవింగ్నెతో కలిసి మస్క్ రొమాన్స్ చేశారన్నది ఈ ఆరోపణల సారాంశం. 2016లో లాస్ఏంజిలిస్​లోని జానీడెప్, అంబర్​హెర్డ్​ల అపార్ట్​మెంట్​లోనే వీరు అఫైర్ నడిపారని తెలుస్తోంది. దీనిపై ఎలాన్ మస్క్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ కేసు విచారణ నెల రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.