Devotional

వెంకన్నకు ముడుపుల వైభవం – TNI ఆధ్యాత్మికం

వెంకన్నకు ముడుపుల వైభవం  – TNI ఆధ్యాత్మికం

1. వారంలో రెండుసార్లు రూ.5 కోట్లు దాటి రికార్డు ఏప్రిల్‌లో 20 రోజులకే 85.97 కోట్ల కానుకలు. తిరుమలలో దర్శనాల సంఖ్యకు మించి హుండీ ఆదాయం లభిస్తోంది. ప్రతిరోజూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య సగటున 60వేలే ఉన్నప్పటికీ హుండీ కానుకలు మాత్రం సగటున రూ.3కోట్లు తగ్గడం లేదు. కరోనాకు ముందు సాధారణ రోజుల్లో హుండీ ఆదాయం రూ.1.50కోట్ల నుంచి రూ.2.50 కోట్లు ఉండగా, రద్దీ రోజుల్లో రూ.3కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ వచ్చేది. కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో మార్చి మొదటివారం నుంచి భక్తుల సంఖ్య దాదాపు 60నుంచి 70వేల వరకు ఉంటోంది. మార్చిలో 19,72,656 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.128 కోట్లు లభించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఆర్జిత సేవలను కూడా తిరిగి ప్రారంభించారు.ఈ నెల 1 నుంచి 20 వరకు 13,81,539 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, రూ.85.97 కోట్ల హుండీ ఆదాయం లభించింది. ఈ వారంలో రెండుసార్లు ఈ మొత్తం రూ.5కోట్లు దాటింది. 14న రూ.5.11కోట్లు రాగా, 20న రూ.5.14 కోట్లు లభించింది. కొండకు వస్తామని మొక్కుకునే భక్తులు ఇంట్లో ముడుపుకట్టి ఎంతో కొంత దాచిపెడతారు. దర్శనానికి వచ్చినపుడు ఆ ముడుపు తెచ్చి హుండీలో సమర్పిస్తారు. ఈ ముడుపులు వేస్తుండటంతో ఈ మొత్తం పెరుగుతోందని భావిస్తున్నారు.

2. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవలకు సంబంధించి జూలై నెల టికెట్లను 25న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌తో పాటు ‘గోవింద’ యాప్‌లో టికెట్ల కోటాను విడుదల చేస్తారు.

3. రాష్ట్రంలో 11 ప్రధాన ఆలయాలు
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకూ వీటి సంఖ్య 8 కాగా కొత్తగా మరో మూడింటిని ప్రధాన ఆలయాలుగా దేవదాయ శాఖ గుర్తించింది. ప్రస్తుతం ఈ జాబితాలో శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, ఇంద్రకీలాద్రి, కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, పెనుగంచిప్రోలు ఆలయాలు ఉన్నాయి. వీటికి జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులు ఈవోలుగా ఉండాలి. కొత్తగా విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి ఆలయం, కాసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం, మహానందిలోని మహానందీశ్వరస్వామి దేవాలయాలు పెద్ద ఆలయాల జాబితాలో చేరాయి. వీటికి డిప్యూటీ కమిషనర్‌ స్థాయి అధికారులు ఈవోలుగా ఉంటారు. ఈ మేరకు దేవదాయ చట్టంలోని పలు నిబంధనలకు ఆ శాఖ సవరణలు చేసింది. అలాగే ఆలయాల్లో పోస్టుల భర్తీకి దేవదాయ శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈవో పేపర్‌ నోటిఫికేషన్‌ జారీచేసి నేరుగా వచ్చేవారిని పరీక్ష ద్వారా భర్తీ చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితిని 28నుంచి 34ఏళ్లకు పెంచారు. ఇప్పటి వరకూ జూనియర్‌ అసిస్టెంట్‌ విద్యార్హత ఇంటర్మీడియట్‌ కాగా దానిని డిగ్రీకి మార్చారు. ఇంజనీరింగ్‌ విభాగంలో కొత్తగా ఈఈ పోస్టులు సృష్టించారు. దీనికి కనీస విద్యార్హత బీటెక్‌కు పెంచారు.

