MoviesNRI-NRT

యూకే పార్లమెంటులో రాధికకు పురస్కారం

యూకే పార్లమెంటులో రాధికకు పురస్కారం

కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపై విజయపంథా కొనసాగిస్తూ రాడాన్‌ మీడియా వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టరుగా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ నటి రాధికకు యూకే పార్లమెంట్‌లో పురస్కారం లభించింది. ‘ఉమెన్స్‌ సెలెబ్రేషన్స్‌-2022’లో భాగంగా బ్రిటన్‌లోని తమిళ్‌ స్టడీస్‌ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని యూకే పార్లమెంట్‌ సభ్యురాలు మారియా మిల్లర్‌ నిర్వహించారు.
Whats-App-Image-2022-04-22
ఇందులో ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలను ఎంపిక చేసి అవార్డులతో సన్మానించారు. ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో నటి రాధిక ఒకరు. ‘యూకే పార్లమెంటులో ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా, గర్వంగాను ఉంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన సెలెక్టర్లకు, కొన్ని దశాబ్దాలుగా నాకు మద్దతిస్తూ ఆదరిస్తున్న సినిమా, టీవీ పరిశ్రమలకు, కుటుంబ సభ్యులకు రాధిక ధన్యవాదాలు’ తెలిపారు.
Whats-App-Image
imagehosting