4. అమర్‌నాథ్‌ యాత్రికులకు మెడికల్‌ సర్టిఫికెట్లు
అమర్‌నాథ్‌ వెళ్లే యాత్రికులకు అవసరమైన మెడికల్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో వైద్యపరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేందుకు నిర్ధేశించిన మెడికల్‌ బోర్డు నుంచి తప్పనిసరిగా ఆరోగ్య ధృవీకరణ పత్రం పొందాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసింది.కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో గత రెండేళ్లుగా అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేశారు. ఈ కారణంగా ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రతివారం 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని, ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే వరుస క్రమంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. మెడికల్‌ బోర్డు కమిటీ ఎంపిక చేశామని, నితిన్‌కాబ్రా (కార్డియాలజీ) సత్యనారాయణ (ఆర్ధోపెడిక్‌), కృష్ణమూర్తి(ఫల్మనాలజీ), రవీందర్‌ (జనరల్‌ మెడిసిన్‌) వైద్యులు బోర్డు సభ్యులుగా కొనసాగుతారని సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. దరఖాస్తు ఇలా… యాత్రికులు ఆథార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో గాంధీ మెడికల్‌ రికార్డు సెక్షన్‌లో సంప్రదించాలి. దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత వరుస క్రమంలో వచ్చే తేదీని నిర్ణయిస్తారు. సదరు తేదీ రోజు గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం మొదటి అంతస్తు ఎంఆర్‌డీ సెక్షన్‌ కార్యాలయంలో మెడికల్‌ బోర్డు వైద్యుల నిర్వహించే వైద్య పరీక్షలకు నేరుగా హాజరుకావాలి.
చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవీ.. కంప్లీట్‌ బ్లడ్‌ ప్రొఫిల్లింగ్‌ (సీబీపీ), ఆర్థరైటీ సెడిమెంటేషన్‌ రేట్‌ (ఈఎస్‌ఆర్‌), కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌ (సీయు ఈ), గ్లూకోజ్‌ ర్యాండమ్‌ బ్లడ్‌ సుగర్‌ (జీఆర్‌బీఎస్‌) బ్లడ్‌ యూరియా, సీరం క్రియేటిన్, ఎలక్టోకార్డియా గ్రామ్‌(ఈసీజీ), ఎక్స్‌రే చెస్ట్‌ వైద్యపరీక్షల నివేదికలను కమిటీ ముందుంచాలి. యాభై ఏళ్ల వయసు పైబడినవారు పై నివేదికలతోపాటు రెండు మోకాలి (బోత్‌ నీస్‌) ఎక్స్‌రేలు జతచేయాలి. మెడికల్‌ బోర్డు సభ్యులు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

5. దేశంలో ప్రస్తుతం బుల్డోజర్ యుగం నడుస్తోంది. బుల్డోజర్ ఏం చేస్తోందిఎక్కడ కూల్చివేతలకు పాల్పడుతోందనే చర్చ ఎక్కువగానే జరుగుతోంది. అయితే నిన్నటి వరకు అక్రమ కట్టడాలురోహింగ్యా నివాసాలపైకి మాత్రమే వెళ్లిన బుల్డోజర్తాజాగా ఒక గుడిని కూల్చేయడం చర్చనీయాంశమైంది. రాజస్తాన్‌లోని అల్వాజ్ జిల్లాల సరై మొహల్ల గ్రామంలో ఏళ్ల క్రితం నాటి ఒక గుడిని బుల్డోజర్‌తో కూల్చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై సరై మొహల్ల నగర పంచాయతీ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్‌అల్వార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్స్థానిక ఎమ్మెల్యే రాజ్‌ఘర్‌లపై పోలీసు కేసు నమోదు అయింది.రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గుడిని కూల్చేస్తున్న వీడియోను భారతీయ జనతా పార్టీ ఐసీ సెల్ విభాగం ఇంచార్జ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కరౌలీజహంగిర్‌పురిలో జరిగిన దానికి కన్నీళ్లు పెట్టుకున్న వారే ఇప్పుడు హిందువుల నమ్మకాన్ని దెబ్బ తీశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న సెక్యూలరిజంఅని విమర్శలు గుప్పించారు.